Elinati Shani: కుంభ రాశి వారు 2025లో అయినా ఏలినాటి శని నుంచి బయటపడతారా? కొత్త ఏడాది వీరికి ఎలా ఉంటుంది?
Elinati shani: ఈ ఏడాది అంతా కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. 2025లో అయినా వీరు ఏలినాటి శని నుంచి బయటపడతారా? కొత్త ఏడాది వీరికి ఎలా ఉండబోతుందో చూద్దాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం.శని ప్రభావం వ్యక్తి చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది. శనీశ్వరుడి అనుగ్రహం లేకుంటే జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏలినాటి శని ప్రభావం కొందరికి మంచి కలిగిస్తే మరికొందరికి అత్యంత దీన పరిస్థితిని తీసుకొస్తుంది. ఏలినాటి శనిలో మూడు దశలు ఉంటాయి. ఒక్కో దశ రెండున్న ఏళ్లు ఉంటుంది. అలా మూడు దశలు కలిపి మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వ్యక్తులపై పడుతుంది. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అయితే వచ్చే ఏడాది అంటే 2025లో కూడా కుంభ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుందా. ఉంటే ఎలా ఉంటుంది తెలుసుకుందాం.
కుంభరాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు.ప్రస్తుతం కుంభ రాశి వారికి ఏలినాటి శని రెండవ దశలో ఉంది. 2025 మార్చిలో శని తన రాశిని మార్చుకోనున్నాడు. శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ దశ మొదలవుతుంది. ఇది 2027 వరకూ కొనసాగుతుంది.
2025లో ఏలినాటి శని కుంభ రాశి వారిని ఎలా ప్రభావితం చేస్తుంది?
జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం..శని కుంభ రాశికి అధిపతి. శని సడే సతీతో బాధపడేవారు శారీరక, ఆర్థిక, మానసిక బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది. శని 12వ స్థానంలో ఉన్న వారికి స్థాన మార్పు ఉంటుంది. కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. ఆర్థికంగా కాస్త అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2025లో కుంభ రాశి వారి పరిస్థితి మరింత దిగజారుతుంది.ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభ రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి ఎప్పుడు?
కుంభ రాశి వారిపై ఏలినాటి శని మూడవ దశ 2025 మార్చిలో ప్రారంభమవుతుంది. ఇది తిరిగి 2027 జూన్ 3 వరకూ కొనసాగుతుంది. అంటూ 2027 జూన నెలలో కుంభ రాశి వారు ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది.
ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ఎలా?
ఏలినాటి శని వల్ల కలిగే అశుభ ప్రభావాలను తగ్గించడానికి కుంభ రాశి వారు శివుడు, హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ చాలీసా పఠించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. శనివారం రోజున శని దేవాలయాన్ని సందర్శించి ఆయనకు నువ్వుల నూనె దానం చేయాలి. శని వారం రోజున ఉపవాసం ఉండాలి. రావిచెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించాలి. నల్ల మినపప్పు దానం చేయాలి. అలాగే శని ఆశీస్సులు పొందేందుకు నల్లని వస్త్రాలను దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. శనివారం సుందరకాండ, బజరంగబాన్ పఠించడం పారాయణం చేయడం శ్రేయస్కరం. ఆవులు, నల్ల కుక్కలు, కాకులకు రొట్టె తినిపించాలి. ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.