Brahmamudi November 26th Episode: కల్యాణ్‌కు అనామిక మాటల తూటాలు- పని మనిషితో ఆస్తికోసం రుద్రాణి స్కెచ్- గది బయటే ప్రకాశం
Brahmamudi Serial November 26th Episode: బ్రహ్మముడి నవంబర్ 26 ఎపిసోడ్‌లో కావ్యను తీసుకురానని తెగేసి చెబుతాడు రాజ్. రోడ్డుమీద కల్యాణ్, అప్పు పానీపురి తింటుంటే అనామిక వచ్చి అవమానిస్తుంది. తర్వాత ఆస్తి కోసం కొత్త స్కెచ్ వేసిన రుద్రాణి పనిమనిషిని కావాలనే వెళ్లగొట్టేలా చేస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వేరు కుంపటి పెట్టిన ధాన్యలక్ష్మీని ఇంటిని చూసుకుంటుందా అని ప్రకాశం అంటాడు. నేను పొగరెక్కి చేయలేదు కల్యాణ్ కోసం చేశాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ ఇంటిని మర్చిపోయావ్ కదా అని ప్రకాశం అంటే.. మీరు కల్యాణ్‌ను మర్చిపోయారు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
సంతోషంగా ఉండాలని
కాసేపు మీ గొడవ ఆపుతారా అని అరిచిన సుభాష్ అపర్ణను ఎందుకు తీసుకురాలేదు అని రాజ్‌ను అడుగుతాడు. వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చినట్లు అమ్మతోపాటు కళావతిని కూడా తీసుకురావాలట. అది కుదరదని చెప్పాను. మా భార్యాభర్తల విషయంలో అమ్మెందుకు జోక్యం చేసుకోవడం అని రాజ్ అంటాడు. ఎందుకంటే నీ తల్లి కాబట్టి, నువ్ సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కాబట్టి అని సుభాష్ అంటాడు. అలా అయితే కళావతిని వదిలి నా దగ్గరికి వచ్చేదని రాజ్ అంటాడు.
సుభాష్ నచ్చ జెబుతుంటే రాజ్ అడ్డుకుని మీరందరూ అడిగారు నేను వెళ్లాను. కానీ, మమ్మీ రానంది అంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఇంటి కోడలితో కన్నీళ్లు పెట్టించిన ఏ కుటుంబం బాగుపడినట్లు నేను వినలేదు. ఇప్పుడు రెండు తరాల కోడళ్లని కన్నీళ్లు పెట్టిస్తున్నాం. దీనివల్ల ఏం అరిష్టం జరుగుతుందో అన్న ఇందిరాదేవి పద బావ అంటుంది. నాకు ఆస్తి నాకు దక్కాలంటే ఇదే కరెక్ట్ టైమ్. ధాన్యలక్ష్మీ చిన్న ఉప్పు అందిస్తే చాలు అదే చూసుకుంటుంది అని రుద్రాణి ప్లాన్ వేస్తుంది.
తర్వాత అపర్ణకు కాల్ చేసి సుభాష్ కాల్ చేసి నువ్ అనుకుంది ఒకటి మరొకటి జరిగింది. ఇప్పుడు రాజ్‌ను ఎలా మార్చాలి అని సుభాష్ అడుగుతాడు. రెండు రోజుల్లో వాడే వాడి తప్పుని తెలుసుకుని ఇక్కడికి వస్తాడు. నాతో పాటు కావ్యను తీసుకెళ్తాడు అని అపర్ణ అంటుంది. సరే నీ ప్రయత్నం నువ్ చేయు అని సుభాష్ కాల్ కట్ చేస్తాడు. తర్వాత అపర్ణ మాటలు విన్న కావ్య తప్పు చేస్తున్నారని అంటుంది. నీకు భారంగా ఉన్నానా. ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేవాళ్లు అవుతున్నారు అని కోప్పడుతుంది అపర్ణ.
