Student tragedy: ప్రాణాలు తీసిన పూరీ, గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి బాలుడి మృతి-sixth class boy dies after eating puris in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Student Tragedy: ప్రాణాలు తీసిన పూరీ, గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి బాలుడి మృతి

Student tragedy: ప్రాణాలు తీసిన పూరీ, గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి బాలుడి మృతి

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 26, 2024 06:41 AM IST

Student tragedy: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నోట్లో పూరీ ఇరుక్కుని ఆరో తరగతి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భోజన సమయంలో లంచ్‌ బాక్సులో పూరీలను రోల్‌ మాదిరి చుట్టుకుని ఒకేసారి నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడంతో అవి గొంతుకు అడ్డం పడి ప్రాణాలు విడిచాడు.

పూరీ నోట్లో ఇరుక్కుని ఆరో తరగతి బాలుడి మృతి
పూరీ నోట్లో ఇరుక్కుని ఆరో తరగతి బాలుడి మృతి

Student tragedy: హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఆరో తరగతి బాలుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం భోజన సమయంలో లంచ్‌ బాక్స్‌లో తెచ్చుకున్న పూరీలను తినే క్రమంలో రోల్‌ మాదిరి చేసుకుని నోట్లో పెట్టుకున్నాడు. పూరీలు గొంతులో ఇరుక్కు పోవడంతో ఉక్కిరి బిక్కిరై అపస్మారక స్థితికి చేరాడు. ప్రథమ చికిత్సతలో జాప్యంతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు వెళ్లిన బాలుడు శవమై రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

ఆరో తరగతి బాలుడి అనుకోకుండా చేసిన పనితో ప్రాణాలు కోల్పోయాడు. ఆకతాయితనం, త్వరగా లంచ్‌ ముగించాలనే ఆతృత కలగలసి బాలుడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి.   లంచ్‌ బాక్స్‌లో తెచ్చుకున్న పూరీలు గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ విషాద ఘటన సోమవారం జరిగింది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని అక్షర వాగ్దేవి ఇంట ర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు.

సోమ వారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భోజనం చేస్తూ అందులో తెచ్చుకున్న పూరీలను చుట్టలాగా చుట్టుకుని నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు. మూడు పూరీలను కలిపి రోల్‌ మాదిరి చేసి నోట్లో కుక్కుకున్నాడు. దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వీరేన్ జైన్ శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరై కింద పడిపో యాడు.

విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరిన బాలుడిని పాఠశాల సిబ్బంది హుటాహు టిన మారేడుపల్లిలోని గీతా నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతులో ఇరు క్కొన్న పూరీలను తొలగించారు. శ్వాస అందకపోవడంతోనే మృతి చెందినట్టు గుర్తించారు. మృతి చెందిన బాలుడి తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు బేగం పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన అందరిలో విషాదం నింపింది.

Whats_app_banner