Web Series: ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్నహిస్టారికల్ వెబ్‌సిరీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్!
Web Series: ఓటీటీలో ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్ అదరగొడుతోంది. స్కామ్ 1992, మహారాణి, స్కామ్ 2003 తర్వాత సోనీలీవ్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. ఈ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సిరీస్‌కు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించాడు.
Web Series: సోనీ లివ్‌లో రిలీజైన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఓటీటీలో అదరగొడుతోంది. సోనీ లివ్‌లో విడుదలై తొమ్మిది రోజులు అవుతోన్న టాప్ త్రీలో ఈ వెబ్‌సిరీస్ కొనసాగుతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించాడు. ఈ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సిరీస్‌ను మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ నిర్మించారు.
చిరాగ్ వారో...
చిరాగ్ వోరా, సిద్ధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ ల్యూక్ మెక్‌గిబ్నే ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడం వెనుక ఎందరో నాయకుల త్యాగాలు ఉన్నాయి. ఆ నాయకుల పోరాట పఠిమతో పాటు, ఇండియా విభజనకు దారితీసిన పరిణామాలను, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ, పటేల్ తదితరులు ఎదుర్కున్న సవాళ్లు, సంఘర్షణను ఆవిష్కరిస్తూ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ తెరకెక్కించాడు.
స్కామ్ 1992, స్కామ్ 2003,మహారాణి లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌ల తర్వాత, సోనీ లివ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌గా ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ నిలిచింది. ఈ వెబ్‌సిరీస్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కష్టాలన్నీ మర్చిపోయాం...
దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘ స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది కళ్లకు కట్టినట్లుగా ఈ వెబ్‌సిరీస్‌లో చూపించాలని అనుకున్నాం. మేకింగ్‌లోనే ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఈ సిరీస్‌కు వస్తోన్న ఆదరణతో ఆ కష్టాలన్నీ మర్చిపోయాం" అని తెలిపాడు.
బెస్ట్ వెబ్‌సిరీస్...
నిర్మాతలు మాట్లాడుతూ ‘మనం ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణం . ఎందరో అమరవీరుల త్యాగఫలం. నాటి విషయాలను, దేశ విభజన సమయంలో మన నాయకులు ఎదుర్కొన్న కష్టాలను, రాజకీయ పరిస్థితులను డైరెక్టర్ నిఖిల్ అద్వానీ వాస్తవిక కోణంలో చూపించారు. ఇండియాలో వచ్చిన బెస్ట్ సిరీస్‌లలో ఒకటిగా ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పేరుతెచ్చుకోవడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.