ఆటో నడపడం తప్పా
మీరు ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది. ప్రేమగా మాట్లాడేవారు అని కావ్య అంటే.. అలా ప్రేమగా చెప్పినందుకే నువ్వు నీ మొగుడు కాపురాన్ని ఇలా వెలగబెట్టారు. ఇక ఇప్పుడు అన్ని అరవడాలే. వెళ్లి చికెన్ వండు. నీ వంట తిని చాలా రోజులు అయిందని అపర్ణ అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లిన రుద్రాణి రెచ్చగొడుతుంది. నువ్ ఎంత ఆలోచించినా లాభం లేదు. కల్యాణ్ ఆటో నడపడం తప్పా ఇంకేం ఉండదు. వేరు కుంపటి పెట్టి ఏం సాధించావ్. నిన్ను ఒక్కరైనా పట్టించుకున్నారా అని రుద్రాణి అంటుంది.
అదే కావ్య రిజైన్ చేయగానే వెంటనే ఇంటికి వెళ్లి కూర్చుంది. కావ్య గురించి వెంటనే ఆలోచించారు. కానీ, కల్యాణ్ గురించి అయితే టైమ్ కావాలి అంటారు. నీ మాట ఎవరు వినడం లేదు. నేను నీకు సపోర్ట్ చేస్తే నీకు నష్టం తప్పా లాభం లేదు. ఎందుకంటే నన్ను అందరూ విలన్‌లా చూస్తున్నారు. ముందు అందరూ నీ మాట వినేలా చేయి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని మంట పెట్టేసి వెళ్తుంది రుద్రాణి. దాంతో ఆలోచనలో పడిపోతుంది ధాన్యలక్ష్మీ.
మరోవైపు అప్పు, కల్యాణ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎగ్జామ్, కోచింగ్ గురించి మాట్లాడుకుంటారు. పానీపురి తినడానికి వెళ్తారు. ఒకే ప్లేట్‌లో తింటామని చెబుతారు. అది చూసిన అనామిక కారు ఆపి వాళ్ల దగ్గరకు వెళ్తుంది. వెళ్లి చప్పట్లు కొడుతుంది. ఆదర్శ ప్రేమికులు రోడ్డుమీద పడ్డారు అని అనామిక అంటుంది. అసలు నీ సమస్య ఏంటని అప్పు అంటే సమస్యలు అన్ని మీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతున్నావా అని అనామిక అంటుంది.
రైస్ బ్యాగ్ పంపిస్తా
మాకేం సమస్యలు లేవే. హ్యాపీగా ఉన్నామే అని అప్పు అంటే.. రోడ్డుమీద ఏది పడితే అది తింటూనా అని అనామిక అంటుంది. ఏవి తిన్న నీ అంత కొలెస్ట్రాల్ లేదులే అని అప్పు అంటే.. హేయ్ అని అనామిక కోప్పడుతుంది. కాలిందా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని అప్పు అంటుంది. నీ బోడి మర్యాదా ఎవడికి కావాలి. నన్ను చూస్తే లేచి నిల్చోనే వాళ్లు చాలా మంది ఉన్నారు. పాపం ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉన్నట్లుంది. మా వాళ్లకు చెప్పి రైస్ బ్యాగ్ కూరగాయలు ఇప్పిస్తాలే అని అనామిక అంటుంది.
దాంతో అప్పు కోప్పడుతుంది. నువ్ ఇలా రోడ్డుమీద నిలబెడతావనే విడాకులు తీసుకున్నాను. నాకు లైఫ్ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నానో. అప్పు నువ్ జాగ్రత్త పడితే బెటర్. దుగ్గిరాల ఇంట్లో అన్ని వదిలేసి అది చేస్తా ఇది చేస్తా అని ఇలా పడ్డావ్. అదే అక్కడ ఉంటే ఆ కంపెనీ సీఈఓ అయ్యేవాడివి. అసలు నీ పాట ఎవరైన వింటారా. వింటే బతికి ఉంటారా. నాకు డౌట్. గొప్పోడోని అయిపోవాలనే ఆశ ఉంటే సరిపోదు. దానికి కావాల్సిన కంటెంట్ ఉండాలి. అది లేదని నోరుమూసుకుని ఆఫీస్ చూసుకోమన్నాను అని అనామిక నానా మాటలు అంటుంది.
