IRCTC Ooty Tour : మంచు కురిసే వేళలో 'ఊటీ' అందాలు చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు-irctc tourism operate coonoor and ooty tour package from hyderabad in december 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Ooty Tour : మంచు కురిసే వేళలో 'ఊటీ' అందాలు చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

IRCTC Ooty Tour : మంచు కురిసే వేళలో 'ఊటీ' అందాలు చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

Nov 24, 2024, 12:29 PM IST Maheshwaram Mahendra Chary
Nov 24, 2024, 12:04 PM , IST

  • Coonoor Ooty Tour Package: మంచు కురిసే వేళలో ఊటీ అందాలను చూడాలనుకుంటున్నారా..? మీ కోసం IRCTC టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. డిసెంబర్ 3వ తేదీన అందుబాటులో ఉంది. తక్కువ ధరతోనే ఊటీతో పాటు కున్నూర్ చూసి రావొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…

ఈ శీతాకాలంలో ఊటీ అందాలను చూడాలని అనుకుంటున్నారా…? తక్కువ ధరలో ఏదైనా టూర్ ప్యాకేజీ చూస్తున్నారా…? అయితే మీకోసం ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

(1 / 7)

ఈ శీతాకాలంలో ఊటీ అందాలను చూడాలని అనుకుంటున్నారా…? తక్కువ ధరలో ఏదైనా టూర్ ప్యాకేజీ చూస్తున్నారా…? అయితే మీకోసం ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.(image source unsplash.com)

‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

(2 / 7)

‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది.(image source unsplash.com)

ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.17230) ఉంటుంది. నైట్ అంతా జర్నీలో ఉంటారు.

(3 / 7)

ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.17230) ఉంటుంది. నైట్ అంతా జర్నీలో ఉంటారు.(image source unsplash.com)

ఇక రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకుంటారు. హోటల్‌లోకి చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూసేందుకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.  నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది

(4 / 7)

ఇక రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకుంటారు. హోటల్‌లోకి చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూసేందుకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.  నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది(image source unsplash.com)

ఐదో రోజు మార్నింగ్హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 03.55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

(5 / 7)

ఐదో రోజు మార్నింగ్హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 03.55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.(image source unsplash.com)

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33390గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18660, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14990గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12530గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16210గా ఉంది.  5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

(6 / 7)

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33390గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18660, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14990గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12530గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16210గా ఉంది.  5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.(image source unsplash.com)

ఊటీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్:  https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR094 

(7 / 7)

ఊటీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్:  https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR094 (image source unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు