సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 26లోపు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు పెంచే అవకాశం లేదు.
ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 64 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలోనే ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలోని టీవీవీపీ(తెలంగాణ వైద్య విధాన పరిషత్) ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులు లేవు.
మరోవైపు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 29 టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇంజినీరింగ్ సర్వీస్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 38,483 జీతం చెల్లిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
నవంబర్ 27వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. https://www.iict.res.in/CAREERS వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.