మీ అన్న రాజ్ కాళ్లపై పడి కంపెనీ చూసుకో. లేకుంటే నువ్వెందుకు పనికిరావు. నీకు ఏది చేతకాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితం రెజెక్ట్ చేసిన ఫెయిల్యూర్‌వి అని అనామిక అంటుంది. దాంతో కొట్టేందుకు అప్పు చేయి ఎత్తితే కల్యాణ్ ఆపుతాడు. నువ్ ఆపకున్నా అది చేసేదేం లేదు అని అనామిక అంటుంది. ఎందుకు ఆపావ్ అది కుక్కలా వాగుతుంటే అని అప్పు అంటుంది. వాగేవాళ్లతో మాట్లాడటం అనవసరం. అలాంటి వాళ్లకు మన విజయమే సమాధానం చెప్పాలి అని కల్యాణ్ అంటాడు.
రుద్రాణికి అన్ని రోగాలే
స్వప్నకు శాంత జ్యూస్ ఇస్తుంది. తనే కాదు మమ్మల్ని పట్టించుకో అని రుద్రాణి అంటుంది. పట్టించున్నాను. మీ చీర కలర్ ఓవర్ అయింది అని పనిమనిషి అంటుంది. నీ పొగరు కూడా ఎక్కువైంది. తిన్నారా లేదా అని అడగవా. రూమ్‌కు వచ్చి అడగాలి కదా. స్వప్నకా కాదు అందరికి పనిమనిషివే అని రుద్రాణి అంటుంది. ఈవిడంటే ప్రెగ్నెంట్. తన పని తాను చేసుకోలేదు. మీరు దిట్టంగా ఉన్నారు మీకేంటీ అని శాంత అంటుంది.
అయ్యో అలా అనకు శాంత. పైకి జీరో సైజే. కానీ, లోపల అన్ని రోగాలే అని స్వప్న అంటుంది. దాంతో అయ్యో అవునా. అపార్థం చేసుకున్నాను. ఏం కావాలో చెప్పండి చేసి పెడతాను అని శాంత అంటుంది. రోగం వచ్చినవాళ్లు ఏం తింటారు. రాగి జావ ఇవ్వు. అది కూడా కారం ఎక్కువ వేయకు. అసలే ఆవిడకు అల్సర్ అని స్వప్న అంటుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెంప పగులుద్ది అని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది. పళ్లరసం తాగి నేను కూడా బలంగానే ఉన్నాను అని స్వప్న అంటుంది.
అంటే ఏంటే మీ ఉద్దేశం. నీ అత్తను వయసులో పెద్దదాన్ని నన్నే కొడతావా అని గొడవ పడుతుంది రుద్రాణి. ఇంతచిన్నదానికి గొడవ ఏంటీ. నేను వెళ్లి జ్యూస్ తీసుకొస్తాను అని శాంత అంటే అదొద్దు కానీ చికెన్ ఫ్రై, చికెన్ 65 చేయమని రుద్రాణి అంటుంది. అవన్నీ చేయలేవని, కావ్య మేడమ్ ఉన్నప్పుడు సహాయంగా ఉండేది అని పంచ్‌లు వేస్తుంది శాంత. పనిమనిషివి చెప్పింది చేయాలి. లేకుంటే తీసేస్తాను అని రుద్రాణి అంటుంది.
