New Year Celebrations 2025: న్యూఇయర్‌ను జోష్‍తో సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇండియాలో 8 బెస్ట్ ప్లేస్‍లు ఇవి
New Year 2025 Celebrations: న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలని ఇప్పటి నుంచే చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. వేరే ప్రాంతాలకు వెళ్లి జోష్‍తో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇండియాలో న్యూఇయర్ సెలెబ్రేషన్లకు టాప్ 8 ప్లేస్‍లు ఏవో ఇక్కడ చూడండి.
న్యూఇయర్ సమీపిస్తుందంటే జోష్ మామూలుగా ఉండదు. వచ్చే నెల డిసెంబర్‌తో 2024 ముగియనుంది. 2025లోకి అడుగుపెట్టనున్నాం. ఈ తరుణంలో న్యూయర్ సెలెబ్రేషన్ల కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటారు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలనుకుంటారు. ఇయర్ ఎండ్‍లో వెకేషన్‍కు వెళ్లి.. అక్కడే న్యూఇయర్‌కు గ్రాండ్‍గా వెల్‍కమ్ చెప్పాలని భావిస్తుంటారు. 2025 న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఇండియాలో కొన్ని బెస్ట్ ప్లేస్‍లు ఏవో ఇక్కడ చూడండి.
గోవా
న్యూఇయర్ సెలెబ్రేషన్లకు గోవా పర్‌ఫెక్ట్ ప్లేస్‍గా ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడ బీచ్ పార్టీ భారీగా జరుగుతాయి. నైట్‍క్లబ్‍లు, వాటర్ యాక్టివిటీలు, డిఫరెంట్ ఫుడ్స్ ఇలా గోవాలో ఓ సెలెబ్రేషన్స్ ప్రపంచంలా ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని పార్టీలు, జోష్‍తో స్వాగతం పలకాలంటే గోవా సరైన ప్లేస్‍గా ఉంటుంది.
మనాలీ
చల్లటి వాతావరణం, మంచు కొండలు ఇష్టమైన వారు కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు మనాలీ అదిరిపోతుంది. న్యూఇయర్ సందర్భంగా ఈ సిటీలో డీజే నైట్‍పార్టీలు భారీగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రెక్కింగ్, స్కియింగ్ లాంటివి చేయవచ్చు. ఈ సమయంలో మంచు కూడా కురిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రకృతి అద్భుతంగా ఉంటుంది.
పాండిచ్చేరి
బీచ్ అంటే ఇష్టమైన వారికి పాండిచ్చేరి బాగా నచ్చుతుంది. ఇక్కడి కూడా న్యూఇయర్ పార్టీలు బాగా జరుగుతాయి. బీచ్‍ల్లో బైకింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడి కేఫ్‍లు కూడా ఆకట్టుకుంది. రకరకాల చేపలతో వండిన ఫుడ్స్ కూడా టేస్ట్ చేయవచ్చు. పురాతన కట్టడాలు కూడా ఉంటాయి.
ఊటీ
ప్రకృతి అందాల మధ్య కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలంటే తమిళనాడులోని ఊటీ సరైన ప్లేస్‍గా ఉంటుంది. ఈ హిల్‍స్టేషన్‍లో పచ్చదనం, సరస్సులు, టీ తోటలు, ఉద్యావనాలు మనసును కట్టిపారేస్తాయి. ఈ అందాల సిటీలో కూడా న్యూఇయర్ పార్టీలు జరుగుతాయి.
హైదరాబాద్
హైదరాబాద్‍లోనూ న్యూఇయర్ పార్టీలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఔట్‍డోర్ డీజే పార్టీలు మోతమోగుతాయి. పబ్‍లు కూడా అధికంగానే ఉన్నాయి. సిటీలో చూడాల్సిన ఐకానిక్ ప్లేస్‍లు కూడా చాలా ఉన్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ కూడా బెస్ట్ ఆప్షన్‍గా ఉంటుంది.
శ్రీనగర్
న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకునేందుకు కశ్మీర్‌లోని శ్రీనగర్ కూడా సూపర్‌గా ఉంటుంది. హిమాలయ పర్వతాల మధ్య శీతల వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకవచ్చు. ఇయర్ ఎండ్‍లో శ్రీనగర్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. అందుకే మంచు చూడాలనునే వారు న్యూఇయర్ కోసం ఇక్కడికి వెళితే మంచి అనుభూతి ఉంటుంది.
మున్నార్
కేరళలోని మున్నార్.. ప్రకృతి అందాలకు నెలవుగా ఉంటుంది. ఇక్కడి పచ్చదనం మనసును దోచేస్తుంది. ఆహ్లాదకర వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలంటే ఈ ప్లేస్ బెస్ట్. ట్రెక్కింగ్‍కు కూడా సూటవుతుంది. పార్టీల కోసం క్లబ్‍లు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి.
ముంబై
ముంబైలోనూ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‍లో జరుగుతాయి. పార్టీలు భారీగా జరుగుతాయి. మెరేన్ డ్రైవ్, బీచ్‍లో తిరుగుతూ ఎంజాయ్ చేయవచ్చు. గేట్ వే ఆఫ్ ఇండియాకు వెళ్లవచ్చు. భారీ సంఖ్యలో పబ్‍లు ఉంటాయి.