Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్ - బిగ్‌బాస్ ఫ‌స్ట్ ప్లేస్ - టాప్ త్రీలోకి వ‌చ్చిన స‌రిగ‌మ‌ప‌-bigg boss 8 telugu to adivaram with star maa parivaram telugu tv shows latest trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్ - బిగ్‌బాస్ ఫ‌స్ట్ ప్లేస్ - టాప్ త్రీలోకి వ‌చ్చిన స‌రిగ‌మ‌ప‌

Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్ - బిగ్‌బాస్ ఫ‌స్ట్ ప్లేస్ - టాప్ త్రీలోకి వ‌చ్చిన స‌రిగ‌మ‌ప‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 24, 2024 06:43 PM IST

Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ టాప్‌లో నిలిచింది. ఈ రియాలిటీ షోకు వీకెండ్స్‌లో 5.28 టీఆర్‌పీ రాగా...వీక్‌డేస్‌లో 4.25 వ‌చ్చింది. టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ త‌ర్వాత ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం, స‌రిగ‌మ‌ప నిలిచాయి.

టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌
టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌

Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ వీక్ కూడా బిగ్‌బాస్ టాప్‌లో నిలిచింది. వీకెండ్స్‌తో పాటు వీక్‌డేస్‌లో బిగ్‌బాస్ హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో వీకెండ్స్‌లో బిగ్‌బాస్‌కు అర్బ‌న్ రూర‌ల్ ఏరియాల్లో క‌లిపి 5.28 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. వీకెండ్స్‌లో అర్బ‌న్ ఏరియాలో బిగ్‌బాస్ చ‌క్క‌టి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంటోంది. 6.54 టీఆర్‌పీని ద‌క్కించుకున్న‌ది. వీకెండ్స్‌తో పోలిస్తే వీక్‌డేస్‌లో మాత్రం బిగ్‌బాస్ క్రేజ్ కొంత త‌గ్గింది. వీక్‌డేస్‌లో అర్బ‌న్ రూర‌ల్ ఏరియాల్లో క‌లిపి 4.25 టీఆర్‌పీ రేటింగ్, అర్బ‌న్ ఏరియాలో 5.32 టీఆర్‌పీ వ‌చ్చింది.

అప్పుడు 18.9...

బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్స్‌తో పోలిస్తే ప్ర‌స్తుతం టీఆర్‌పీ రేటింగ్ భారీగా ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. లాంఛింగ్ ఎపిసోడ్ 18.9 టీఆర్‌పీతో అద‌ర‌గొట్టింది. డ్రామా అంత‌గా ప‌డ‌క‌పోవ‌డం, ల‌వ్‌స్టోరీస్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో బిగ్‌బాస్ టీఆర్‌పీ ప‌డిపోతూ వ‌స్తోంది.

శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం...

బిగ్‌బాస్ త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం నిలిచింది. ఈ కామెడీ గేమింగ్ షోకు 3.45 టీఆర్‌పీతో రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

అనూహ్యంగా స‌రిగ‌మ‌ప మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. ఇటీవ‌లే స‌రిగ‌మ‌ప సింగింగ్ రియాలిటీ షో కొత్త సీజ‌న్ మొద‌లైంది. తాజా రేటింగ్స్‌లో స‌రిగ‌మ‌ప 3.40 టీఆర్‌పీతో ఆక‌ట్టుకుంది. అర్బ‌న్ ఏరియాలో ఈ సింగింగ్ షో 3.90 టీఆర్‌పీతో స్టార్ మా ప‌రివారం షోను దాటేయ‌డం గ‌మ‌నార్హం.

శ్రీదేవి డ్రామా కంపెనీ..జ‌బ‌ర్ధ‌స్త్‌...

శ్రీదేవి డ్రామా కంపెనీ, జ‌బ‌ర్ధ‌స్థ్ టీవీ షోస్ రేటింగ్ గ‌త వారంతో పోలిస్తే ఈ వీక్ కొంత త‌గ్గుముఖం ప‌ట్టించింది. లేటేస్ట్ రేటింగ్స్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీకి 2.89 టీఆర్‌పీ రాగా...జ‌బ‌ర్ధ‌స్థ్ 2.18 టీఆర్‌పీని మాత్ర‌మే సొంతం చేసుకున్న‌ది.

ఈటీవీలోనే టెలికాస్ట్ అవుతోన్న సుమా అడ్డా 1.58, పాడుతా తీయ‌గా 1.50 టీఆర్‌పీతో డిస‌పాయింట్ చేశాయి. హ‌న్సిక జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఢీ షో కూడా 1.91తో కాస్త ప‌ర్వాలేద‌నిపించింది.

యాంక‌ర్ ర‌వి హోస్ట్‌గా ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మాత్రం టీర్‌పీలో నిరాశ‌ప‌రిచింది. 0.58 తో లోయెస్ట్ టీఆర్‌పీ ద‌క్కించుకున్న షోగా నిలిచింది.

Whats_app_banner