Action Comedy OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన తమిళ్ యాక్షన్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Action Comedy OTT: ప్రభుదేవా హీరోగా నటించిన పేట్టా రాప్ మూవీ తెలుగులోకి వచ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా నటించగా సన్నీలియోన్ కీలక పాత్ర పోషించింది.
Action Comedy OTT: ప్రభుదేవా హీరోగా నటించిన కోలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ పేట్టా రాప్ తెలుగులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆదివారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం తమిళంతో మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా విడుదలైంది.
బోల్డ్ బ్యూటీ...
ఈ యాక్షన్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా నటించగా...బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు.అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. పేట్టా రాప్ సినిమాకు ఇమాన్ మ్యూజిక్ అందించాడు.
పేట్టా రాప్ కథ ఇదే...
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ అటెండ్ అయినా అతడికి ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు బాల.
జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తమ కలల్ని నెరవేర్చుకోవడానికి బాల, జానకి కలిసి ఏం చేశారు? ఈ కథలో వీరమణి, కమల్ పాత్రలు ఏమిటి అన్నదే పేట్టా రాప్ మూవీ కథ.
ఈ ఏడాది నాలుగు సినిమాలు...
ప్రస్తుతం ప్రభుదేవా యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుదేవా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కన్నడంలో కరటక దమనక, తమిళంలో దళపతి విజయ్ ది గోట్, జాలీ జిమ్‌కానా సినిమాలు చేశాడు.
తెలుగుకు దూరం…
మలయాళం, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న ప్రభుదేవా తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంటోన్నాడు. తెలుగులో నటుడిగా 2022లో వచ్చిన దేవి సినిమాలో చివరగా కనిపించాడు ప్రభుదేవా. ఈ నవంబర్ 22 ప్రభుదేవా జాలీ ఓ జిమ్‌కానాతో పాటు సన్నీలియోన్ మందిర సినిమాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజయ్యాయి.