(1 / 9)
ప్రస్తుతం హిందీలో 'బిగ్ బాస్ 18' గురించి చాలా హైప్ ఉంది. ఈ షో గురించి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. అందరి దృష్టి ఈ సీజన్ విన్నర్ పైనే ఉంది. అయితే, 'బిగ్ బాస్ 18' ఫినాలేకు ఇంకా సమయం ఉంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందు ఇప్పటి వరకు బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన టీవీ నటీమణులు, లేడి కంటెస్టెంట్స్ గురించి తెలుసుకుందాం.
(2 / 9)
'బిగ్ బాస్ ఓటీటీ 3' విజేతగా సనా మక్బూల్ నిలిచి ట్రోఫీ ఎత్తింది. సనా మక్బూల్, అయితే, ఈ సీజన్‌లో కృతికా మాలిక్, సాయి కేతన్ రావు, నేజీ, రణవీర్ షోరే టాప్ 5లో నిలిచారు.
(3 / 9)
బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్ టీవీ నటి తేజస్వి ప్రకాష్, ఈ సీజన్‌లో కరణ్ కుంద్రా తేజస్వి ప్రకాష్ బాగా ఇష్టపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు.
(4 / 9)
టీవీ నటి దీపికా కక్కర్ బిగ్ బాస్ హిందీ 12వ సీజన్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే, ఆమె అందుకుగానూ బహుమతిగా రూ. 30 లక్షలు పారితోషికం అందుకుంది.
(5 / 9)
'భాభీ జీ ఘర్ పర్ హై' ఫేమ్ 'అంగూరి భాబీ' పాత్ర పోషించిన నటి శిల్పా షిండే బిగ్ బాస్ హిందీ సీజన్ 11 టైటిల్ గెలుచుకుంది.
(6 / 9)
'బిగ్ బాస్ సీజన్ 7' ట్రోఫీని గెలుచుకున్న గౌహర్ ఖాన్ పలు మ్యూజిక్ వీడియోల్లో కనిపించారు. బిగ్ బాస్ టైటిల్ గెలవడంతో ఆమె మరింత పాపులర్ అయ్యారు.
(7 / 9)
బిగ్ బాస్ హిందీ సీజన్ 6 విజేతగా నిలిచింది ఊర్వశి ధోలాకియా. బిగ్ బాస్ 6 హిందీ విన్నర్‌గా ట్రోఫీ ఎత్తిన ఊర్వశి రూ. 50 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది.
(8 / 9)
బిగ్ బాస్ హిందీ టైటిల్ గెలిచిన లేడి కంటెస్టెంట్స్ జాబితాలో జుహీ పర్మార్ పేరు కూడా ఉంది. బిగ్ బాస్ హిందీ 5 సీజన్ ట్రోఫీ గెలుచుకున్న జుహీ ఏకంగా కోటి రూపాయల పారితోషికం అందుకుంది.
(9 / 9)
శ్వేతా తివారీ 'బిగ్ బాస్' మొదటి మహిళా విన్నర్‌గా నిలిచింది. 'బిగ్ బాస్ హిందీ సీజన్ 4' విజేతగా నిలిచిన శ్వేతా తివారి ట్రోఫీతో పాటు కోటి రూపాయలు కూడా గెలుచుకుంది.
ఇతర గ్యాలరీలు