Brahmamudi November 19 Episode: బ్రహ్మముడి- మన్మథుడు స్టైల్‌లో రాజ్ చీటింగ్- కావ్య ఓడిపోయేలా ప్లాన్- రుద్రాణికి షాక్-brahmamudi serial november 19th episode kanakam prays for kavya win raj cheating kavya star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 19 Episode: బ్రహ్మముడి- మన్మథుడు స్టైల్‌లో రాజ్ చీటింగ్- కావ్య ఓడిపోయేలా ప్లాన్- రుద్రాణికి షాక్

Brahmamudi November 19 Episode: బ్రహ్మముడి- మన్మథుడు స్టైల్‌లో రాజ్ చీటింగ్- కావ్య ఓడిపోయేలా ప్లాన్- రుద్రాణికి షాక్

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2024 09:56 AM IST

Brahmamudi Serial November 19th Episode: బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేస్తాడు రాజ్. తాను ఇప్పటివరకు ఎవరినీ మోసం చేయలేదని, కానీ, ఈసారి కావ్యను మోసం చేయడం తప్పట్లదేదని రాజ్ అనుకుంటాడు. కావ్య ఆఫీస్‌కు లేట్‌గా వచ్చేలా మరో కన్నింగ్ ప్లాన్ కూడా వేస్తాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 19 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 19 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య వేసిన డిజైన్స్‌ను ఆఫీస్‌లోనే ఉంచి వెళ్తారు కళావతి, శ్రుతి. ఉన్నారా వెళ్లిపోయారా అని రాజ్ ఛాంబర్‌లోకి తొంగి చూస్తుంది కావ్య. అక్కడ రాజ్ కనిపించకపోయేసరికి వెళ్లిపోయారా మీ సర్ అని శ్రుతిని అడుగుతుంది. ఏమో అని శ్రుతి అంటుంది. తర్వాత కావ్య ఛాంబర్ దగ్గర ఆగి ఇలా చేసి కళావతిని మోసం చేస్తున్నానా అని అనుకుంటాడు రాజ్.

పక్కా ఓడిపోయేవాన్ని

మోసం ఎలా అవుంది. తనను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకున్నాను. ఆ లెక్కన చూస్తే కళావతి ఈ విధంగా అయిన నా రుణం తీర్చుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి, అది వేసిన డిజైన్స్ తస్కరించడంలో తెప్పే లేదు అని కావ్య ఛాంబర్‌లోకి వెళ్లి డిజైన్స్ ఫొటోలు తీసుకుంటాడు రాజ్. పర్లేదు.. చాలా బాగా వేసింది. నేను నా టీమ్‌ను నమ్ముకుని పక్కా ఓడిపోయేవాన్ని. ఇంతమంచి డిజైన్స్‌ను దొంగతనం చేయడంలో తప్పేలేదు. ఇలాంటి వాటికి వాటికి నా లాంటి వాడు దొంగతనం చేసే అర్హత ఉంది అని రాజ్ అనుకుంటాడు.

ఇంతలో బ్యాగ్ మర్చిపోయాను అని తిరిగి తన ఛాంబర్‌కు వస్తుంది కావ్య. కావ్య మాటలు విని రాజ్ ఛాంబర్ కింద దాక్కుంటాడు. డిజైన్స్ పొజిషన్ మారి ఉండటంతో కావ్యకు ఇక్కడకు ఎవరో వచ్చారని చెబుతుంది కావ్య. దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అని శ్రుతి అంటే.. నీ బొంద ఎవరో వచ్చి వెళ్లారు అని కావ్య అంటుంది. రాజ్ సర్ ఏమైనా వచ్చారా. మీ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని వచ్చారేమో అని శ్రుతి అంటుంది.

ఆయన కోపిష్టి, గర్వం ఎక్కువ. అంతేకానీ మోసం చేయరు అని ముందు తిట్టి తర్వాత పొగుడుతుంది కావ్య. అది చూసి ఇదేంటీ ఇది తిట్లదండకం అందుకుంది అని రాజ్ అనుకుంటాడు. తర్వాత ఆయన ఉంటే గొడవ పడతారు. ఆయన లేకుంటే మాట కూడా పడనివ్వరు. సరే పదండి అని శ్రుతి అంటుంది. దాంతో ఇద్దరూ వెళ్లిపోతారు. హమ్మయ్య అనుకుంటూ చైర్‌లో కూర్చుంటాడు రాజ్.

