Best SUV in India : 8లక్షల బడ్జెట్​కే రెండు బెస్ట్​ ఎస్​యూవీలు- మరి ఫ్యామిలీకి ఏది బెస్ట్​?-skoda kylaq vs mahindra xuv 3xo price and specifications comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Suv In India : 8లక్షల బడ్జెట్​కే రెండు బెస్ట్​ ఎస్​యూవీలు- మరి ఫ్యామిలీకి ఏది బెస్ట్​?

Best SUV in India : 8లక్షల బడ్జెట్​కే రెండు బెస్ట్​ ఎస్​యూవీలు- మరి ఫ్యామిలీకి ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Nov 26, 2024 11:10 AM IST

Best SUV in India : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ స్కోడా కైలాక్​.. ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఏది ఫ్యామిలీ ఎస్​యూవీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కి ఉన్న డిమాండ్​ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు సరికొత్త, స్టైలిష్​, ఫీచర్​ లోడెడ్​ ప్రాడక్ట్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. వీటిల్లో ఇటీవలే విడుదలైన స్కోటా కైలాక్​ ఒకటి! ఈ ఎస్​యూవీపై కస్టమర్స్​లో ఆసక్తి కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఎస్​యూవీ.. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఏది ఫ్యామిలీ కారుగా గుర్తింపు తొచ్చుకుంటుంది? ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కైలాక్ వర్సెస్ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ: ధర..

స్కోడా కైలాక్ ఎస్​యూవీ రూ .7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో నవంబర్ 6న భారతదేశంలో విడుదలైంది. మిగిలిన లైనప్ ధరలు డిసెంబర్ 2024లో అప్డేట్ అవుతాయి. మరోవైపు, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ధర రూ .7.79 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అంటే ఈ రెండు ఎస్​యూవీలు దాదాపు ఒకటే ధరతో ఒకదానికొకటి పోటీగా లభిస్తాయి.

స్కోడా కైలాక్ వర్సెస్ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ: డైమెన్షన్స్

డెమెన్షన్స ప్రకారం, స్కోడా కైలాక్ పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,783 ఎంఎం. ఎత్తు 1,619 ఎంఎం. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ 3,990 ఎంఎం పొడవు, 1,821 ఎంఎం వెడల్పు, 1,647 ఎంఎం ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్స్​యూవీ 3ఎక్స్ ఓ 2,600 ఎంఎం వీల్​బేస్​ను కలిగి ఉంది. ఇది స్కోడా కైలాక్ 2,566 ఎంఎం వీల్​బేస్​ కంటే 34 ఎంఎం ఎక్కువ. స్కోడా ఎస్​యూవీ 446 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది, ఇది ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ 364 లీటర్ స్టోరేజ్ కంటే 82 లీటర్లు ఎక్కువ!

స్కోడా కైలాక్ వర్సెస్ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ : స్పెసిఫికేషన్లు

స్కోడా కైలాక్ 1.0-లీటర్, మూడు సిలిండర్ల టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 113 బీహెచ్​పీ పవర్​ని, 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్- సింగిల్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్​పీ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ 128 బీహెచ్​పీ పవర్, 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్​లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ సీఆర్​డీఐ యూనిట్ నుంచి పవర్​ పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​, 6-స్పీడ్ ఏఎమ్​టీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్​పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం