Mahindra XUV 3XO on road price : హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Mahindra XUV 3XO on road price Hyderabad : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీరు ఒక మంచి ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా? మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా వచ్చిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకి కస్టమర్స్ నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్..
ఎంఎక్స్1 పెట్రోల్- రూ. 9.29లక్షలు
ఎంఎక్స్2 ప్రో పెట్రోల్- రూ. 11లక్షలు
ఎంఎక్స్3 పెట్రోల్- రూ. 11.59లక్షలు
ఎంఎక్స్2 డీజిల్- రూ. 11.88లక్షలు
ఎంఎక్స్3 ప్రో- రూ. 11.88లక్షలు
ఎంఎక్స్2 ప్రో ఏటీ పెట్రోల్- రూ. 12.59లక్షలు
ఎంఎక్స్2 ప్రో డీజిల్- రూ. 12.89లక్షలు
ఎంఎక్స్3 డీజిల్- రూ. 13.50లక్షలు
ఏఎక్స్5 పెట్రోల్- రూ. 13.50లక్షలు
ఎంఎక్స్3 ఏటీ పెట్రోల్- రూ. 13.80లక్షలు
ఎంఎక్స్3 ప్రో డీజిల్- రూ. 13.99లక్షలు
ఎంఎక్స్3 ప్రో ఏటీ పెట్రోల్- రూ. 14.11లక్షలు
ఎంఎక్స్3 డీజిల్ ఏఎంటీ డీజిల్- రూ. 14.47లక్షలు
ఏఎక్స్5 డీజిల్- రూ. 14.96లక్షలు
ఇదీ చూడండి:- Most unsafe Tata car : ఈ టాటా ఫ్యామిలీ కారుకు '0' సేఫ్టీ రేటింగ్- మీరు వాడుతున్నారా?
ఏఎక్స్5 ఎల్ టర్బో పెట్రోల్- రూ. 15.02లక్షలు
ఏఎక్స్5 ఏటీ పెట్రోల్- రూ. 15.33లక్షలు
ఏఎక్స్7 టర్బో పెట్రోల్- రూ. 15.33లక్షలు
ఏఎక్స్5 డీజిల్ ఏఎంటీ డీజిల్- రూ. 15.93లక్షలు
ఏఎక్స్7 డీజిల్- రూ. 16.79లక్షలు
ఏఎక్స్5 ఎల్ టర్బో ఏటీ పెట్రోల్- రూ. 16.85లక్షలు
ఏఎక్స్7 ఎల్ టర్బో పెట్రోల్- రూ. 17185లక్షలు
ఏఎక్స్7 టర్బో ఏటీ పెట్రోల్- రూ. 17.15లక్షలు
ఏఎక్స్7 డీజిల్ ఏఎంటీ- రూ. 1.716లక్షలు
ఏఎక్స్7 ఎల్ డీజిల్- 18.37లక్షలు
ఏఎక్స్7 ఎల్ టర్బో ఏటీ పెట్రోల్- రూ. 18.98లక్షలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ.. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్లో అందబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 9.29లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 18.98లక్షలు
సాధారణంగా ఆటోమొబైల్ సంస్థలు ఒక వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో దాని ఎక్స్‌షోరూం ప్రైజ్‌ని మాత్రమే ప్రకటిస్తాయి. కానీ ఆ కారు ఆన్‌రోడ్ ప్రైజ్ భిన్నంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సంప్రదించాల్సి ఉంటుంది. కారుపై డిస్కౌంట్స్, ఆఫర్స్ వంటివి ఉంటే, మీ ఖర్చులు తగ్గుతాయి.
సంబంధిత కథనం