Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యుషన్లో తేడాగా ఉన్న ఆపిల్ ఎక్కడుందో కేవలం 10 సెకన్లలో కనిపెట్టండి-find out where the difference apple is in just ten seconds in this optical illusion ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యుషన్లో తేడాగా ఉన్న ఆపిల్ ఎక్కడుందో కేవలం 10 సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యుషన్లో తేడాగా ఉన్న ఆపిల్ ఎక్కడుందో కేవలం 10 సెకన్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
Nov 26, 2024 09:30 AM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు సవాలు విసురుతాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. దీన్ని కేవలం 10 సెకన్లలో పరిష్కరించి చూపించండి.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు, కంటికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆ రెండింటి పనితీరును మెరుగుపరుస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విభిన్నంగా చూడటాన్ని ఇవి మనకు నేర్పిస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో దృష్టి విశ్లేషణ, సృజనాత్మకత వంటివి పెంచడానికి సహాయపడతాయి. మెదడును ఉత్తేజపరుస్తాయి. ఆధునిక జీవనశైలిలో కావాల్సిన నైపుణ్యాలను ఆప్టికల్ ఇల్యూషన్లు పెంచుతాయి.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇక్కడ ఎన్నో ఆపిల్ పండ్లు ఒకదాని పక్కన ఉన్నాయి. కొన్ని ఎరుపు రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం చాలా భిన్నంగా ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీ పని. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలోనే మీరు దాన్ని కనిపెట్టాలి. యాపిల్ పండు ఆకారాన్ని, పైనున్న చిన్న ఆకు ఆకారాన్ని కూడా వేగంగా గమనించండి. ఎక్కడో దగ్గర ఒక యాపిల్ భిన్నంగా ఉంటుంది. దాన్ని మీరు కనిపెట్టి చెబితే మీ పరిశీలన శక్తి అద్భుతం అని మెచ్చుకోవచ్చు. నిజానికి మీరు ఆ ఆపిల్‌ను చాలా సులువుగా కలిపి కనిపెట్టేయవచ్చు. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఇప్పటికే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. నిజానికి చాలా సులువైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. ఇక జవాబు విషయానికి వస్తే రెండో అడ్డు వరుసలోనే ఒక యాపిల్ తిరగబడి ఉంది చూడండి. అంత స్పష్టంగా జవాబు ఉంది కాబట్టే కేవలం 10 సెకన్ల సమయమే మీకు ఇచ్చాము.

ఆప్టికల్ ఇల్యూషన్లో మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అభిజ్ఞా ప్రయోజనాలను పెంచుతాయి. మెదడు, ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇది కళ్లు సేకరించిన సమాచారాన్ని విభిన్నంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటుంది. సృజనాత్మకతను పెంపొందించుకుంటుంది. మానసిక చురుకుతనం పెరుగుతుంది. మెదడుకు వ్యాయామం కూడా జరుగుతుంది. కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు పరిష్కరిస్తూ ఉండండి.

ఆప్టికల్ ఇల్యూషన్ లా చరిత్ర ఈనాటిది కాదు. ఎప్పట్నించో వీటిని వినోదాత్మక పద్ధతిలో వాడుతున్నారని చెప్పే ఆధారాలు చరిత్రకారులకు దొరికాయి. మొదటిసారి ఆప్టికల్ ఇల్యూషన్ లాంటి చిత్రాలను గ్రీకు దేశంలోని పురాతన దేవాలయాలపై గుర్తించారు. అందుకే ఇప్పటికీ ఆప్టికల్ ఇల్యూషన్ పుట్టినిల్లుగా గ్రీకు దేశాన్ని చెప్పుకుంటారు.

ఆప్టికల్ ఇల్యూషన్లు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అప్పుడప్పుడు వీటిని వారి చేత చేయించాలి. వీటిని సాల్వ్ చేయడం అలవాటు చేసుకుంటే వారికి ఏ సమస్యనైనా పరిష్కరించే సామర్థ్యం వస్తుంది.

Whats_app_banner