Bigg Boss Telugu 8: నిఖిల్, గౌతమ్‌పై బిగ్ బాంబ్ పేల్చిన నాగార్జున- ట్విస్ట్ ఇచ్చిన యష్మీ- ఈ వారం అతను డైరెక్ట్ నామినేట్!
Bigg Boss Telugu 8 November 24 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నిఖిల్, గౌతమ్ ఇద్దరిపై బిగ్ బాంబ్ పేల్చాడు నాగార్జున. దాంతో వారిలో ఒకరు బిగ్ బాస్ 8 తెలుగు 13 వారానికి డైరెక్ట్ నామినేట్ అయ్యారు. ముందు ఒకరి పేరు చెప్పిన యష్మీ గౌడ చివరిలో ట్విస్ట్ ఇవ్వడంతో అతనిపై బిగ్ బాంబ్ పడింది.
Bigg Boss 8 Telugu Nagarjuna: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ బాగానే నడుస్తోంది. ఈ వారంలో గౌతమ్, రోహిణి ఇద్దరూ ప్రేక్షకుల హృదయాలను బాగా టచ్ చేశారు. తనను ఇరికిద్దామనుకున్న బిగ్ బాస్ వేసిన చెత్త ప్లాన్‌ను తిప్పి కొట్టి గౌతమ్ మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడ. కానీ, తన గేమ్‌ను ఎపిసోడ్‌లో వేయకుండా అన్యాయం చేసి తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.
శివంగివే అంటూ
ఇక బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో ఫైనల్ మెగా చీఫ్‌గా రోహిణి గెలిచి తనను జీరో అన్నవాళ్లు అవమానంతో ఏడ్చేలా చేసింది. బలముందనే అహంకారంతో విర్రవీగిన పృథ్వీపైనే గెలిచి బిగ్ బాస్ చేత శివంగివే అనే పాటతో ఎలివేషన్ ఇప్పించుకుంది రోహిణి. జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్ అయిన రోహిణి మెగా చీఫ్‌గా గెలిచిన తీరు తెలుగు ప్రేక్షకులందరికి గూస్ బంప్స్ తెప్పించింది.
ఇక ఇదిలా ఉంటే, ప్రతివారం కంటెస్టెంట్స్ ఆట తీరుపై హోస్ట్ నాగార్జున రివ్యూ ఇస్తారన్న విషయం తెలిసిందే. అంటే, అది పక్షపాతంగా ఉంటుందనేది వేరే విషయం. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 23 ఎపిసోడ్‌లో విష్ణుప్రియ, రోహిణి ఫైట్‌పై, మాటలు జారడంపై క్లాస్ పీకాడు నాగార్జున. తర్వాత గౌతమ్, పృథ్వీల బొచ్చు గొడవపై ఫైర్ అయ్యాడు హోస్ట్ నాగ్.
పృథ్వీ పాము
అందులో పృథ్వీ తప్పేం లేదని, గౌతమ్‌దే తప్పని ఎప్పటిలాగే కన్నడ బ్యాచ్‌కు సపోర్ట్ చేశారు హోస్ట్ నాగార్జున గారు. తర్వాత హౌజ్‌లో తమను నిచ్చెనలా పైకి ఎక్కించేవారు ఎవరు, పాములా కిందకు లాగేవారు ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో రోహిణి అవినాష్‌కు నిచ్చెన ఇస్తే.. ఆట పరంగా కాదు కానీ, మాటల పరంగా అంటూ పృథ్వీకి స్నేక్ ఇచ్చింది.
అలాగే, నిఖిల్‌కు స్నేక్ ఇచ్చి షాక్ ఇచ్చిన యష్మీ తన ఫ్రెండ్ ప్రేరణకు నిచ్చెన ఇచ్చింది. టేస్టీ తేజకు నిచ్చెన, పృథ్వీకి పాము ఇచ్చాడు అవినాష్. అలాగే, పృథ్వీని నిచ్చెనలో నిఖిల్‌ను పాము వద్ద నిల్చోబెట్టాడు నబీల్. రోహిణికి ల్యాడర్, నిఖిల్‌కు స్నేక్ ఇచ్చాడు గౌతమ్. ఇదే నిఖిల్ గౌతమ్‌కు పాము, పృథ్వీకి నిచ్చెన ఇచ్చాడు. విష్ణుప్రియకు పాము ఇచ్చిన టేస్టీ తేజ నిచ్చెనను అవినాష్‌కు ఇచ్చాడు.
బిగ్ బాంబ్ పడనుంది
నబీల్‌కు ల్యాడర్ ఇచ్చిన విష్ణుప్రియ జబర్దస్త్ రోహిణి పాము అని చెప్పింది. ఇదే రోహిణికి ల్యాడర్ ఇచ్చిన ప్రేరణ తనతో గొడవ పడే గౌతమ్‌ను స్నేక్ అంది. వీటిలో నిఖిల్, గౌతమ్ ఇద్దరికి సమానంగా స్నేక్ అని వచ్చింది. దాంతో టైఅప్ అయి బిగ్ బాస్ బాంబ్ స్క్రీమ్ తీసుకొచ్చారు. వారిద్దరిపై బిగ్ బాంబ్ పడనుందని పెద్ద బాంబ్ పేల్చాడు నాగార్జున.
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 తెలుగు పన్నెండో వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. యష్మీ ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ (నవంబర్ 24) ప్రసారం చేయనున్నారు. అయితే, ఎలిమినేట్ అయిన యష్మీకి బిగ్ బాంబ్ పేల్చే అవకాశాన్ని ఇచ్చారు నాగార్జున. దాంతో తన ఫ్రెండ్ అయిన నిఖిల్‌ను సేవ్ చేస్తూ గౌతమ్‌పై బిగ్ బాంబ్‌ను పడేసింది యష్మీ.
డైరెక్ట్ నామినేట్
స్నేక్, ల్యాడర్ టాస్క్‌లో ముందుగా నిఖిల్‌ను పాముతో పోల్చిన యష్మీ గౌడ బిగ్ బాంబ్ పేలుతుందని, దానివల్ల వచ్చే వారం నామినేషన్స్‌లో డైరెక్ట్ నామినేట్ అవుతారని చెప్పడంతో రూట్ మార్చి ట్విస్ట్ ఇచ్చింది. ఆ బిగ్ బాంబ్‌ను గౌతమ్‌పై పడేసి డైరెక్ట్ నామినేట్ చేసింది. దాంతో బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్‌లో గౌతమ్ నేరుగా నామినేట్ అయ్యాడు.