Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా దొంగతనం, ఒక్కపూటే భోజనం- ప్రభావతికి అత్త శాపనార్థాలు- బాలుకు డబుల్‌గా బామ్మ-gunde ninda gudi gantalu serial november 26th episode meena in distress by prabhavathi insult everytime star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా దొంగతనం, ఒక్కపూటే భోజనం- ప్రభావతికి అత్త శాపనార్థాలు- బాలుకు డబుల్‌గా బామ్మ

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా దొంగతనం, ఒక్కపూటే భోజనం- ప్రభావతికి అత్త శాపనార్థాలు- బాలుకు డబుల్‌గా బామ్మ

Sanjiv Kumar HT Telugu
Nov 26, 2024 08:45 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial November 26 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 26 ఎపిసోడ్‌లో సుశీల వెళ్లి వస్తానని, మంచి అత్తగా ఉండమని, లేకుంటే నాలాంటి కోడలు వస్తే ఏకాకి జీవితం అవుతుందని అంటుంది. మీ అమ్మగారు శాపనార్థాలు పెడుతున్నారు అని సత్యంను అంటుంది ప్రభావతి. మీనా ఒక్కపూటే తింటానంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ముళ్లకంప పూలగంపై మాట పడనివ్వట్లేదే. పూలగంప థ్యాంక్స్ చెబుతుంది అని మీనా అంటుంది. నువ్ రవికి పెళ్లి చేయకుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని అని బాలు అంటాడు. భూమి గుండ్రంగా తిరిగి వచ్చినట్లు అక్కడికే వస్తున్నారు అని మీనా అంటుంది. దాంతో తన చేతికి ఉన్న ఉంగరం తీస్తాడు బాలు.

మా ముందు నటించారా

ఇదిగో మీ ఉంగరం. ఇప్పటివరకు నానమ్మ కోసం భరించాను. పరాయి వాళ్ల సొమ్ము నాకొద్దు. ఏదో నాన్న చెప్పాడని నిన్ను తీసుకొచ్చాను. అది గుర్తుపెట్టుకో. రాసుకుని పూసుకుని తిరగాలంటే ఆయింట్‌మెంట్ రాసుకోవాల్సి వస్తుంది అని బాలు అంటాడు. అది విన్న సుశీల ఏంట్రా నా మనవరాలిని ఏదేదో అంటున్నావ్. అంటే బయట మా ముందు నటించారా. గదిలోకి రాగానే అంటున్నావ్ అని సుశీల నిలదీస్తుంది. ఇంతలో సత్యం వచ్చి ఏమైందని అంటాడు.

ఏం జరుగుతుందిరా ఇంట్లో. మీనాపై ఎందుకు కోప్పడుతున్నాడు వాడు అని సత్యంను అడుగుతుంది సుశీల. వాడి మొహం ఇందాక మీనా కోసం నీ కోడలుపై అరిచాడు కదా అని సత్యం అంటే.. అలా అరిచినవాడే మీనాపై అరుస్తున్నాడు. అంత తప్పు మీనా ఏం చేసింది. నాకు తెలియాలని అని సుశీల గట్టిగా అడుగుతుంది. దాంతో తనకు ట్యాబ్లెట్స్ టైమ్‌కు ఇవ్వకపోవడం వల్ల అని అబద్ధం చెబుతాడు సత్యం.

దాంతో ఎన్నని చేస్తుందిరా. కాస్తా మర్చిపోయినట్లు ఉందేమే. ఒరెయ్ తండ్రిమీద అంత ప్రేమ ఉంటే నువ్వే ఇవ్వొచ్చు కదా. మీనా కావాలని తప్పు చేసే మనిషి కాదురా. ఏదైనా పొరపాటు చేసిన దాని వెనుక ఏదో కారణం ఉంటుందని గుర్తుపెట్టుకోరా సన్నాసి అని వెళ్లిపోతుంది సుశీల. మరుసటి రోజు నేను ఇక వెళ్తున్నాను కానీ, నువ్ తృప్తిగా టిఫినే చేయి ప్రభావతి అని సుశీల అంటుంది. అలా అంటారేంటీ. మీరు ఉండటమే నాకు కావాలి అని ప్రభావతి అంటుంది.

మంచి అత్తగా ఉండమని

నీకు నీ పెద్ద కొడుకు. పెద్ద కోడలు ఉంటే చాలు. నీకు నాలాంటి కోడలు దొరికలేదు సంతోషించు. నాతో ఉన్నట్లే ఉంటే నీది ఏకాకి బతుకు అవుతుంది జాగ్రత్త అని సుశీల అంటుంది. ఉండుండి శాపనార్థాలు పెట్టి పోతున్నారు మీ అమ్మగారు చూశారా అని ప్రభావతి అంటుంది. శాపాలకు అర్థాలు తెలిస్తే శాపనార్థాలు, గూడార్థాలు తెలుస్తాయి. మంచి అత్తగా ఉండమని చెబుతుంది అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతిపై పంచ్‌లు వేస్తాడు బాలు.