మోసం చేయక తప్పదు

ఏది ఏమైనా నువ్ చెప్పింది నిజమే కళావతి. నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంది. నేను ఇప్పటివరకు ఎవరిని మోసం చేయలేదు. కానీ, ఈ సారి మాత్రం నిన్ను మోసం చేయక తప్పట్లేదు. ఈ కంపెనీని ఇంతపెద్దగా డెవల్ చేసి తిరిగి సీఈఓ అవడానికి ఈ మాత్రం మోసం చేయొచ్చు అని రాజ్ అనుకుంటాడు. తర్వాత సైలెంట్‌గా రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. ధాన్యలక్ష్మీ వచ్చి కిచెన్‌లోకి వెళ్తుంది.

అదేంటీ కిచెన్‌లోకి వెళ్లిందేంటీ అని ప్రకాశం డౌట్ పడతాడు. నీకే క్లారిటీ వస్తుందని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో కిచెన్‌లో నుంచి తాను వండుకున్న భోజనం తీసుకొచ్చుకుంటుంది ధాన్యలక్ష్మీ. చికెన్ వండి నాకు వేయలేదు అని శాంతను స్వప్న అడుగుతుంది. అది నేను వండలేదని శాంత అంటే.. ఎవరు వండితే ఏంటీ మాకు వేయరా అని స్వప్న అంటుంది. అది తనకోసం మాత్రమే ధాన్యలక్ష్మీ వండుకుంది. తను అనుకున్నది జరగట్లేదని వంటింట్లో వేరు కుంపటి పెట్టింది అని ఇందిరాదేవి అంటుంది.

ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం బట్టలు బహిష్కరించినట్లు.. తను అనుకుంది జరగడం కోసం నా కోడలు ఇంట్లో తిండిని బహిష్కరించింది అని ఇందిరాదేవి అంటుంది. ధాన్యలక్ష్మీ బాధ అందరికీ అంత వెటకారం అయిందా. ఇలా దెప్పిపొడవం పెద్దరికి అనిపించుకోదు. ఏంటీ నాన్న కోడలికి అవమానం జరిగితే మౌనంగా ఉన్నారు అని రుద్రాణి అంటుంది. నా కొడుకు అన్యాయం జరిగినప్పుడే మౌనంగా ఉన్న మావయ్య నాకు అవమానం జరిగితే స్పందిస్తారా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

న్యాయమే చేయట్లేదు

నువ్ అడిగింది ఏమైనా బ్రెడ్ ముక్క. ఆస్తిలో వాట. అందరం కలిసి ఉంటే మన అస్థిత్వం ఉంటుంది. ఎవరు దారిన వారు వెళ్తే గౌరవంగా బతకలేం అని ప్రకాశం అంటాడు. మంచి మాట చెప్పావురా. అడ్డమైన వాళ్ల సలహాలు విని చెడిపోతున్నావ్. నీ కొడుకు కోసం పోరాడు. కానీ, ఇంటిని ముక్కలు చేయాలనుకోకు. ఆస్తిని పంచడమంటే ముక్కలు చేయడమే అని ఇందిరాదేవి అంటుంది. ఇంట్లో నీతులు అందరూ బాగానే చెబుతున్నారు. కానీ, న్యాయమే చేయట్లేదు అని ధాన్యలక్ష్మీ అంటంది.

సుప్రీం కోర్టులో న్యాయం జరగాలన్న టైమ్ పడుతుంది. ఇంట్లో కూడా అంతే అని ప్రకాశం అంటుంది. కావాల్సినంత టైమ్ తీసుకోండి అప్పటివరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ కష్టపడతానంటే ఎవరు కాదంటారు అని ప్రకాశం అంటాడు. అన్నయ్య అలాగే మాట్లాడుతుంటే నువ్ అనవేంటీ నాన్న. ధాన్యలక్ష్మీ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. నా కోడలికి సెపరేట్‌గా వంట చేసుకోడానికి పాత్రలు అవి సరిపోతాయో లేదో, కొత్తగా ఏమైనా కావాలో తీసుకొచ్చి ఇవ్వు అని సీతారామయ్య అని పెద్ద పంచ్ ఇస్తాడు.

