Crime news : తాగి బండి నడుపుతున్నందుకు అడ్డుకున్నాడని.. కానిస్టేబుల్ని పొడిచి చంపేశారు!
Delhi police killed : దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కానిస్టేబుల్ని ముగ్గురు చంపేశారు! తాగి బండి నడుపుతున్న వారిని ఆ కానిస్టేబుల్ అడ్డుకోవడమే ఇందుకు కారణం!
దిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! మద్యం తాగి నడుపుతున్నారన్న కారణంతో ఓ కానిస్టేబుల్ ఓ వాహనాన్ని అడ్డుకున్నాడు. ఆ బండి మీద ఉన్న ముగ్గురు.. కోపంతో, కానిస్టేబుల్ని చంపేశారు!
ఇదీ జరిగింది..
ఆగ్నేయ దిల్లీలోని గోవింద్పూరిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ని శనివారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారు.
మృతుడు కిరణ్‌పాల్ సింగ్ (28) గోవింద్‌పురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో దీపక్ సింగ్ అలియాస్ మ్యాక్స్ (20), క్రిష్ గుప్తా (18)లను అరెస్టు చేశామని, మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అతని మొదటి పేరు రాఘవ్ అలియాస్ రాకీ అని తెలిపారు.
శనివారం సరితా విహార్‌లోని జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సింగ్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వగా, పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నెల 23 తెల్లవారుజామున కానిస్టేబుల్ సింగ్.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాడని అధికారులు చెప్పారు. కాగా సంత్ రవిదాస్ మార్గ్ సమీపంలో అతనిపై దాడి జరిగినప్పుడు ఒంటరిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులను సింగ్ చూశాడని, కానిస్టేబుల్ వారిని ప్రశ్నించగా వారు పదునైన వస్తువుతో దాడి చేసి నడిరోడ్డు మీద వదిలేశారని విచారణలో తేలింది.
ఉదయం 7 గంటల సమయంలో వీధిలో పోలీసు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. కానిస్టేబుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
“కానిస్టేబుల్ సింగ్ ఛాతి, పొత్తికడుపుపై రెండు కత్తిపోట్లు ఉన్నాయి. ఛాతిపై దాడితో గుండె పంక్చర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నాం,” అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నిందితుల్లో ఒకరైన మాక్స్ కల్కాజీలోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ బృందానికి సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ఉచ్చు బిగించారు. అయితే అతడు కాల్పులు జరిపాడని, ఆ తర్వాత తాము కూడా కాల్పులు జరిపామని, ఈ ఘటనలో మాక్స్ కాలికి బుల్లెట్ గాయమైందని అధికారులు వివరించారు.
రెండో నిందితుడైన గుప్తాను జిల్లా పోలీసులు పట్టుకున్నప్పటికీ అరెస్టుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మూడో నిందితుడుకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
కానిస్టేబుల్ ఇంట్లో విషాయం..
కానిస్టేబుల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ ఇంటి మొత్తానికి డబ్బులు సంపాదించేది ఆ కానిస్టేబుల్ ఒక్కరే! పెళ్లి చేసుకోమని చెప్పామని, దాని గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. 'తనకు తగిన జోడీని వెతుక్కోవాలనుకున్నాడు,' అని కానిస్టేబుల్ మేనమామ అమర్పాల్ సింగ్ (53) తెలిపారు.
సంబంధిత కథనం