Mars Transit: 2025లో మిథున రాశిలోకి కుజుడు- ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు
Mars Transit: 2025 జనవరి 21వరకూ కర్కాటక రాశిలో ఉండే కుజుడు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో అంగారకుడి సంచారం కొన్ని రాశుల వారికి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.
కుజ గ్రహం మేషం, వృశ్చిక రాశులకు అధిపతి. ఈ గ్రహ మార్పు దాదాపు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. కుజ గ్రహం గత నెల అక్టోబర్ 20న మిథున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్న కుజ గ్రహ స్థానంలో ఈ ఏడాది చివరి వరకూ ఎటువంటి మార్పు ఉండదు. రాబోయే సంవత్సరమైన 2025 జనవరి 21వ తేదీ వరకూ అదే స్థానంలో కొనసాగుతాడు. ఆ తర్వాత మాత్రమే అంగారక (కుజ) గ్రహం మళ్లీ మిథున రాశిలోకి వస్తాడని ద్రిక్ పంచాంగం చెబుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ (అంగారక) గ్రహాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అంగారకుడు గ్రహాలకు అధిపతిగా కొలుస్తారు. ఈ గ్రహం రక్తం, బలం, భూమిపై ప్రభావం చూపిస్తుంటుంది. అంగారకుడు తన రాశిని మార్చుకున్నప్పుడు ఆ ప్రభావం అనేక ఇతర రాశులపై కనిపిస్తుంది. ఈ సందర్భంలో అంగారక గ్రహం క్షీణించడం, బలహీనపడటం సంభవించవచ్చు. క్షీణించినప్పుడు ఒకలా, బలహీనపడినప్పుడు మరోలా ప్రభావాలు కనిపించొచ్చు. అలా జరిగినప్పుడు ఏమేం పరిహారాలు చేయాలో తెలుసుకుందాం.
కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం కరువవుతుంది. త్వరగా అనారోగ్యానికి గురవుతారు. తరచుగా భయపడుతూ నిర్ణయాలు తీసుకోవడానికి సతమతమవుతుంటారు. ఇంట్లో పిల్లలకు కూడా ఆరోగ్యం సరిగా ఉండదు. ఆ సమయంలో కుజుడిని బలపేతోం చేయడానికి హనుమంతుడిని ఆరాధించాలి. ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసాను పఠించాలి. శరీరానికి రక్తం సమకూర్చే క్యారెట్లు, టమోటాలు, బీట్ రూట్లను, పప్పులను, బెల్లం వంటి పదార్థాలను ఇతరులకు దానం చేయాలి. సాధ్యమైనంతవరకూ నేలపై పడుకోవడానికే ప్రయత్నించాలి. ఇలా ఉన్నప్పుడు సూర్యుడిని నమస్కరించి నీటిని సమర్పించాలి. ఈ స్థానంలో మార్పుకు సంబంధం లేకుండా కొందరికి జాతక రీత్యా కుజ దోషముంటుంది. వారు కుజదోష నివారణకు, లేదా పరిహారం కోసం ఇలా చేయండి.
కుజ దోష నివారణలు:
కుజ దోష నివారణకు శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి. ఏడు మంగళ వారాలు ఇలా చేయాలి. ఉదయం 7 గంటల లోపు ఇలా చేయించాలి.
నాగుల పుట్టను దర్శించుకున్నప్పుడు పుట్టమన్ను చెవికి ధరించాలి.
ఆదివారం రాహుకాలం (సాయంత్రం 4.30 నుంచి 6 గంటలలోపు) నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి. తదుపరి సుబ్రమణ్య అష్టకం చదవాలి.
కుజ దోష నివారణకు 12 రోజుల పాటు రోజుకు 9 సార్లు సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి. అలాగే ఒకసారి వల్లీ, దేవసేన అష్టోత్తర శతనామాలు చదవాలి.
అష్టమూలికా తైలంతో సుబ్రమణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమ వారాల్లో రాహు కాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి.
సుబ్రమణ్య కరవలాంబ స్తోత్రం 11 రోజుల పాటు రోజుకు 80 సార్లు చదవాలి.
కుజ దోష నివారణకు సుబ్రమణ్యమాలా మంత్రం 42 రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి.
అష్టమూలికా తైలంతో సుబ్రమణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమ వారాల్లో రాహు కాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి.
కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లి సంబంధ విషయాలపై మీకు తెలిసిన జ్యోతిష్య శాస్త్ర నిపుణుడిని సంప్రదించడం మంచిది. వారు తగిన రత్నాన్ని సూచిస్తారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం చెట్టుతో వివాహం జరిపించి పరిహారం చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్