Romantic Zodiac Signs: రొమాంటిక్ రిలేషన్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ రాశి వారికి దూరంగా ఉండండి
Romantic Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిని బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పగలం. అలాగే వారిలో ఉండే రొమాంటిక్ నేచర్ గురించి కూడా అంచనా వేయచ్చు. జీవితంతో మీరు మంచి రొమాంటిక్ రిలేషన్‌షిప్ కోసం మీరు ఎదుచూస్తుంటే మీ రాశికి సరిపడని వ్యక్తులు ఎవరో చూద్దాం.
లైఫ్ లో ఎలాంటి పని చేసే ముందైనా కొద్దోగొప్పో దాని గురించి తెలుసుకుని ముందడుగేస్తాం. కెరీర్‌లో ఎదుగుదల కోసం, రుచికరమైన ఆహారం కోసం ఎలా అయితే తెలుసుకుంటామో.. మన వ్యక్తిత్వానికి, ఆరోగ్యానికి సరిపడవని పక్కకు పెట్టేస్తామో.. అలాగే మనసుకు దగ్గర అవబోయే వారి గురించి కూడా కాస్త రీసెర్చ్ చేసుకోవాలి. "అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరంలో నష్టమే లేదన్నట్లు" పరిచయాల్ని ఎక్కడి వరకూ తీసుకువెళ్లాలో మీరే నిర్ణయం తీసుకోండిలా.
మన రాశి పేరు ఏంటో తెలుసుకునే రోజుల నుంచి మన రాశితో సరిపడని రాశుల గురించి కనుగొనే స్థాయికి చేరుకున్నాం. అలాంటప్పుడు ఇక ఆలస్యమెందుకు ఈ సమాచారం మీకోసమే..
ముందు మేషం ╳ మీనం గురించి తెలుసుకుందాం
రాశి చక్రం మొదలయ్యే మేష రాశితో మొదలుపెడితే ఈ రాశికి అత్యంత చివరిదైన మీన రాశి వారితో రొమాంటిక్ రిలేషన్ సెట్ అవదట. మేష రాశి వారికి ఉండే హాట్ టేస్ట్, మీన రాశి వారి ప్రశాంతమైన, ధ్యాన వైఖరితో ఉండే స్వభావానికి సరిపోలేదు. మీనం స్వభావ రీత్యా సున్నిత మనస్కులు. మేష రాశి వారు సాహసోపేతంగా, ఘర్షణ స్వభావంతో ఉంటారు. దూకుడైన స్వభావం, స్థిరమైన స్వభావం మధ్య రొమాంటిక్ రిలేషన్ బోరింగ్ గా ఉండవచ్చు.
ఆ తర్వాత కుంభం ╳ కర్కాటకం గురించి చూస్తే
కర్కాటక రాశి వారిపై చంద్రుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. వీరు తమ భాగస్వాములు దుప్పటిలా చుట్టుకుపోయే గుణం ఉండాలని ఆశిస్తారు. పోషణతో పాటు రక్షణ కల్పించే వారి కోసం ఎదురుచూస్తుంటారు. అదే కుంభరాశి వారి వ్యక్తిత్వానికి వస్తే వీళ్లు స్వేచ్ఛాయుతంగా ఉండేందుకు ఇష్టపడతారు. కర్కాటక లక్షణాలకు దూరంగా ఉంటూ తమ లాంటి వ్యక్తుల్నే కోరుకుంటారు కుంభరాశి వారు. వీరిద్దరి రొమాంటిక్ రిలేషన్ కాస్త కష్టమే.
మూడోది వృషభం ╳ సింహం
రాశి చిహ్నాల మాదిరిగానే ఇవి రెండు బలమైన వ్యక్తిత్వం కలిగిన రాశులు. సింహ రాశి వారు లైమ్ లైట్ లో ఉండేందుకు ఇష్టపడతారు. భాగస్వామితో ఎక్కువసేపు గడపాలని బహిరంగంగా విహరించాలని ఆశపడుతుంటారు. అవుట్ గోయింగ్, సొగసైన ప్రదేశాలు చూసేందుకు మక్కువ చూపే సింహరాశికి విరుద్ధమైన భావాలతో ఉంటుంది వృషభం. పూర్తిగా ప్రైవేట్‌గా, గృహానికే పరిమితంగా ఉండాలని భావిస్తుంటారు వృషభ రాశి వారు. పైగా ఈ రెండు రాశులలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుండటంతో షేరింగ్ తో కేరింగ్ ఉండాల్సిన వీరి రొమాంటిక్ రిలేషన్‌షిప్ అంత సజావుగా సాగకపోవచ్చు.
సరితూగని వృశ్చికం ╳ మిధునం
వృశ్చిక రాశి వారు మిగతా అన్ని రాశుల కంటే భిన్నంగా ఉంటారు. వీరు భాగస్వామిపై అధిక బలం, డిమాండింగ్ వైఖరితో ఉంటారు. మిధున రాశి వారు చిన్నపాటి కోర్కెలు, మనస్సుతో మాట్లాడే మాటలకు సంతృప్తి పడతారు. వృశ్చిక రాశి వారి స్వభావం మనస్సు లోతులను కదిలించేదిగా ఉండటంతో.. మిథున రాశి వారితో తోడైతే వీరిద్దరి మధ్య స్వేచ్ఛ అనేది దూరం కావొచ్చు.
పరిపూర్ణం కాలేని కన్య ╳ ధనుస్సు
కన్య రాశి వారు మొదలుపెట్టిన దగ్గర్నుంచి పని పూర్తయ్యేంత వరకూ అదే పట్టుదలతో ఉంటారు. ప్రేరణలకు లొంగిపోకుండా కార్యాలను పూర్తి చేస్తారు. మరోవైపు ధనుస్సు రాశి వారు సాహసంతో ఉంటారు. భావోద్వేగాలను సూటిగా స్పష్టం చేయడంతో పాటు మనసులోని ఫీలింగ్స్ బయటపెట్టడానికి ఇష్టపడతారు. కొత్తదనంలో మాత్రమే ఆసక్తి కనబరిచే ధనుస్సు రాశి వారు కన్య రాశి ఆశించినట్లు చివరి వరకూ ఒకే అనురాగం కురిపించకపోవచ్చు.
ప్రమాణాలకు దూరంగా తుల ╳ కన్య
అస్సలు సరిపడని రాశుల జాబితాలో చివరిది కన్య రాశి, తుల రాశి. తుల రాశి వారి రుచులకు హద్దులు ఉండవు. పరిమితుల్లేని కోర్కెలతో వ్యవహరించే తుల రాశికి కన్య రాశి విరుద్ధంగానే ఉంటుంది. అసాధారణమైన ఉన్నత ప్రమాణాలను ఇష్టపడని కన్య రాశికి తుల రాశికి మధ్య రొమాంటిక్ రిలేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు.