Commonwealth Games 2022: ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసిన సుశీలా దేవి
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసింది జుడోకా సుశీలా దేవి. ఆమె వుమెన్స్ 48 కేజీల కేటగిరీలో టాప్ సీడ్ ప్రిసిల్లా మొరాండ్‌ను షాక్ ఇచ్చి ఫైనల్ చేరడం విశేషం.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ జూడోలో ఇండియాకు మెడల్ ఖాయం చేసింది సుశీలా దేవి లిక్మాబమ్. సోమవారం (ఆగస్ట్ 1) జరిగిన సెమీస్‌లో ఆమె 48 కేజీల కేటగిరీలో టాప్ సీడ్, మారిషస్‌కు చెందిన ప్రిసిల్లా మొరాండ్‌పై గెలిచింది. సోమవారమే ఆమె ఫైనల్లో గోల్డ్ మెడల్ కోసం తలపడనుంది. సుశీలా దేవి 2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సిల్వర్ మెడల్ గెలిచింది.
ఈసారి దానిని గోల్డ్ మెడల్‌గా మలిచే అవకాశం ఆమె దక్కింది. సుశీలా దేవి ఫైనల్లో సౌతాఫ్రికాకు చెందిన గెరోనే వైట్‌బూయ్‌తో తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో జూడోలో పార్టిసిపేట్ చేసిన ఏకైక ఇండియన్‌గా నిలిచిన ఆమె.. అక్కడ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. కామన్వెల్త్ గేమ్స్ జూడోలో ఇండియా ఇప్పటి వరకూ గోల్డ్ మెడల్ గెలవలేదు.
గతంలో 3 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. ఇప్పుడా రికార్డును చెరిపేసే ఛాన్స్ సుశీలా దేవి ముందు ఉంది. ఆమె కాకుండా సోమవారం మరో ముగ్గురు జూడోకాలు కూడా మెడల్ రేసులో ఉన్నారు. పురుషుల 66 కేజీ కేటగిరీ సెమీస్‌లో ఓడిన జస్లీన్ సింగ్ సైనీ.. బ్రాంజ్ మెడల్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన నేథన్ కట్జ్‌తో తలపడనున్నాడు.
ఇక వుమెన్స్ 57 కేజీల కేటగిరీలో సుచికా తరియాల్ రెపీచేజ్ బౌట్‌లో గెలిచి బ్రాంజ్ మెడల్ రేసులో నిలిచింది. ఈ మెడల్ కోసం మరో బౌట్‌లో ఆమె తలపడాల్సి ఉంది. మారిషస్‌కు చెందిన క్రిస్టియాన్‌తో బ్రాంజ్ మెడల్ బౌట్ ఉంటుంది.
సంబంధిత కథనం