తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : ఇకనుంచి తెలంగాణలో టూరిజం వేరే లెవల్.. సరికొత్త అనుభూతిని పొందడానికి సిద్ధమవ్వండి
- Telangana Tourism : తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మినహా.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. అయితే.. హైదరాబాద్ వెలుపల ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయనుంది. సరికొత్త అనుభూతిని పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- Telangana Tourism : తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మినహా.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. అయితే.. హైదరాబాద్ వెలుపల ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10 ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయనుంది. సరికొత్త అనుభూతిని పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
(1 / 5)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. చరిత్రకు అద్దంపట్టే ప్రదేశాలకు లెక్కలేదు. ఆహ్లాదం, ఆనందాన్ని పంచే ప్రాంతాలకు కొదవ లేదు. కానీ.. ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టక అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చినా.. సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా 10 సర్క్యూట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. (Telangana Tourism)
(2 / 5)
హైదరాబాద్ వెలుపల ఉండే పది ప్రత్యేక ప్రాంతాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించనుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పర్యాటక పాలసీని తయారుచేస్తున్నారు. ఇది తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ ముసాయిదాపై త్వరలోనే సమావేశం నిర్వహించి మార్పుచేర్పులు చేయనున్నారు. ఆ తర్వాత కేబినెట్‌లో చర్చించి పర్యాటక విధానాన్ని ఖరారు చేయనుంది. (Telangana Tourism)
(3 / 5)
గుర్తించిన ప్రదేశాల్లో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల్లోనూ ప్రాజెక్టులు చేపట్టేలా పాలసీ ఉంటుందని తెలుస్తోంది. పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. పెట్టుబడిని బట్టి రూ. 100 కోట్ల వరకు, రూ. 100-500 కోట్లు.. ఆ పైన ప్రాజెక్టులుగా వర్గీకరిస్తున్నట్లుగా టూరిజం అధికారులు చెబుతున్నారు. (Telangana Tourism)
(4 / 5)
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. దీంతో ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా క్యారవాన్ వాహనాలు, సాహస క్రీడలపై పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. (Telangana Tourism)
(5 / 5)
భాగ్యనగరానికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వెలుపల, మారుమూల ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. పర్యాటక ప్రాజెక్టులపై పెట్టే ఖర్చు, ప్రాంతాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు రాయితీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ పెట్టుబడులు పెరిగితే.. తెలంగాణ టూరిజం కొత్తపుంతలు తొక్కే అవకాశాలు ఉన్నాయి. (Telangana Tourism)
ఇతర గ్యాలరీలు