చలికాలంలో వెచ్చని ఒక కప్పు నెయ్యి కాఫీ ఆస్వాదించండి. దీంతో మీకు 7 ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
pexels
By Bandaru Satyaprasad Nov 24, 2024
Hindustan Times Telugu
రోగ నిరోధక శక్తి-నెయ్యిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, రోగ నిరోధక శక్తిని పెంచే ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, ఈ పోషకాలు ఉంటాయి. చలికాలంలో సీజనల్ ఇన్పెక్షన్లకు ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.
pexels
నెయ్యి కాఫీలోని కెఫిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. నెయ్యి కాఫీ మీ రోజును చురుకుగా ఉంచుతుంది.
pexels
జీర్ణక్రియ - నెయ్యి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో ఖాళీ కడుపుతో నెయ్యి కాఫీ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
pexels
వెచ్చగా ఉంచుతుంది - చలికాలంలో నెయ్యి కాఫీ మీకు వెచ్చని అనుభూతిని అందిస్తుంది. శరీరం, మనస్సు రెండింటిని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి - నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆకలిని తగ్గిస్తాయి. దీంతో శరీరంలోని అదనపు కొవ్వు బర్న్ అవుతుంది. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడం ద్వారా బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
pexels
మూడ్ ను మెరుగుపరుస్తుంది-ఉదయాన్నే ఓ కప్పు నెయ్యి కాఫీ తాగితే మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు- కాఫీ యాంటీ ఆక్సిడెంట్లకు మూలం. నెయ్యిని కాఫీకి జోడించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెరుగుపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంతో సహాయపడతాయి.
ఆహారంలో చేర్చాల్సిన బ్లాక్ ఫుడ్స్, వీటిని తరచూ తినాల్సిందే