Beggars family event : 20వేల మంది అతిథులు- 40లక్షల ఖర్చు.. ‘బిచ్చగాళ్ల’ ఫ్యామిలీ ఈవెంట్ హైలైట్స్ ఇవి!
పాకిస్థాన్‌లో ఓ బిచ్చగాళ్ల కుటుంబం లావిష్ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసింది. దాదాపు రూ. 40లక్షలు ఖర్చు చేసి 20వేల మంది అతిథులకు భారీగా భోజనం పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్థాన్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది! ఓ కుటుంబం ఒక గ్రాండ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. 20వేల మంది అతిథులను పిలిపించి భారీ లంచ్ మెన్యూతో భోజనం పెట్టింది. దీని కోసం 1.25 కోట్ల పాకిస్థానీ రూపీ (దాదాపు రూ. 40లక్షలు) ఖర్చు అయ్యింది. 'ఇందులో ఏముంది? ఇది సాధారణ విషయమే కదా!' అని అనుకుంటున్నారా? మరి ఈ గ్రాండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది.. 'బిచ్చగాళ్ల' కుటుంబం అయితే, ఇది సాధారణ విషయం ఎలా అవుతుంది?
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ గుజ్రన్‌వాలా ప్రాంతంలోని రహ్వాలి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ అమ్మమ్మ మరణించిన 40వ రోజుకు సదరు బిచ్చగాళ్ల కుటుంబం ఒక గ్రాండ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి 20వేల మంది వచ్చారు! వీరిని 2వేల వాహనాల్లో ఈవెంట్‌కి తీసుకొచ్చింది. పాకిస్థాన్ పంజాబ్ నలుమూలల నుంచి అతిథులను ఈవెంట్‌కి తీసుకొచ్చారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన లంచ్ మెన్యూ మరో హైలైట్! సిరి పాయ, మురబ్బ, నాన్ మటర్ గంజ్, టెండర్ మటన్ వంటి ఆహారాలను అతిథులకు ఆఫర్ చేసింది ఆ బిచ్చగాళ్ల కుటుంబం. దీని కోసం 250 మేకలను చంపాల్సి వచ్చిందట.
ఆ తర్వాత అనేక రకాల స్వీట్లతో ఈవెంట్‌ని ముగించారు!
ఈవెంట్‌కి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతిథులు గుంపులుగా కూర్చుని భోజనం తినడం ఇందులో చూడొచ్చు. వంట తయారీ దృశ్యాలు కూడా ఉన్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బిచ్చగాళ్ల కుటుంబం 20వేల మందికి భోజనం పెట్టి, 1.25 కోట్ల పాకిస్థానీ రూపీని ఖర్చు చేసిందా? అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. 'ఫండింగ్ ఎవరిది?' అని ఇంకొందరు ప్రశ్నలు వేస్తున్నారు.
ఇతరులు మాత్రం.. 'మిడిల్ క్లాస్ కన్నా బిచ్చగాళ్ల కుటుంబాలే బాగున్నాయి," అని అభిప్రాయపడుతున్నారు.
"పాకిస్థాన్ టాప్ బిజినెస్‌మెన్‌లో బిచ్చగాళ్లు కూడా ఉన్నారు," అని ఒకరు అంటే.. "సాధారణ ప్రజల కన్నా బెగ్గర్స్ చాలా రిచ్. నేను లైవ్‌లో చూశాను," అని ఇంకొకరు అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి..
మరి దీని మీద ఒపీనియన్ ఏంటి?
సంబంధిత కథనం