Gunde Ninda Gudi Gantalu: మీనా మొక్కు చెల్లించిన బాలు - బయటపడ్డ రోహిణి సీక్రెట్స్ - రవి, శృతి హ్యాపీ
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 21 ఎపిసోడ్‌లో తన కోసం బాలు తెచ్చిన గాజులు చూసి మీనా సంబరపడుతుంది. కానీ ఈ గాజులు ఒకప్పటి నాకు నచ్చిన మీనా కోసం కొన్నానని, ఇప్పటి మీనా నన్ను మోసం చేసింది గాజులు లాక్కుంటాడు బాలు. బాలు మాటలతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu: తాను కారు అమ్మలేదనే విషయం నానమ్మ సుశీల దాచిపెట్టేందుకు బాలు తెగ కష్టపడతాడు. కారు చూస్తానని సుశీల అనడంతో తాను అమ్మిన గణపతి వద్దకు వస్తాడు. రెండు గంటలు కార్ కావాలని గణపతిని అడుగుతాడు. నానమ్మ డబ్బులతో కారు కొన్నానని, వచ్చినప్పటి నుంచి కారు గురించే ఆమె అడుగుతుందని తనకు చూపించడానికి ఒక్కసారి ఈ కార్ తీసుకెళతానని గణపతిని రిక్వెస్ట్ చేస్తాడు. బాలుకు కారుతో ఉన్న ఎటాచ్‌మెంట్ చూసి గణపతి కరిగిపోతాడు. కారు ఇవ్వడమే కాకుండా బాలు వెంట అతడి ఇంటికి గణపతి వస్తాడు.
పానకంలో పుడకలా...
కారు తీసుకొచ్చానని, అందులో గుడికి వెళదామని నానమ్మతో అంటాడు బాలు. మీనా కూడా వస్తానని అన్నదని, ముగ్గురం కలిసే వెళదామని సుశీల అంటుంది. పానకంలో పుడకలా మీనా ఎందుకని, తను రాకపోతే గుడిలో దేవుడి దర్శనం దొరకదా అంటూ బామ్మతో అంటాడు బాలు. అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. మీనాను కూడా గుడికి తీసుకెళ్లాల్సిందేనని ఆర్డర్‌వేస్తాడు.గుడికి వెళ్లడానికి ముస్తాబైన మీనా ఓరగా బాలువైపు చూస్తుంది. ఇలా చూసే మా కొంపలు ముంచుతారు అంటూ సెటైర్లువేస్తాడు. నువ్వు ఎలా చూసిన బాలు నిగ్రహాన్ని కోల్పోడని అంటాడు.
మీనా సంబరం...
బాలు తన కోసం తెచ్చిన గాజులు చూసి మీనా సంబరపడుతుంది. ఇది ఒకప్పుడు నాకు నచ్చిన మీనా కోసం కొన్నానని, నేను నమ్మిన మీనా కోసం కొన్నానని అంటాడు చేతిలోని గాజులను లాక్కోబతాడు బాలు.
కానీ ఈ మీనా నన్ను మోసం చేసింది. నా మాట తోసిపుచ్చి...మా నాన్న జైలుకు వెళ్లడానికి, హాస్పిటల్ పాలవ్వడానికి కారణమైంది అంటూ భార్య మనసును ముక్కలు చేస్తాడు. ఎప్పటికీ నీ విషయంలో నా అభిప్రాయం మారదని బాలు అనగానే గాజులు బాలుకే ఇచ్చేసి కన్నీళ్లతో మీనా వెళ్లిపోతుంది.
పాములా నా పక్కనే...
మీనా, బాలు జంటను చూసి సత్యం, సుశీల సంబరపడతారు. ఇద్దరి పార్వతీపరమేశ్వరుల్లా ఉన్నారని అంటారు. శివుడికి మెడలో పాము ఉంటుంది...నాకు ఎప్పుడు పక్కనే ఉంటుందని మీనాపై సెటైర్లు వేస్తాడు. గుడికి బాలు, మీనా, సుశీల బయలుదేరబోతుండగా రోహిణి ఎదురస్తుంది. కాసేపు ఆగి వెళదామని, శకునం బాగాలేదని బాలు అంటాడు.
గుడికి వెళదాం వస్తావా అని రోహిణిని అడుగుతుంది సుశీల. వాళ్లు పెద్దోళ్లు...మనతో ఎందుకొస్తారు. వాళ్ల అత్తగారితో వెళతారని రోహిణితో వెటకారంగా మాట్లాడుతాడు బాలు. తేడాలు చూపించే అలవాటు మాకు లేదని మనోజ్ అంటాడు.
బాలు అబద్ధం...
కారు దగ్గర గణపతిని చూసిన సుశీల ఇతడు ఎవరని అడుగుతుంది. డ్రైవర్ అని బాలు అబద్ధం ఆడుతాడు. ఈ కారు అంటే బాలుకు మహా ఇష్టమని, జాగ్రత్తగా చూసుకోమని అంటుంది. బాలు ముందు కూర్చోబోతాడు. కానీ సుశీల పట్టుపట్టి బాలు, మీనాలను వెనక కూర్చండబెడుతుంది. బ్రేక్ వేయడంతో బాలుపై పడుతుంది మీనా. సరిగ్గా కూర్చోలేవా అంటూ ఫైర్ అవుతుంది. అది చూసి బాలుకు క్లాస్ ఇస్తుంది సుశీల. సమస్యలు ఉంటే పరిష్కరించుకొని సఖ్యతగా ఉండాలని అంటుంది.
