Sunday Rituals: ఆదివారం రోజు సూర్యుడికి ఇవి సమర్పించారంటే- ఐశ్యర్యం, ఆనందం మీ సొంతమవడం ఖాయం
Sunday Rituals:సనాతన సంప్రదాయాల్లో ఆదివారం సూర్యభగవానుడి ఆరాధనకు అంకిత చేయబడింది. కనుక ఆదివారం రోజున జపం, తపస్సు, ఉపవాసం వంటివి చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం పొందుతారనీ, ఆయన అనుగ్రహం లభిస్తే ఐశ్యర్యం, విజయం దక్కుతాయని నమ్ముతారు.
హిందూ పురాణాల ప్రకారం ఆదివారం సూర్య భగవాడికి అంకిత చేయబడింది. ఈ రోజున సూర్యుడిని దేవతలు కూడా ఆరాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం రోజు సూర్యుడిని దర్శించుకోవడం, ఆయనకు నమస్కారం చేయడం వంటివి సనాతన సంప్రదాయాల్లో భాగంగా వస్తున్నవి.పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు దుర్వాస మహర్షి శాపం కారణంగా కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పడు, అతను సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా మాత్రమే ఉపశమనం పొందాడట. అంతేకాదు సూర్యవంశీయుడైన రాముడు కూడా సూర్యుడిని ధ్యానించి శక్తిని పొంది రావణుడిని సంహరించాడు. అందుకనే సూర్య భగవానుడి పూజకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అదృష్టానికి, ఆరోగ్యానికి దేవుడు అయిన సూర్యుడని ఆరాధించడం వల్ల జీవితం సరళంగా, సంతోషకరంగా ఉంటుందని నమ్ముతారు. సూర్యుడి అనుగ్రహ పొందేందుకు ఆదివారం రోజున చేయాల్సిన కొన్ని పనులను గురించి తెలుసుకుందాం.
సిరి సంపదలు పొందాలంటే సూర్యుడికి ఏం సమర్పించాలి..
1.ఆదివారం నాడు ఉదయించే సమయంలో సూర్యుడికి రాగి పాత్రలో నుంచి నీటిని సమర్పించాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఉదయాన్నే లేవకపోతే స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ, అక్షింతలు వేసి ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించాలి. సూర్య భగవానుడికి నీటిని సమర్పించే సమయంలో ఆ నీరు ఎవరి కాళ్ల మీద పడకుండా, ఎవరూ ఆ నీళ్లను తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ నీటిని ఒక పాత్రలో కూడా వదులుకోవచ్చు. పూజ అనంతరం ఆ నీటిని ఇంట్లోని మొక్కలకు పోయొచ్చు.
2. 'ఆదిత్య హృదయ స్తోత్రాన్ని' పఠించడం సూర్య భగవానుడికి చాలా ఇష్టం. ఆయన అనుగ్రహం పొందడానికి ఈ స్తోత్రాన్ని ఆదివారం రోజు మూడు సార్లు చదవాలి. దీపి ఫలితంగా చదివిన వ్యక్తి అన్నిశక్తి, కీర్తి,ఆరోగ్యం వంటి రకరకాల ఆనందాలను, విజయాలను పొందగలడని విశ్వసిస్తారు.
3. సూర్య భగవానుని కోసం ఆదివారం ప్రత్యేకంగా ఉపవాసం చేసిన వ్యక్తులు ఆయన అనుగ్రహం వెంటనే పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్య దేవుడ్ని పూజించే సమయంలో ఉప్పు వేసిన వంటకాలను తినకూడదు.
4. ఆదివారం కేవలం సూర్య భగవానుడి ఆశీర్వాదం కోసం మాత్రమే కాకుండా సంపదలను కురిపించే లక్ష్మీదేవత ఆశీర్వాదం కోసం పూజలు చేయవచ్చు. ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే, ఆదివారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి.ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్ముతారు.
5. సూర్య భగవానుడి పూజలో రావి చెట్టు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కోరికలను రావి చెట్టు ఆకు మీద రాసి, సూర్య దేవుడిని తలచుకుంటూ నదిలో లేదా పవిత్ర జలంలో వేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మిక. అంతేకాదు ఆదివారం సాయంత్రం రావి చెట్టు ఆకును తీసుకుని సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు వైపులా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి సంపద, ఆరోగ్యం, కీర్తి కలుగుతాయి. ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదని నమ్ముతారు.