IPL 2025 Auction Unsold Players: వేలంలో అమ్ముడుపోని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, వేలంలో హైలైట్‌గా నిలిచిన ప్లేయర్స్ వీళ్లే-full list of sold unsold players in ipl 2025 auction david warner unsold and rishabh pant costliest player ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction Unsold Players: వేలంలో అమ్ముడుపోని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, వేలంలో హైలైట్‌గా నిలిచిన ప్లేయర్స్ వీళ్లే

IPL 2025 Auction Unsold Players: వేలంలో అమ్ముడుపోని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, వేలంలో హైలైట్‌గా నిలిచిన ప్లేయర్స్ వీళ్లే

Galeti Rajendra HT Telugu
Nov 24, 2024 07:45 PM IST

IPL 2025 Auction sold players list: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ భారీ ధరకి అమ్ముడుపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కొన్నేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్లేయర్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు.

రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్, జోస్ బట్లర్
రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్, జోస్ బట్లర్

IPL 2025 Mega Auction Live: ఐపీఎల్ 2025 ఆటగాళ్ల మెగా వేలంలో పాత రికార్డుల బద్ధలవుతూ.. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రూ.2 కోట్లు కనీస ధరతో వచ్చిన భారత క్రికెటర్ల కోసం వేలంలో కోట్లాది రూపాయల్ని ఫ్రాంఛైజీలు కుమ్మరిస్తున్నాయి. రూ.27 కోట్లకి వేలంలో అమ్ముడుపోయిన రిషబ్ పంత్.. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అతడ్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. పంత్ తర్వాత ఈ రికార్డ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయాస్‌ను రూ.26.75 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అనూహ్యంగా కొంత మంది స్టార్ క్రికెటర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.

వేలంలో హైలైట్‌గా నిలిచిన ప్లేయర్లు వీళ్లే

  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన అర్షదీప్ సింగ్‌ను రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డును ఉపయోగించి పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన కగిసో రబాడ (దక్షిణాఫ్రికా)ను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (ఇండియా) రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)ను గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు కొనుగోలు చేసింది.
  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రిషబ్ పంత్ (ఇండియా) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.


  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన మహ్మద్ షమీ (ఇండియా)ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న యుజ్వేంద్ర చాహల్ (భారత్)ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
  • మహ్మద్ సిరాజ్ (భారత్) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు కాగా, గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన లియామ్ లివింగ్‌ స్టోన్‌(ఇంగ్లాండ్)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసింది.
  • కేఎల్ రాహుల్ (భారత్) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) రూ.6 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
  • ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా)ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రాహుల్ త్రిపాఠి (ఇండియా) బేస్ ప్రైజ్ రూ.75 లక్షలు కాగా, చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.
  • డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలానికి రాగా.. ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దాంతో అన్‌సోల్డ్‌గా ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ మిగిలిపోయాడు.
  • రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లోని భారత్ టెస్టు జట్టులో పడిక్కల్ ఆడుతున్నాడు.
  • రూ.2 కోట్లతో వేలానికి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్) అన్‌సోల్డ్‌గా మిగిలాడు. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న బెయిర్‌స్టో‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఇష్టపడలేదు.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్ (ఆస్ట్రేలియా)ను ఆర్టీఎం కార్డుతో రూ.9 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
  • హర్షల్ పటేల్ (ఇండియా) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు కాగా, రూ.8 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
  • రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు కాగా రూ.9.75 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న వెంకటేశ్ అయ్యర్ (ఇండియా)ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది.

  • గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికిరాగా.. అతడ్ని రూ.4.20 కోట్లకే పంజాబ్ కింగ్స్ ఎగరేసుకుపోయింది.

Whats_app_banner