Sabudana Dosa Recipe: నోట్లో అలా కరిగిపోయే సాఫ్ట్ ఇన్‍స్టంట్ సగ్గుబియ్యం దోశ.. తయారు చేసుకోండిలా..-sabudana dosa recipe process ingredients make this saggu biyyam dosa instantly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sabudana Dosa Recipe: నోట్లో అలా కరిగిపోయే సాఫ్ట్ ఇన్‍స్టంట్ సగ్గుబియ్యం దోశ.. తయారు చేసుకోండిలా..

Sabudana Dosa Recipe: నోట్లో అలా కరిగిపోయే సాఫ్ట్ ఇన్‍స్టంట్ సగ్గుబియ్యం దోశ.. తయారు చేసుకోండిలా..

Sabudana Dosa Recipe: పులియబెట్టే అవసరం లేకుండా సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు టేస్టీగా దోశ చేయవచ్చు. ఇది మృధువుగా రుచికరంగా ఉంటుంది. వావ్ అనిపిస్తుంది. ఈ ఇన్‍స్టంట్ సగ్గుబియ్యం దోశ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Sabudana Dosa Recipe: నోట్లో అలా కరిగిపోయే సాఫ్ట్ ఇన్‍స్టంట్ సగ్గుబియ్యం దోశ.. తయారు చేసుకోండిలా..

దోశలు లెక్కకు మిక్కిలి రకాలు ఉంటాయి. విభిన్నమైన రుచులతో వెరైటీ దశలు చేసుకోవచ్చు. అయితే, కొన్ని రకాల దోశలను పులియబెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఎక్కువగా టైమ్ లేని సమయాల్లో ఇలాంటి ఇన్‍స్టంట్ దోశలు బాగా ఉపయోగపడతాయి. అలాంటిదే ‘సగ్గుబియ్యం దోశ’. పిండి పులియబెట్టకుండానే ఈ దోశను వేసుకోవచ్చు. నోట్లో ఇట్టే కరిగిపోయేలా సాప్ట్‌గా, టేస్టీగా ఈ దోశ ఉంటుంది. సగ్గుబియ్యం దోశను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం దోశకు కావాల్సిన పదార్థాలు

  • ఓ కప్ సగ్గుబియ్యం
  • ఓ కప్ బియ్యం
  • పాపు కప్పు పెరుగు
  • దోశ కాల్చేందుకు నూనె
  • మూడు పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)
  • ఓ ఇంచు అల్లం ముక్క
  • ఓ ఉల్లిపాయ (సన్నగా తరగాలి)
  • కాస్త కొత్తిమీర
  • సరిపడా ఉప్పు
  • రెండు రెబ్బల కరివేపాకు

సగ్గుబియ్యం దోశలు తయారు చేసే విధానం

  • ముందుగా వేర్వేరు గిన్నెల్లో సగ్గుబియాన్ని, బియ్యాన్ని రెండు గంటలు నాబెట్టాలి.
  • రెండు గంటలు నానిన సగ్గుబియ్యం, బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మరో మిక్సీ జార్‌లో అల్లం తరుగు, తరిగిన పచ్చిమిరి వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
  • ఆ తర్వాత మెత్తగా గ్రైడ్ చేసుకున్న సగ్గుబియ్యం పిండిలో ఈ అల్లం, మిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
  • దాంట్లోనే పెరుగు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉందనిపిస్తే కాస్త నీరు వేసుకోవాలి. దీంతో దోశ పిండి రెడీ అవుతుంది.
  • స్టవ్‍పై పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం వేడెక్కాక పిండి పోయాలి. ఈ పిండిని సాధారమ దోశకు చేసినట్టు గట్టిగా రుద్దకూడదు. ఇవి కాస్త మందంగానే ఉంటాయి.
  • దోశను బాగా కాలనివ్వాలి. ఇది కాలేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది.
  • దోశ కాస్త కాలాక అంచుల వెంట నూనె వేయాలి. మీడియం మంట మీద కాల్చాలి. ఆ తర్వాత మరోవైపునకు తిప్పి కాల్చాలి. రెండు వైపుల కాలాక పెనం నుంచి తీసేయాలి. అంతే సగ్గుబియ్యం దోశలు రెడీ అవుతాయి.

 

సగ్గుబియ్యం దోశలు మృధువువుగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, వేరుశగనల చట్నీతో ఈ దోశలను తినొచ్చు. ఆ దోశ కడుపుకు కూడా లైట్‍గా ఉంటుంది. సాప్ట్‌గా ఉండటంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.