కావాలనే వెళ్లగొట్టాను
తీసేయండి అమ్మా. కావ్య అమ్మ గారు ఉన్నారని ఇన్నాళ్లు ఊరుకున్నాను. ఈ సింగిల్ జీవితానికి ఇంతమందికి ఊడిగం చేయలేను అని శాంత అంటుంది. నువ్ పోతే వంద మంది దొరుకుతారు అని రుద్రాణి అంటుంది. హా తెలుసులేమ్మా మీరు అన్నమాటలకు వారం రోజులు కూడా లేరట కదా. అలాంటి వారు దొరుకుతారేమో చూడండి అని పనిమనిషి పని మానేసి వెళ్లిపోతుంది. పోవే ఎవరిని బెదిరిస్తున్నావ్. పనిపాట లేనివాళ్లు చాలామంది ఉన్నారు అని రుద్రాణి అంటుంది.
నీలాంటి వాళ్ల అత్తా. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని స్వప్న వెళ్లిపోతుంది. దీన్ని కావాలనే వెళ్లగొట్టాను. ఇది వెళ్లిపోతే ఆ ముసలోళ్లకు వండిపెట్టేవాళ్లు ఎవరు ఉండరు. అప్పుడు ఆ రాజ్ చచ్చినట్లు వదినను బ్లాక్ మెయిల్ చేసి రప్పిస్తాడు అని రుద్రాణి స్కెచ్ వేస్తుంది. తర్వాత రాజ్ తలుపు కొడతాడు సుభాష్. రాజ్ గదిలోకి దిండు దుప్పటి పట్టుకుని సుభాష్ వస్తాడు. మా గదిలో అపర్ణ లేదు. పెళ్లి అయినప్పటి నుంచే కలిసే ఉన్నాం. ఇప్పుడు తను లేదు. అక్కడ ఉండలేకపోతున్నాను. నిద్రపోలేకపోతున్నాను. ఇక్కడ నువ్ తోడుగా ఉంటావని వచ్చాను అని సుభాష్ అంటాడు.
అంతా ఓకే కానీ మమ్మీ లేకుంటే పడుకోలేనని అనడమే విచిత్రంగా ఉందని రాజ్ అంటే.. అందరూ నీలా భార్య లేకుండా ప్రశాంతంగా పడుకోలేరు కదా. ఒంటరిగా నిద్ర పట్టే అదృష్టం ఉండదు కదా అని సుభాష్ అంటాడు. పడుకోండి కానీ ఇన్ డైరెక్ట్‌గా ఇన్సల్ట్ చేయకండి అని రాజ్ అంటాడు. ఇన్సల్ట్ కాదు ఇంటెన్షన్ చెబుతున్నాను అని సుభాష్ అంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ పడుకోకుండా ఆలోచిస్తుంటే ఏమైనా తినాలని ఉంది, స్వీట్స్ పట్టుకురావా అని ప్రకాశం అంటాడు.
గది బయటకు ప్రకాశం
స్వీట్స్ ఎందుకు నా రక్తం తాగండి. కావ్య గురించి, కల్యాణ్‌కు న్యాయం గురించి, ఇంట్లో వాళ్లతో ఆస్తి గురించి ఇప్పుడే మాట్లాడమని చెబుతుంది ధాన్యలక్ష్మీ. మాట్లాడకుంటే అని ప్రకాశం అంటే.. అప్పటివరకు గది బయటే ఉండండి అని దిండు దుప్పటి ఇచ్చి గది నుంచి బయటకు పంపించేస్తుంది ధాన్యలక్ష్మీ. నాకు ఇష్టమైన చోట పడుకుంటానని ప్రకాశం వెళ్లిపోతాడు.
తర్వాత ఇందిరాదేవి వంట చేస్తూ చేయి కాల్చుకుందని, అమ్మను పంపించమని కావ్యకు చెబుతాడు రాజ్. ఏదో నీ భార్యపై హక్కున్నట్లు అరుస్తున్నావ్. వచ్చి నీ భార్యను తీసుకెళ్లు అని అపర్ణ ఫోన్ లాక్కుని చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్