Kollywood OTT: ముందుగా టీవీలో...ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ కానున్న దృశ్యం యాక్టర్ రొమాంటిక్ మూవీ!
Kollywood OTT: దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ మిన్‌మినీ ముందుగా టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఆ తర్వాతే ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 4న ఆస్ట్రో బాక్సాఫీస్ మూవీస్ ఛానెల్‌లో మిన్‌మినీ టెలికాస్ట్ అవుతోంది. మిన్‌మినీ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది.
సాధారణంగా థియేటర్లలో రిలీజైన తర్వాత సినిమాలు ఓటీటీలోకివస్తాయి. ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ అవుతుంటాయి. అయితే ఇటీవలే రిలీజైన ఓ తమిళ మూవీ మాత్రం టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. దృశ్యం మూవీ ఫేమ్ ఎస్తేర్ అనిల్ హీరోయిన్‌గా నటించిన మిన్‌మినీ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
ఓటీటీ కంటే ముందు టీవీలో…
తాజాగా మిన్‌మినీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. అయితే ముందుగా ఈ మూవీ టీవీలో ప్రీమియర్ కానుంది. అక్టోబర్ 4న సాయంత్రం ఆరున్నర గంటలకు ఆస్ట్రో బాక్సాఫీస్ మూవీస్ ఛానెల్‌లో మిన్‌మినీ మూవీ టెలికాస్ట్ కానుంది.
ఆ తర్వాత ఆస్ట్రో ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఓటీటీలో ఫస్ట్ రెండు వారాలు రెంటల్ విధానంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.మిన్ మినీ మూవీలో ఎస్తేర్ అనిల్, హరికృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ తమిళ మూవీకి హలీతా షమీమ్ దర్శకత్వం వహించారు.
చైల్డ్ హుడ్ నుంచి టీనేజ్...
చైల్డ్ హుడ్ నుంచి టీనేజ్ ఏజ్ వరకు ఓ జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, తమిళనాడు నుంచి హిమలయాల వరకు బైక్స్‌పై వారు కలిసి సాగించిన జర్నీ నేపథ్యంలో దర్శకురాలు మిన్‌మినీ మూవీని తెరకెక్కించింది. సినిమాల్లో హీరోల చైల్డ్‌హుడ్ క్యారెక్టర్స్‌ను వేరే యాక్టర్స్ కనిపిస్తారు.
కానీ దర్శకురాలు మాత్రం ఈ సినిమాలో ప్రధాన పాత్రల బాల్యాన్ని, టీనేజ్‌ను వాస్తవిక కోణంలో సినిమాలో చూపించాలని ఫిక్సైంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను 2015లో షూట్ చేసింది. ఆ తర్వాత యాక్టర్స్ చైల్డ్‌హుడ్ నుంచి టీనేజ్‌కు మారిన తర్వాత సెకండాఫ్‌ను షూట్ చేయాలని ఏకంగా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నది. సెకండాఫ్‌ను 2022లో కంప్లీట్ చేసింది.
మిన్‌మినీ రికార్డులు...
యాక్టర్స్‌ను మార్చకుండా వారి రియల్ ఏజ్ ప్రకారం షూటింగ్‌ను జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా మిన్‌మినీ నిలిచింది. అంతే కాకుండా ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 9.1 రేటింగ్‌ను దక్కించుకున్నది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ మ్యూజిక్ అందించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే డెబ్యూ మూవీ.
తమిళనాడు నుంచి హిమాలయాల వరకు...
శబరి చెన్ ప్లేయర్. అతడి స్కూల్‌లో పరి అనే స్నేహితుడు ఉంటారు. స్పోర్ట్స్ కారణంగా ఇద్దరు చదువులో వెనుకబడిపోతారు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా శబరికి పరి దూరమవుతాడు. స్నేహితుడు దూరమైన బాధ నుంచి బయటపడటానికి బైక్‌పై హిమాలయాలకు బయలుదేరుతాడు శభరి. ప్రవీణకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుంది.
లైఫ్‌లో తనకు సెకండ్ ఛాన్స్ రావడంతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బైక్ జర్నీ మొదలవుతుంది. ఈ జర్నీలో శబరి, ప్రవీణ మధ్య ఎలా పరిచయం ఏర్పడింది? హిమాలయాలకు చేరుకునే క్రమంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ.
దృశ్యం మూడు భాషల్లో...
మలయాళంలో ఇరవైకిపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎస్తేర్ అనిల్ నటించింది. తెలుగులో దృశ్యం, దృశ్యం2తో పాటు జోహార్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. దృశ్యం తమిళ వెర్షన్ పాపనాశంలోనూ ఎస్తేర్ అనిల్ నటించింది. దృశ్యం మూవీతో మూడు భాషల్లో పెద్ద హిట్‌ను అందుకున్నది. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. మలయాళంలో టాప్ సింగర్ అనే టీవీ షో ద్వారా ఎస్తేర్ అనిల్ వెలుగులోకి వచ్చింది. సింగింగ్ రియాలిటీ షోకు హోస్ట్‌గా పనిచేసింది ఎస్తేర్ అనిల్.