అంతా సంక్రాంతికి వస్తారు కదా వెళ్లొస్తాను అని సుశీల బయలుదేరుతుంది. తనను పంపించడానికి అంతా వెళ్తారు. కానీ, ప్రభావతి రాదు. దాంతో మౌనిక రమ్మని అడుగుతుంది. నన్ను చూస్తే కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. నా కోడళ్లు వచ్చినాసరే నన్ను అంటుంది. చావు మంత్రం, తద్దిన మంత్రం అన్ని చదివేసి వెళ్లిపోతుంది. బాలు గాడే అనుకుంటే బాలుగాడుకి డబుల్ అయింది. సరే పదా అని ప్రభావతి బయటకు వస్తుంది.

రేయ్ మనోజ్ రోజు ఆఫీస్‌కు వెళ్తున్న కూడా ఒక్కరోజు కూడా జీతం తెచ్చి ఇవ్వట్లేదట. పెళ్లి అయింది. ఇంటికి బాలుగాడికి ఆసరగా ఉండరా. రోహిణి వంటింట్లో మీనాకు కాస్తా సహాయం చేయమ్మా అని సుశీల అంటుంది. మీ మనవరాలిలా పనిపాట లేకుండా లేదు కదా అని ప్రభావతి అంటుంది. సరే అమ్మమ్మ టైమ్ కుదిరినప్పుడు సహాయం చేస్తాను అని రోహిణి అంటుంది. మంచి మాట అన్నావ్. నీ అత్త బాటలో నడవకు. ఎవరికి నచ్చవు అని సుశీల అంటుంది.

రవిగాడినే చూడలేదు

తర్వాత రేయ్ నీ కారుఏదిరా అని సుశీల అడిగితే వైజాగ్ ట్రిప్ వెళ్లిందని అబద్దం చెబుతాడు బాలు. మీనాను అర్థం చేసుకుని బాగా చూసుకోరా. ఇప్పటికే మీ అమ్మ నానా మాటలు అంటుంది అని సుశీల అనడంతో ప్రేమగా హగ్ చేసుకుంటుంది మీనా. ఈ సన్నాసి ఏమైనా అంటే నాకు ఫోన్ చేయి వెంటనే నేను వస్తాను అని సుశీల అంటుంది. తర్వాత ఒక్క రవిగాడిని చూడలేదన్న వెలితి మిగిలిపోయిందని వెళ్లిపోతుంది సుశీల.

అనంతరం దీపావళికి అత్తగారింటికి అలా వెళ్లి ఇలా వచ్చావ్. నిన్ను ఇంట్లో పెట్టి పూలదగ్గర కూర్చున్నారా అని ప్రభావతి అంటుంది. ఇన్నాళ్లు అమ్మింది వేరు. దీపావళికి అమ్మింది వేరు. నాకోసం ఇంట్లోనే ఉన్నారు అని బాలు అంటాడు. సరే పండక్కి బంగారం ఎంత పెట్టారురా అని ప్రభావతి అంటే బంగారం నాకెందుకు అని బాలు అంటాడు. పాపం ఏం పెడతారులే పూలు అమ్ముకుంటేనే పూట గడిచే ఇల్లు కదా అని ప్రభావతి అంటుంది.

దాంతో మనోజ్ నవ్వుతాడు. అప్పుడు మనోజ్‌ను మొత్తం తడిమి చూస్తాడు బాలు. ఏం వెతుకుతున్నావురా అని మనోజ్ అంటాడు. బంగారంరా. మీ మలేషియా మావయ్య ఎంత పెట్టాడురా. ఏం కనిపించలేదుగా. ప్రతిదానికి మా అత్తగారి మీద పడి ఏడుస్తావ్ ఎందుకు అని బాలు అంటాడు. అత్తారింటికి వాడు వెళ్లాడా నువ్ వెళ్లావా. ఒట్టి చేతులతో ఎలా పంపిస్తారు అని ప్రభావతి అంటుంది. ఒట్టి చేతులతో ఎందుకు పంపిస్తారు. ఇదిగో ఉంగరం పెట్టారు. చూడండి బాగా చూడండి అని బాలు అంటాడు.

మనోజ్ అన్నయ్యను అడగవా

మరి మీ మలేషియా అన్నయ్యగారు ఏం పెట్టారు. మా అత్తగారికి మంచి మర్యాదా తెలుసు. ఇంటికి వెళ్తే కడుపునిండా భోజనం పెట్టి గానీ పంపించదు అని బాలు సపోర్టింగ్‌గా మాట్లాడతాడు. దాంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. మీనా వదిన గురించి అడిగావ్. మరి మనోజ్ అన్నయ్య గురించి అడగవా అని మౌనిక అంటే.. అది ఇప్పుడు చెప్పు అని ప్రభావతిని సత్యం అంటాడు. ఇప్పటివరకు రోహిణి వదిన పుట్టింటి నుంచి ఒక్క చీర కూడా రాలేదు. సారీ వదినా నిన్ను అనాలని నాకు లేదు. కానీ, మా అమ్మ అనేముందు ఆలోచించుకోవాలని చెబుతున్నాను అని మౌనిక అంటుంది.