రవి సంబరం...
నానమ్మ తనకు కాల్ చేసిన సంగతి శృతికి చెప్పి సంబరపడిపోతాడు రవి. నానమ్మ తనను ఇంటికి రమ్మని పిలిచిందని అంటాడు. తిరిగి ఫ్యామిలీతో కలిసేందుకే మనల్ని ఇంటికి పిలిచిందని రవి చెబుతాడు. ఇంట్లో అందరితో కలిసి ఉండే రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని ఆనందంగా అంటాడు.
రవి వెంట తాను అత్తింటికి వస్తానని శృతి అంటుంది. కానీ రవి వద్దని అంటాడు. బాలు అడ్డుచెబుతాడుకావచ్చునని, అక్కడ నీకు ఏదైనా అవమానం జరిగితే తన మనసుకు బాధ కలుగుతుందని అంటాడు.
అందరు ఇంటి కోడలిగా నిన్ను సంతోషంగా ఆహ్వానించాలి...నా ఫ్యామిలీ ప్రేమతో నిన్ను పిలవాలని శృతితో బాటు చెబుతాడు. నేను ముందు వెళ్లి అక్కడ అన్ని మాట్లాడి ఆ తర్వాత నిన్ను తీసుకెళతానని అంటాడు. రవి మాటలతో శృతి కన్వీన్స్ అవుతుంది.
బాలు చేత పోర్లు దండాలు...
బాలు చేత పోర్లు దండాలు పెట్టిస్తుంది మీనా. మావయ్య ఆరోగ్యం కుదటపడితే మీతో పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నానని. ఈ రోజు ఆ మొక్కు తీర్చుకున్నానని మీనా అంటుంది. మా నాన్న కోసం నువ్వు మొక్కుకున్నావంటే ఎక్కడో డౌట్ కొడుతుందని బాలు అనుమానపడతాడు. ఇది మొక్కులా లేదని, నాపై కక్ష సాధింపులా ఉందని అంటాడు. ఈ విషయంలో ఇంకోసారి మీనాను తప్పు పడితే బాగుండదని బాలుకు వార్నింగ్ సుశీల.
కొరివి...
ప్రభావతి కనిపించకపోవడంతో కొరివి ఎక్కడ కనపడటం లేదని సుశీల అడుగుతుంది. మా ఊళ్లో వాళ్లందరూ కోడలిని తెచ్చుకోమంటే కొరివిని తెచ్చుకున్నావని అంటుంటారని, మీ అత్త కష్టపడి సంపాదించుకున్న బిరుదు అని సుశీలపై సెటైర్లు వేస్తుంది. వంట పనులు తనకు వదిలేసి మీనా గుడికి వెళ్లడంతో ఆమెపై ప్రభావతి ఫైర్ అవుతుంది. మీనాకు సపోర్ట్‌గా సుశీల నిలుస్తుంది. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నప్పుడు..
.అందరూ కలిసి పనిచేసుకోవచ్చు కదా ఫైర్ అవుతుంది. రోహిణి పార్లర్‌కు వెళుతుందని, మౌనిక ఆఫీస్‌కు వెళుతుందని ప్రభావతి అంటుంది. నువ్వేం చేస్తున్నావని ప్రభావతికి క్లాస్ ఇస్తుంది. రోహిణికి ఈ రోజు సెలవు కదా.. ఆమె సాయం చేస్తే తప్పేముంది అంటూ సుశీల అంటుంది.
రోహిణిని వెనకేసుకొచ్చిన ప్రభావతి...
రోహిణి గొప్పింటి పిల్ల అని, ఆమెకు వంట పనులు చేయడం రాదని పెద్ద కోడలిని వెనకేసుకువస్తుంది ప్రభావతి. రోహిణికి ఎప్పుడోగాని సెలవు దొరకదని, ఈరోజు రెస్ట్ తీసుకోనివ్వమని అంటుంది. రోహిణికి వంట రాదని అంటుంది. ఇదే బుద్ది మీనా విషయంలో ఉంటే బాగుంటుందని, ఇంట్లో పనిచేసేవాళ్లకు సెలవులు ఉండవు కదా...ఈ రోజు మీనా బదులు రోహిణి వంట చేయాల్సిందేనని సుశీల పట్టుపడుతుంది.
రోహిణిని తాను పిలుచుకువస్తానని వెళుతుంది ప్రభావతి. గారెలు చేయమని అంటే ఏమనుకుంటుందోనని మోహమాటంగానే అడుగుతుంది. గారెలు చేయడం నాకు రాదని రోహిణి అంటుంది. పండుగ రోజు మొదటివాయ పెద్ద కోడలు వేయాలని అత్తగారు పట్టుపడుతుందని చెప్పి రోహిణిని వంట గదిలోకి తీసుకెళుతుంది.
రోహిణి తల్లి ఎంట్రీ...
రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని వర్ధన్ ఫోన్ చేయడంతో కంగారుపడిన ఆమె తల్లి కూతురిని చూసేందుకు వస్తుంది. ఆ టైమ్‌లో రోహిణి తలపై క్లాత్ కప్పుకొని పడుకొని ఉండటం చూసి అయ్యోయ్యో రోహిణి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు ఇంట్లో వాళ్లందరూ వస్తారు. రోహిణి తల్లిని చూసి ఈమె ఇక్కడెందుకు ఉంది, రోహిణిని చూసి ఎందుకు అరిచారు అని అడుగుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్