అలా ధాన్యలక్ష్మీకి, రుద్రాణికి పెద్ద షాక్ ఇస్తాడు సీతారామయ్య. దాంతో అంతా నవ్వుకుంటారు. అలాగే నాన్న తప్పకుండా అని ప్రకాశం అంటాడు. సీతారామయ్య వెళ్లిపోతాడు. నీ వంటకు ఏమేం కావాలో లిస్ట్ రాసివ్వు. లేకపోతే మర్చిపోయాను అని గొడవ చేస్తావ్ అని ప్రకాశం అంటే కోపంగా ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. ఏంటీ అమ్మ నాన్న ఉద్దేశం. వేరు కుంపటి పెట్టిన పర్లేదు. ఆస్తి మాత్రం ముక్కలు చేయను అనా అని రుద్రాణి కోపంగా అంటుంది.

ఆస్తి ఇవ్వాలని ఉన్నా

అంతే కదా రుద్రాణ. నీకు వేరుగా చెప్పాలా అని అపర్ణ అంటుంది. మీకు సున్నితంగా చెబితే ఎలా అర్థం అవుతుంది. మా అత్తయ్యకు చాలా స్ట్రాంగ్‌గా చెబితే అర్థం అవుతుందని స్వప్న అంటుంది. రుద్రాణి వెళ్లిపోతుంటే.. ఆగు.. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టింది చాలు. ఇంకా ఇలాగే చేశావంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది అని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అర్థం కాలేదా అత్త. నిర్ణయం అంటే ఒకవేళ నీకు ఆస్తి ఇవ్వాలని ఉన్న అది సడెన్‌గా మానుకుంటా అని చెబుతున్నారు అని స్వప్న అంటుంది.

తర్వాత ఎంత కోపం ఉన్న చికెన్‌ను వదిలేస్తారా. నీకు నేను ఉన్నా నాన్న అంటూ ధాన్యలక్ష్మీ వండిన వంటను తింటుంది స్వప్న. మరోవైపు పైన ఈ డిజైన్స్‌ను రీ క్రియేట్ చేసి నేను వేసినట్లుగా బిల్డప్ ఇస్తా అని రాజ్ అంటాడు. దాంతో కోపం, దగా, కుట్ర అని రాజ్ అంతరాత్మ లోపలి నుంచి అరుస్తాడు. నువ్ లపలో ఉండు. బయటకు రాకు. అంతరాత్మను హత్య చేసిన శిక్ష పడదు అని రాజ్ అనుకుంటాడు. కళావతికి ఇంత టాలెంట్ ఎలా వచ్చింది. ఎంతైనా నేనే కదా డిజైన్స్ వేయడం నేర్పించింది అని రాజ్ అనుకుంటుంటే సీతారామయ్య వస్తాడు.

ఏంట్రా నేను రాగానే ఏదో రహస్యం దాచినట్లు దాస్తున్నావ్ అని సీతారామయ్య అంటాడు. అలాంటిదేం లేదు. రేపు డెమో ఇచ్చి అందరిముందు చూపిస్తాను. మీ ఇద్దరిలో ఎవరు గెలిచిన కాంట్రాక్ట్ మన కంపెనీకే వస్తుంది. కానీ, ఎవరు ఓడిపోయినా నేను అనుకుంది జరగదు. టెన్షన్ నీకు కాదు మాకు ఇక పడుకో అని సీతారామయ్య వెళ్లిపోతాడు. అసలు ఆ కళావతి వచ్చి డెమో ఇవ్వకుండా చేయబోతున్నానని తెలిస్తే తాతయ్య ఏమైపోతారో అని రాజ్ కన్నింగ్‌గా ఆలోచిస్తాడు.

