Andhra Pradesh News Live November 26, 2024: AP Cyclone Rains : ఏపీకి తుపాను గండం, రేపటి నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు-పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరిక జారీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 26 Nov 202402:17 PM IST
AP Cyclone Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపటికి తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Tue, 26 Nov 202401:45 PM IST
- Pawan In Delhi: జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగాగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పిఠాపురంలో ఆర్వోబీ, రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని విజ్ఞప్తి చేవారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు రుణం గడువును 2026వరకు పొడిగించాలని కోరారు.
Tue, 26 Nov 202401:25 PM IST
- AP DSC 2024 Update: ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అనివార్య కారణాలతో డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించడానికి ఆలస్యమవుతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు వీలుగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Tue, 26 Nov 202401:01 PM IST
Rajya Sabha Byelection : దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 5 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 20న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Tue, 26 Nov 202412:26 PM IST
- Chittoor Tragedy : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తకు కేన్సర్ వచ్చింది. దీంతో మనోవేదనకు గురైన భార్య భర్తలిద్దరూ అల్లుడికి ఫోన్ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. దహన సంస్కారాలు చేయాలని చెప్పి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Tue, 26 Nov 202411:43 AM IST
AP Central University Jobs : ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 8వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీచింగ్ పోస్టులు -4, నాన్ టీచింగ్ పోస్టులు-4 మొత్తం 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Tue, 26 Nov 202411:24 AM IST
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ కానున్నారు. దిల్లీ పర్యటనలో పవన్ వ్యాఖ్యలు చేశారు.
Tue, 26 Nov 202410:23 AM IST
TTD Posts : టీటీడీలో కీలక పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎస్వీబీసీ ఛైర్మన్, ఎస్వీఈటీఏ ఛైర్మన్, ఎస్‌వీబీసీ చైర్మన్ పదవితో పాటు ఎస్‌వీబీసీ సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవుల కోసం కూటమి పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు.
Tue, 26 Nov 202410:02 AM IST
RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఉపశమనం దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. విచారణకు గైర్హజరైన ఆర్జీవీ కోసం పోలీసుల గాలిస్తున్నారు. ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Tue, 26 Nov 202409:16 AM IST
- Pawan Kalyan : అదానీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ కానున్నారు.
Tue, 26 Nov 202408:08 AM IST
- APSRTC : అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాల ప్యాకేజీలను నిర్ణయించామని, ఇందులో ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెప్పారు.
Tue, 26 Nov 202407:52 AM IST
- AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనం నేపథ్యంలో దాని ఎఫెక్ట్ ఏపీపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
Tue, 26 Nov 202407:03 AM IST
- AP Rain Alert : ఓవైపు పంటలు చేతికొచ్చాయి. వరికోతలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు వాయుగుండం తరుముకొస్తుంది. దీంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. పంటలను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నాడు. ముఖ్యంగా తీరప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tue, 26 Nov 202405:21 AM IST
- AP Wine Shops : ఏపీలో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. అటు సర్కారు ఇస్తానన్న మార్జిన్ ఇవ్వడం లేదు. దీంతో డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Tue, 26 Nov 202403:59 AM IST
- Amaravati Capital Status: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు.
Tue, 26 Nov 202401:37 AM IST
- AP State Toll Roads: ఏపీలో ఇకపై స్టేట్ హైవేలపై టోల్ తప్పకపోవచ్చు. పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో ముఖ్యమైన రాష్ట్ర రహదారుల్ని హైవేలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 18రోడ్లను గుర్తించారు. భవిష్యత్తులో మరిన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలోనే విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Tue, 26 Nov 202412:34 AM IST
- AP Building Plans: ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిబంధనలు, నిర్మాణ సామాగ్రి కొరతతో ఐదేళ్లకు పైగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టేలా టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నారు. ఇకపై 15మీటర్ల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.