మీనా, బాలును అనాలని చూసిన ప్రభావతికి రోహిణి విషయం వచ్చి ఇరుక్కుంది. సరే వదిలేయ్ నీ అద్దెకారు ఏమైందని సత్యం అడుగుతాడు. ఓనర్ కూతురు ఢిల్లీ నుంచి వస్తుందట. వారం రోజులు ఇవ్వడం కుదరదు అని బాలు అంటాడు. ఇందాక మీనా ఏం చెప్పాలనికుందని అడిగితే.. నేను చెప్పిందే అని బాలు కవర్ చేస్తాడు. వారం రోజులు డబ్బులు రావా. వారం రోజులు పెళ్లాం మొగుడు కూర్చుని తింటే ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది అని ప్రభావతి అంటుంది.

ఇది నా షేర్ అని రోహిణి డబ్బు ఇస్తుంది. మనోజ్ అన్నయ్య నీ షేర్ ఏది అని మౌనిక అంటుంది. వాడు ఎప్పుడో ఇచ్చాడని కవర్ చేస్తుంది ప్రభావతి. రోహిణి పార్లర్ నడుపుతుంది ఇచ్చింది. మరి నీ భార్యకు నీది కలిపే ఇవ్వాలి అని ప్రభావతి అంటుంది. ప్రతిసారి వాడే ఇచ్చాడు కదా. ఒక్క వారమేకదా అని సత్యం అంటాడు. ఈ వారం తినకుండా ఉంటారా. తక్కువ తింటే బరువు తక్కువగా ఉంటారు అని ప్రభావతి అంటుంది.

ఒక్కపూటే తింటానులే

అది నువ్వే ఇది నువ్వే. నువ్ పార్లరమ్మ లారీ టైర్లలా ఉన్నారు అని బాలు అంటాడు. అరేయ్ ఇది బాడీ షేమింగ్‌రా అని మనోజ్ అంటాడు. ఏరా నీకు తెలియట్లేదా అని బాలు కౌంటర్ వేస్తాడు. అందరికంటే మీనా గుప్పెడు ఎక్కువే తింటుంది అని ప్రభావతి అంటుంది. ఛీ నోర్మూయ్. కడుపుకు అన్నమే తింటున్నావా అని సత్యం అంటాడు. ఈ వారం రోజులు నేను ఒక్కపూటే తింటానులే మావయ్య అని బాధగా వెళ్లిపోతుంది మీనా. దాంతో అంతా బాధపడుతారు.

మీనా తింటేనే ఖర్చు పెరుగుతుందా ఆంటీ. ఆ మాట ఎందుకు అన్నారు అని రోహిణి అడుగుతుంది. నువ్ తినేది తూకం వేసి చూస్తాను అని బాలు వెళ్లిపోతాడు. నా డబ్బులు కూడా ఇస్తున్నాను కదా అని మౌనిక అంటే నీ పెళ్లి కోసం చీటీ వేస్తున్నాను. ఈ వారం రోజులు ఎలా గడుస్తుందో అని ప్రభావతి అంటుంది. తర్వాత ప్రభావతి అన్న మాటలు తలుచుకుని మీనా బాధపడుతుంది. ఇంతలో బాలు వస్తే థ్యాంక్స్. మా పుట్టింటి మీద మాట పడనివ్వలేదుగా అని మీనా అంటుంది.

అది నీ మీద ప్రేమతోకాదు. తప్పుగా మాట్లాడింది అందుకే అని బాలు అంటుంది. అన్ని బాగానే చెబుతారు. కానీ, నన్నెందుకు అర్థం చేసుకోరు అని మీనా అంటుంది. దాంతో మళ్లీ ఉంగరం తీసేందుకు ప్రయత్నిస్తాడు బాలు. నా అద్దె కారు గురించి ఎందుకు చెప్పాలనుకున్నావ్. అసలు నా కారు మా ఓనర్ లాక్కోడానికి కారణం నువ్వే. ఇంటి పత్రాలు మా నాన్నకు ఇచ్చినట్లు చెప్పి ఉంటే అవే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేవాడిని. వాడేదో నోరు జారాడని కొట్టాను. వాడు కారు లాక్కున్నాడు అని బాలు అంటాడు.

దొంగతనం చేయలేదు

నడపడానికి కారు లేదు. నా జీవితంలో ఇలా ఎప్పుడు జరగలేదు. నువ్ అడుగుపెట్టాకే ఇలాగా జరుగుతుంది అని బాలు అంటాడు. తర్వాత డబ్బు రేపు ఇస్తానని బాలు అంటే.. రేపు ఇవ్వడం ఏంట్రా. నీ భార్య ఇచ్చింది కదా. వీడికి తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చావ్. దొంగతనం చేశావా. ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రభావతి నిలదీస్తుంది. దొంగతనం చేసి బతకాల్సిన కర్మ నాకు పట్టలేదని మీనా అంటుంది.

దొంగతనం చేయడం మీ కుటుంబానికి ఏమైనా కొత్తా. నీ తమ్ముడే దొంగ అనుకున్నాను. నువ్ కూడా మొదలుపెట్టావా అని ప్రభావతి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner