తెలుగు న్యూస్ / ఫోటో /
AP Weather Report : ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, మూడు రోజులు భారీ వర్ష సూచన
AP Weather Report : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం(27-30నవంబర్) వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు (నవంబర్ 25న) దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
(2 / 6)
మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వాయుగుండంవెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం(27-30నవంబర్) వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
(3 / 6)
ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 24న అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.
(4 / 6)
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.
(5 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అధికారులు తెలిపారు.
(6 / 6)
రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఇతర గ్యాలరీలు