Gunde Ninda Gudi Gantalu: బయటపడిన రోహిణి తల్లి ప్రేమ.. పెద్ద షాక్ ఇచ్చిన ప్రభావతి.. శ్రుతికి చెప్పుకుని ఏడ్చిన రవి-gunde ninda gudi gantalu serial latest episode promo rohini mother love revealed in diwali celebrations star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: బయటపడిన రోహిణి తల్లి ప్రేమ.. పెద్ద షాక్ ఇచ్చిన ప్రభావతి.. శ్రుతికి చెప్పుకుని ఏడ్చిన రవి

Gunde Ninda Gudi Gantalu: బయటపడిన రోహిణి తల్లి ప్రేమ.. పెద్ద షాక్ ఇచ్చిన ప్రభావతి.. శ్రుతికి చెప్పుకుని ఏడ్చిన రవి

Sanjiv Kumar HT Telugu
Nov 23, 2024 08:31 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌ను అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. కానీ, ఇంటికి దూరంగా పరాయి వాడిలా రవి చూస్తూ ఉండిపోతాడు. ఈ క్రమంలోనే రోహిణి తల్లి ప్రేమ బయటపడుతుంది.

గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌లో రోహిణి తలకు తడబట్ట ఉండటం చూసి కంగారుపడుతుంది తల్లి సుగుణ. రోహిణితో మాట్లాడుతుంది. కానీ, ఎందుకొచ్చావ్ అని తల్లిపై ఫైర్ అవుతుంది రోహిణి. తనను కల్యాణి అని పిలవొద్దని, బాలు, మీనాలను కలవద్దని ఆర్డర్స్ వేస్తుంది రోహిణి. కానీ, ఇంతలో డోర్ పక్కన ఉన్న మీనాను చూసి ఇద్దరూ షాక్ అవుతారు.

కూతురు అని చెప్పకుండా

కానీ, మీనా వారి మాటలు వినకపోడవంతో రోహిణి ఏదోటి చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత చింటూ కోసం గారెలు తీసుకొచ్చావా అని తినమని ఇస్తుంది రోహిణి. ఉంటాను ఆంటీ అని వెళ్లిపోతుంది రోహిణి. తర్వాత రోహిణి మీకు ముందే తెలుసు కదా అని సుగుణను మీనా అడుగుతుంది. దానికి సుగుణ తెగ షాక్ అవుతుంది. అయితే, రోహిణి తనకు ఎలా తెలుసో చెబుతుంది. కానీ, రోహిణి తన కూతురు అని చెప్పకుండా ఏదో జస్ట్ పరిచయం ఉన్నట్లుగా చెప్పి కవర్ చేస్తుంది సుగుణ.

పరాయి వాడిలా రవి

అయినా, సుగుణపై మీనాకు డౌట్ వస్తుంది. సుగుణ, రోహిణి మధ్య ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని అనుమానిస్తుంది మీనా. తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే అంతా కలిసి టపాసులు కాల్చుతుంటారు. వారంతా టపాసులు కాలుస్తుంటే పరాయి వాడిలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు రవి. తన కుటుంబం అంతా కలిసి సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే తాను మాత్రం ఇంటికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతాడు రవి.

చింటుపై అరిచిన ప్రభావతి

తర్వాత సత్యం ఫ్యామిలీతో పాటు రోహిణి కొడుకు చింటు కూడా టపాసులు కాలుస్తుంటాడు. అది చూసి మనోజ్ తెగ చిరాకుపడతాడు. వాడు ఎవడికి పుట్టాడో తెలియదు. కానీ, చూడు దర్జాగా ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని రోహిణి, ప్రభావతితో తన అక్కసు వెళ్లగక్కుతాడు మనోజ్. తర్వాత చింటు టపాసులు కాల్చేందుకు వెళ్తాడు. కానీ, వాడిపై ప్రభావతి అరుస్తుంది. రేయ్ పక్కకు తప్పుకోరా అని గద్దిస్తుంది.

బయటపడిన తల్లి ప్రేమ

ఇంతలో చింటు కళ్లలో టపాసుల నిప్పు రవ్వు పడుతుంది. దాంతో రోహిణి తెగ కంగారుపడిపోయి చింటూ అని వెళ్తుంది. రోహిణి తల్లి ప్రేమ బయటపడి చింటుని ఎత్తుకుని పక్కకు లాగుతుంది. అదంతా చూసి మనోజ్, ప్రభావతి, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత కింద కూర్చుని మంటగా ఉందా, కళ్లు మండుతున్నాయా, జాగ్రత్తగా ఉండాలి కదా అని చింటుతో చెబుతుంది రోహిణి. అనంతరం చింటును ప్రేమగా హగ్ చేసుకుంటుంది రోహిణి.

తల్లికి జాగ్రత్తలు

చింటును సుగుణకు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని, ఇకనైనా జాగ్రత్తగా ఉండమని, చింటును అస్సలు వదిలిపెట్టకని తల్లికి జాగ్రత్తలు చెబుతుంది రోహిణి. అదంతా సత్యం ఫ్యామిలీ చూస్తారు. బాలు వెళ్లి పార్లరమ్మా నువ్వెందుకు అంత కంగారుగా పరిగెత్తావ్ అని అడుగుతాడు. దాంతో రోహిణి భయంతో కంగారుపడుతుంది. రోహిణి ఏం చెబుతుందా అని ప్రభావతి, మనోజ్ వేచిచూస్తారు. కానీ, రోహిణి మాత్రం కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ప్రభావతి కోరిక

ఎవరికైనా చిన్న పిల్లలు చిన్న పిల్లలే కదా. చిన్న పిల్లలకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని, పిల్లలంటే తనకు ఇష్టమని, అందుకే అలా రియాక్ట్ అయి కంగారుగా పరుగెత్తానని రోహిణి కవర్ చేసుకుంటుంది. రోహిణి మంచితనతం చూసి ప్రభావతి, మనోజ్ మురిసిపోతారు. చిన్న పిల్లలు ఇష్టమైనప్పుడు త్వరలో మనవడిని చేతిలో పెట్టాలని రోహిణి, మనోజ్‌తో తన కోరిక బయటపెడుతుంది ప్రభావతి.

పెద్ద షాక్

దాంతో మనోజ్ సంతోషంగా ఫీల్ అవుతాడు. కానీ, రోహిణి మాత్రం కంగారుగా చూస్తుంది. చింటు మీదున్న ప్రేమను చూపించిన రోహిణికి మనోజ్‌తో తల్లి కావాలని ప్రభావతి కోరిక కోరి పెద్ద షాక్ ఇచ్చినట్లు అవుతుంది. తర్వాత ఇంటికెళ్లి సత్యం ఇంట్లో జరిగింది శ్రుతితో చెప్పుకుని రవి బాధపడతాడు. బాలు అన్నయ్య ఇంట్లోకి రానివ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner