SRH IPL Auction 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి పవర్ హిట్టర్.. ఆఖర్లో ఎంట్రీ ఇచ్చి ఎగరేసుకొచ్చిన కావ్య మారన్
Ishan Kishan IPL Price: ఐపీఎల్ 2024 కోసం ఇషాన్ కిషన్‌కి రూ.15.25 కోట్లని ముంబయి ఇండియన్స్ చెల్లించింది. అలాంటి ప్లేయర్‌ను ఆఖర్లో తెలివిగా ఎంట్రీ ఇచ్చిన కావ్య మారన్.. తక్కువ ధరకే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి తీసుకుంది.
Sunrisers Hyderabad IPL 2025 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి పవర్ హిట్టర్ ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు. విధ్వంసకర బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్.. రూ.2 కోట్ల కనీస ధరతో ఆదివారం ఐపీఎల్ 2025 మెగా వేలానికి వచ్చాడు. ఇప్పటికే ముంబయి జట్టుని ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించిన ఇషాన్ కోసం తొలుత ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ బిడ్ వేసింది.
ఇషాన్ కిషన్ కోసం ముంబయి ఇండియన్స్‌కి పోటీగా పంజాబ్ కింగ్స్ పోటీకి వచ్చింది. రెండు ఫ్రాంఛైజీలు.. రూ.4 కోట్లు వరకూ పోటీపడగా.. మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో ముంబయి డ్రాప్ అవ్వగా.. పంజాబ్, ఢిల్లీ మధ్య రూ.10 కోట్ల వరకూ పోటీ నడిచింది. రిషబ్ పంత్‌ను ఇప్పటికే చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎలాగైనా ఇషాన్ కిషన్‌ను దక్కించుకునేలా కనిపించింది.
కానీ.. అనూహ్యంగా రూ.10.25 కోట్ల వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి వచ్చింది. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోని వేలానికి వదిలేసి.. వేలంలో అతను రూ.2 కోట్లతో దక్కే అవకాశం ఉన్నా పట్టించుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. ఇషాన్ కిషన్ కోసం గట్టిగా పోటీపడింది. హైదరాబాద్ రాకతో పంజాబ్ వెనక్కి తగ్గింది. దాంతో రూ.11.25 కోట్లకి ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీలు ఇషాన్ కిషన్ కోసం పోటీపడుతున్న సమయంలో.. వికెట్ కీపర్ అవసరం టీమ్‌కి ఉన్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు. కానీ.. ఢిల్లీ వెనక్కి తగ్గగానే.. పంజాబ్ వద్ద పర్స్ వాల్యూ తక్కువగా ఉండటాన్ని చూసి పోటీకి వచ్చింది. దాంతో ఇషాన్ కాస్త తక్కువ ధరకే చేజిక్కాడు. ఐపీఎల్ 2024 కోసం ఇషాన్ కిషన్‌కి రూ.15.25 కోట్లని ముంబయి ఇండియన్స్ చెల్లించడం గమనార్హం.