
(1 / 8)
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ 25 నాటికి వాయుగుండం మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

(2 / 8)
వాయుగుండం ఏర్పడిన తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు - శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
(image source unsplash.com)

(3 / 8)
ఇవాళ, రేపు ఏపీలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

(4 / 8)
నవంబర్ 27, 28, 29 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(5 / 8)
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

(6 / 8)
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(7 / 8)
ఇవాళ్టి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

(8 / 8)
నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని, ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం (నవంబర్ 23) ఉదయం మెదక్ లో 11. 4 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది.
ఇతర గ్యాలరీలు