IBPS PO Mains admit card : అలర్ట్! ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్ కార్డు విడుదల..
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డును ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ibps.in. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రొబేషనర్ ఆఫీసర్స్ (పీఓ)కి అప్లై చేసిన వారికి అలర్ట్! ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు/ కాల్ లెటర్స్ విడులయ్యాయి. ఈ అడ్మిట్ కార్డును ఇన్స్టిట్యూట్ అధికారిక వెబ్సైట్ ibps.in ని సందర్శించడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ కాల్ లెటర్‌తో పాటు అభ్యర్థుల కోసం ఇన్ఫర్మేషన్ కరపత్రాన్ని కూడా విడుదల చేసింది.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024 డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ కింది లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించాలి.
- రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబరు,
- పాస్ వర్డ్ లేదా పుట్టిన తేదీ.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024 ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- ibps.in కు వెళ్లండి
- CRP PO/MT-XIV కోసం ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ లింక్‌ని క్లిక్ చేయండి.
- సమాచార కరపత్రాన్ని తనిఖీ చేయండి. లాగిన్ చేయండి.
- మీ వివరాలను నమోదు చేయండి.
- కాల్ లెటర్ని సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రింటౌట్ తీసుకోండి.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 25 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి.
ఆబ్జెక్టివ్..
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ : 45 ప్రశ్నలు, 60 మార్కులు, 60 నిమిషాలు
జనరల్ /ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ : 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ : 35 ప్రశ్నలు, 40 మార్కులు, 40 నిమిషాలు
డిస్క్రిప్టివ్..
ఇంగ్లిష్ లాంగ్వేజ్ - లెటర్ రైటింగ్ : 1మూడు ప్రశ్నల్లో ఒకటి (10 మార్కులు).
ఇంగ్లిష్ లాంగ్వేజ్ - ఎస్సే రైటింగ్ : మూడు ప్రశ్నల్లో ఒకటి (15 మార్కులు).
వ్యాసరచన, లేఖ రాయడానికి కేటాయించిన మొత్తం సమయం 25 నిమిషాలు.
కొన్ని విభాగాలను ఉప విభాగాలుగా విభజించారు. ఇక్కడ వివరంగా చూడండి:
ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు (0.25) కట్ చేస్తారు. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం