AP Crime News : ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం - ఆపై డబ్బుల కోసం వేధింపులు!
ప్రేమ పేరుతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ బాలికపై అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేశాడు. ఆపై డబ్బుల కోసం వేధింపులు కొనసాగించాడు. విషయంలో వెలుగులోకి రావటంతో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదైంది.
ఏలూరు జిల్లా వంగాయిగూడెంకి చెందిన బాలికపై ప్రేమ పేరుతో విజయవాడకు చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. ఆపై డబ్బుల కోసం వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శనివారం విజయవాడ గుణదల పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు… జిల్లా వంగాయిగూడెం మహేశ్వర్ కాలనీకి చెందిన ఓ బాలిక (15) ద్వారకా తిరుమల మండలంలో పదో తరగతి చదివింది. ఈ ఏడాది మార్చిలో పరీక్షలు రాసి వంగాయిగూడెం వెళ్లింది. అప్పటికే ఆ బాలికను విజయవాడకు చెందిన రాంపండు (22) యువకుడు ప్రేమించాడు. బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు ప్రేమను ఉపయోగించుకున్నాడు. అయితే జూన్ 29న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బాలిక వెళ్లిపోయింది. ఆ బాలికను రాంపండు విజయవాడ కర్మెల్‌నగర్‌లోని తన నివాసానికి తీసుకెళ్లాడు.
వీరిద్దరూ తమకు పెళ్లి అయిందని నమ్మించి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. పెళ్లి అయిందని నమ్మించేందుకు మెడలో తాళిబొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకుమ్మని బాలికకు రాంపండు తెలిపాడు. దీంతో ఆమె మెడలో తాళిబొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకుని పెళ్లైందని నమ్మించేవారు. అలాగే వీరితో పాటు రాంపండు అక్క నాగేంద్ర కేడా వస్తుండడంతో చుట్టుపక్కల వారికి ఎవరికీ అనుమానం రాలేదు. అయితే అద్దె ఇంట్లో ఉంటూ ఆ బాలికపై రాంపండు అత్యాచారం చేశాడు. పైగా డబ్బులు కోసం అక్క నాగేంద్రతో కలిసి వేధించడం మొదల పెట్టాడు.
దీంతో వేధింపులు భరించలేక ఈనెల 15న బాలిక తన తల్లికి రహస్యంగా ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించింది. తనను ఇంట్లో పెట్టి రాంపండు అత్యాచారం చేశాడని, డబ్బులు కోసం వాళ్ల అక్కతో కలిసి వేధిస్తున్నాడని వివరించింది. దీంతో తల్లి విజయవాడకు చేరుకుంది. ఘటనపై గుణదల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాంపండు, నాంగేంద్రలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి:
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం మజ్జివలస గ్రామంలో డిగ్రీ వరకూ చదువుకున్న కాగితాల రాశి (22) అనే యువతి అదే గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. యువతి తనకు ఇష్టం లేదని చాలాసార్లు చెప్పినప్పటికీ, వేధింపులు కొనసాగించాడు.
వేధింపులతో విసుగు చెందిన యువతి పంటలకు వేసే పురుగుల మందును ఈనెల 16న సాయంత్రం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులు గమనించి తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం యువతి మృతి చెందింది. శుక్రవారం ఉదయం స్వగ్రామం మజ్జివలసలో అంత్యక్రియలు జరిగాయి. తమ కుమార్తె ఆత్మహత్యకు రాజు వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజును శనివారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయాలు బయటకు రాకుండా రహస్యంగా ఉంచారు. దీనిపై సీఐ సుధాకర్ స్పందిస్తూ మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.