Telugu Cinema News Live November 24, 2024: Pushpa 2 Kissik Song: పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌పై నెటిజన్ల ట్రోల్స్ - పాట లిరిక్స్ ఇవిగో…
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 24 Nov 202404:14 PM IST
Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి కిస్సిక్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలు అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చెన్నైలో ఆదివారం జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో ఈ పాటను రిలీజ్ చేశారు.
Sun, 24 Nov 202402:13 PM IST
Action Comedy OTT: ప్రభుదేవా హీరోగా నటించిన పేట్టా రాప్ మూవీ తెలుగులోకి వచ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా నటించగా సన్నీలియోన్ కీలక పాత్ర పోషించింది.
Sun, 24 Nov 202401:13 PM IST
Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ టాప్‌లో నిలిచింది. ఈ రియాలిటీ షోకు వీకెండ్స్‌లో 5.28 టీఆర్‌పీ రాగా...వీక్‌డేస్‌లో 4.25 వచ్చింది. టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ తర్వాత ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సరిగమప నిలిచాయి.
Sun, 24 Nov 202412:17 PM IST
Web Series: ఓటీటీలో ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్ అదరగొడుతోంది. స్కామ్ 1992, మహారాణి, స్కామ్ 2003 తర్వాత సోనీలీవ్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. ఈ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సిరీస్‌కు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించాడు.
Sun, 24 Nov 202409:47 AM IST
Trivikram: టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంబోలో రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. కెరీర్ ఆరంభంలో విక్రమ్ హీరోగా నటించిన మెరుపు, అక్కా బాగున్నావా సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేయడం గమనార్హం.
Sun, 24 Nov 202409:06 AM IST
Malayalam OTT: మలయాళం పొలిటికల్ సెటైరికల్ కామెడీ మూవీ పొరట్టు నడకం మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ మూవీ ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Sun, 24 Nov 202407:46 AM IST
- Bigg Boss Telugu 8 November 24 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో నిఖిల్, గౌతమ్ ఇద్దరిపై బిగ్ బాంబ్ పేల్చాడు నాగార్జున. దాంతో వారిలో ఒకరు బిగ్ బాస్ 8 తెలుగు 13 వారానికి డైరెక్ట్ నామినేట్ అయ్యారు. ముందు ఒకరి పేరు చెప్పిన యష్మీ గౌడ చివరిలో ట్విస్ట్ ఇవ్వడంతో అతనిపై బిగ్ బాంబ్ పడింది.
Sun, 24 Nov 202406:37 AM IST
Naga Chaitanya Karthik Dandu NC24 Announcement: విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. నాగ చైతన్య కెరీర్‌లో ఎన్‌సీ24 మూవీగా వస్తోన్న ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన ఇచ్చారు. నాగ చైతన్య బర్త్ డే రోజు అనౌన్స్ చేసిన ఈ మూవీకి నిర్మాతగా సుకుమార్ వ్యవహరించనున్నారు.
Sun, 24 Nov 202405:49 AM IST
- Vijay Devarakonda Rashmika Mandanna In Restaurant: రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఓపెన్ సీక్రెట్ డేటింగ్ తాజాగా మరోసారి బయటపడింది. ఓ రెస్టారెంట్‌లో విజయ్ రష్మిక కలిసి లంచ్ చేస్తున్న డేటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Sun, 24 Nov 202403:30 AM IST
Same To Same Tollywood Heroes Heroines: టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నాని, రామ్ చరణ్‌తోపాటు హీరోయిన్స్ సమంత, రష్మిక మందన్నా వర్ష బొల్లమ్మ వంటి హీరోయిన్స్ సేమ్ ఇతర యాక్టర్స్‌లా ఉంటారు. వారిని చూసినప్పుడు అచ్చం చెర్రీ, తారక్, నానిని చూసినట్లుగానే అనిపిస్తుంటుంది. మరి ఆ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.
Sun, 24 Nov 202402:46 AM IST
Erracheera The Beginning Tholi Tholi Muddhu Song Release: హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు మూవీ ఎర్రచీర ది బిగినింగ్. నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన ఎర్రచీర సినిమా నుంచి ఇటీవల తొలి తొలి ముద్దు సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Sun, 24 Nov 202402:06 AM IST
Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి రమ్మని రాజ్‌తో అపర్ణ అంటుంది. దాంతో రాజ్‌ను ఆపేందుకు రుద్రాణి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం కావ్య ఇంటికి వెళ్లి అపర్ణను బుజ్జగిస్తాడు. కావ్య ఇంట్లోనే శేష జీవితం గడిపేస్తాను అని అపర్ణ తేల్చి చెబుతుంది.
Sun, 24 Nov 202401:16 AM IST
- Bigg Boss Telugu 8 Yashmi Gowda Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ నిన్న (నవంబర్ 23) పూర్తి కాగా ఇవాళ (నవంబర్ 24) చూపించనున్నారు. ఈ నేపథ్యంలో హౌజ్‌లో 12 వారాలు ఉన్న యష్మీ గౌడ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో చూద్దాం.
Sun, 24 Nov 202412:30 AM IST
- Bagheera OTT Streaming Trending: ఓటీటీలోకి ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సూపర్ హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బఘీరా అదరగొడుతోంది. సూపర్ హీరో మూవీ జోనర్‌లో వచ్చిన బఘీర ఓటీటీ రిలీజ్ అయిన ఒకట్రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో ఎక్కడ చూడాలో ఓ లుక్కేయండి.