Utpanna Ekadashi: ఉత్పన్న ఏకాదశి రోజు తులసీ దేవికి ఇవి సమర్పించారంటే విజయం, అదృష్టం మీ సొంతం!
Utpanna Ekadashi 2024: ప్రతి సంవత్సరం మార్గశిర్ష మాసంలో కృష్ణ పక్షం ఏకాదశి నాడు ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున తులసీ దేవికి కొన్నింటిని సమర్పిస్తే అదృష్టం, విజయం సొంతం అవుతాయని నమ్మిక.
కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఏకాదశి దేవత ఈ రోజే జన్మించింది. అందుకే ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈరోజు విష్ణువు, తులసిలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అదృష్టం, విజయం వరిస్తాయని భక్తుల నమ్మిక. ఈ రోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, సంతానం, సుఖం, మోక్షం, పాపాల నుండి విముక్తి లభిస్తాయి. అలాగే ఈ రోజు తులసీ దేవికి కొన్నింటిని సమర్పించడం వల్ల సకల ఐశ్యర్యాలు కలుగుతాయని నమ్మిక.
దృక్ పంచాంగ్ ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26, 2024న ఉదయం 01:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ 27, 2024 తెల్లవారుజామున 03:47 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు చేసుకునే పూజలో పవిత్ర తులసి దేవికి సమర్పించాల్సిన కొన్ని వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
ఉత్పన్న ఏకాదశి రోజున తులసి దేవికి సమర్పించాల్సిన వస్తువులు:
1. కుంకుమ పొడి:
ఉత్పన్న ఏకాదశి రోజున తులసీ మాతకు కుంకుమ పొడిని సమర్పించడం అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు. ఈ రోజు తులసి మొక్కకు చిటికెడు కుంకుమ పొడిని రాసి నిష్టతో ప్రార్థించడం వల్ల మీకు అదృష్టాన్ని, శ్రేయస్సును కలిగిస్తాడు. జీవితంలో సానుకూలత, ఆనందం కలుగుతాయని నమ్మిక.
2. నెయ్యి దీపం:
ఏకాదశి దేవత జన్మించిన రోజున తులసి దేవికి నెయ్యి సమర్పించడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం. స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల ఆమె అనుగ్రహం పొంది జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.
3.చందనం:
తులసీ దేవి గంథం లేదా చందనం సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు గంధం రాయడం వల్ల భక్తుడికి ప్రశాంతత, శాంతి, అదృష్టం కలుగుతాయి. మానసిక స్పష్టత మెరుగవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
4. నీరు-పాలు:
తులసీ ఆశీర్వాదాలు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలు, నీటిని తులసి దేవికి సమర్పించడం ముఖ్యమార్గంగా చెప్పవచ్చు. ఒక శుభ్రమైన గిన్నెలో నీరు, మరో గిన్నెలో పాటు వేసి తులసి మాకు సమర్పించాలి. వీటిని సమర్పించడం వల్ల ఆలోచన, మాట, కర్మలలో స్వచ్ఛతను అనుగ్రహించమని అర్థం. ఇది ఆధ్మాత్మిక వృద్ధినీ, స్వీయ సాక్షాత్కారాన్ని తెస్తుందని నమ్ముతారు.
5. అగరుబత్తీలు:
పూజలో అగరుబత్తీలకు ప్రధానమైన స్థానం ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం ఇది అర్థవంతమైన, భక్తితో కూడిన మార్గంగా నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి రోజున తులసీ దేవికి అగరుబత్తీలు వెలిగించి అమ్మవారికి ధూపద్రవ్యాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు ప్రసాదించమని తులసి మాతను వేడుకున్నట్లు.