Vijay Devarakonda Rashmika Mandanna: బయటపడిన విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా సీక్రెట్ డేటింగ్.. లంచ్ డేట్ ఫొటోలు వైరల్!
Vijay Devarakonda Rashmika Mandanna In Restaurant: రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఓపెన్ సీక్రెట్ డేటింగ్ తాజాగా మరోసారి బయటపడింది. ఓ రెస్టారెంట్‌లో విజయ్ రష్మిక కలిసి లంచ్ చేస్తున్న డేటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Vijay Devarakonda Rashmika Mandanna Date: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా అందరికి తెలిసిన సీక్రెట్. తాము డేటింగ్‌లో ఉన్నట్లు బయటకు చెప్పకపోయిన ఎన్నోసార్లు ఇద్దరు కలిసి కెమెరాలకు చిక్కారు.
సింగిల్‌గా లేను
అలాగే, ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉండి విడి విడిగా దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అవి చూసి బాగా గమనించిన నెటిజన్స్ ఇద్దరూ ఒక్కచోట ఒక్కసారి ఉండే దిగినట్లు చాలా సందర్భాల్లో తేల్చారు. ఇక ఇటీవల ఓ ఈవెంట్‌లో తాను సింగిల్‌గా ఉన్నాను అంటే నమ్ముతార అని ఇన్‌డైరెక్ట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చాడు.
రష్మిక విజయ్ లంచ్ డేట్
విజయ్ దేవరకొండ అలా కామెంట్స్ చేసిన అతి కొద్దిరోజులకే తాజాగా రష్మిక మందన్నాతో కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చేసింది. రూమర్డ్ లవర్స్‌గా పిలవబడుతున్న రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఓ రెస్టారెంట్‌లో కలిసి కనిపించారు. ఇద్దరు కలిసి లంచ్ చేశారు. విజయ్, రష్మిక లంచ్ డేట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రెండు ఫొటోలు వైరల్
దాంతో మరోసారి రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఓపెన్ సీక్రెట్ డేటింగ్ బయటపడిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ ఒక టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. రష్మిక అతని ఎదురుగా కూర్చొని ఉంది. ఆ ఫొటోలో రష్మిక మందన్నా వెనుక నుంచి కనిపిస్తుంది. అయితే, ఈ ఫొటోతో పాటు మరో పిక్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చాలా రోజుల క్రితం
ఆ ఫొటోలో రష్మిక కెమెరా ముందు పోజు ఇచ్చింది. ఈ క్లోజప్ ఫోటోలో రష్మిక డెజర్ట్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆ ఫొటోలో ఉన్న తన ప్లేట్ వైపు రష్మిక చూస్తూ ఉంది. ఆ ఫొటోపై 'మంచి ఆహారం (గుడ్ ఫుడ్)' అని రాసి ఉంది. అయితే, ఈ పిక్ చాలా రోజుల క్రితం రష్మిక తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.
నీలి రంగు దుస్తుల్లో
అయితే, ఆ రెస్టారెంట్‌లో డెజర్ట్ ఎంజాయ్ చేసిన రష్మిక వేసుకున్న దుస్తులు, విజయ్ దేవరకొండతో కూర్చున్నప్పుడు వేసుకున్న డ్రెస్ అచ్చం ఒకేలా ఉంది. విజయ్, రష్మిక ఇద్దరు నీలిరంగు దుస్తుల్లో మెరిశారు. రష్మిక స్లీవ్ లెస్ క్రాప్డ్ బ్లూ టాప్ అండ్ బ్లూ డెనిమ్ ధరించింది. ఇక విజయ్ దేవరకొండ నీలం రంగు జాకెట్, ప్యాంట్ కింద తెల్లటి దుస్తులు ధరించి కనిపించాడు.
నెటిజన్స్ కామెంట్స్
అంతేకాకుండా ఈ రెండు ఫొటోలు ఒక్కసారి, ఒకే సమయంలో, ఒకే చోట దిగినట్లు తెలిపేలా రష్మిక మందన్నా బ్రా స్ట్రిప్స్ ఓపెన్‌గా కనిపించడం గమనించవచ్చు. ఇదిలా ఉంటే, రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఫొటోలు గింగిరాలు తిరగడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మనకు తెలుసని వాళ్లకూ తెలుసు
"ప్రస్తుతం అత్యంత బహిరంగ రహస్య సంబంధాల్లో ఇదొకటి. మనకు తెలుసు అని వాళ్లకు తెలుసు. వాళ్లకు తెలుసు అని మాకు తెలుసు. అయినప్పటికీ వారు ఇంకా హైడ్ అండ్ సీక్ ఆడాలనుకుంటున్నారు." "వారు దాని గురించి మాట్లాడి ఒక మంచి విషయాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. మనకు తెలిసినా వారు పట్టించుకోరు. కానీ, వారు బహిరంగంగా కూడా బయటకు రారు. 'క్యూట్ కపుల్' అంటూ పలు విధాలుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.