ఆయుధ పూజ

దాంతో కావ్య ఆటో డ్రైవర్‌కు కాల్ చేసి ఆఫీస్‌కు లేట్‌గా తీసుకురావాలని, షార్ట్ కట్ అని చెప్పి ఊరంతా తిప్పి పదిన్నరకు తీసుకురావాలని, లేకుంటే నీ పని నేను చేస్తానని రాజ్ బెదిరిస్తాడు. దాంతో డ్రైవర్ సరే అంటాడు. సేమ్ మన్మథుడు సినిమాలో నాగార్జున చేసినట్లుగా చేయాలనుకుంటాడు రాజ్. మరుసటిరోజు ఉదయం కనకం తెగ పూజ చేస్తుంది. అది చూసి కావ్య ఆశ్చర్యపోతుంది. కావ్య వేసిన డిజైన్స్ వేసిన స్కెచెస్‌లను పెట్టి పూజ చేస్తుంది కనకం.

అవి నీ ఆయుధాలే. అందుకే ఆయుధ పూజ చేశాను. ఈ పందెంలో నువ్ గెలుస్తావ్ కదా. నీకు అపోజిట్‌గా ఉండేది అల్లుడు గారు కదా. ఆయన కూడా ఓటమిని ఒప్పకోరు అని కనకం అంటుంది. నా ప్రయత్నం నేను చేసే తర్వాత దేవుడి దయ అని కావ్య అంటుంది. దాంతో కనకం వాదిస్తుంది. తర్వాత కావ్య వెళ్లిపోతుంది. నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని కనకం అంటాడు కృష్ణమూర్తి. కూతురు అత్తారింటికి వెళ్తే బాధగా ఉంటుంది కదా అని కనకం అంటుంది.

అప్పుడే అంతలా ఊహించికుంటున్నావా. సరే ఏడు అని కృష్ణమూర్తి వెళ్లిపోతాడు. తర్వాత మేడమ్ ఏంటీ రోజు వచ్చేదానికంటే ముందు వస్తున్నారు. రాజ్ సర్ ఏమో లేట్‌గా తీసుకురుమ్మని చెప్పారు. ఏం చేయాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటాడు. మేడమ్ ఇప్పుడు రాహుకాలం. 20 నిమిషాలు ఆగి వెళ్దామా అని లేట్ చేసేందుకు కవర్ చేస్తాడు ఆటో డ్రైవర్. కానీ, డ్రైవర్‌ను తిట్టి ఆటో స్టార్ట్ చేయిస్తుంది కావ్య. మరోవైపు ఇంట్లో అపర్ణ కంగారుపడుతుంటుంది.

భార్యాభర్తల సవాల్‌కు పుల్ స్టాప్

ఎందుకంత టెన్షన్ అని ఇందిరాదేవి అడుగుతుంది. ఉండదా.. రాజ్ చేతిలో కావ్య ఓడిపోతుంది కదా అని రుద్రాణి అంటుంది. దాంతో నీ నోటి నుంచి మంచి మాటలే రావా అని కోప్పడుతుంది అపర్ణ. అసలు మాటలే రాకుండా చేయమంటారా అని స్వప్న అంటుంది. అంటే ఏం చేస్తావ్ అని రాహుల్ అడుగుతాడు. అమ్మమ్మ గారు పర్మిషన్ ఇస్తే ఏం చేస్తానో చెప్పను. చేసి చూపిస్తాను అని స్వప్న అంటుంది. ఇవాళ భార్యాభర్తల సవాల్‌కు పుల్ స్టాప్ పెట్టే రోజు కదా అందరం టెన్షన్‌గానే ఉన్నామని ప్రకాశం అంటాడు.

ఇంతలో రాజ్ కొత్తగా స్టైల్‌గా ఎంట్రీ ఇస్తాడు. సీఈఓ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు విషెస్ చెప్పి గంట తర్వాత కంగ్రాట్స్ చెప్పాలి. నేను ఇప్పుడే చెబుతున్నాను నేను గెలిస్తే మాత్రం కళావతి ఎప్పటికి ఆఫీస్‌లో కానీ, ఇంట్లో కానీ అడుగుపెట్టొద్దు అని తల్లిని ఆశీర్వాదం అడుగుతాడు రాజ్. పిల్ల పాపలతో చల్లగా ఉండమని అపర్ణ దీవిస్తుంది. వెళ్లి ఫ్రిజ్‌‌లో పెట్టు నీ ఆశీర్వాదం అని రాజ్ అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner