మానవ శరీరంలో పాంక్రియాస్‌ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్  ఉత్పత్తి చేస్తాయి. 

By Bolleddu Sarath Chandra
Nov 26, 2024

Hindustan Times
Telugu

కాలేయంలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్‌ను నియంత్రించే బాధ్యత ఇన్సులిన్ నిర్వహిస్తుంది.

ఇన్సులిన్ ప్రధానంగా శరీరంలో కండరాలు, కొవ్వు నిల్వలు గ్లూకోజ్‌ను గ్రహించేలా సహకరిస్తాయి. 

కాలేయంలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌గా నిల్వ చేస్తుంది.  ఇది ప్రొటీన్ మెటబలిజంను నియంత్రిస్తుంది. 

 ఇన్సులిన్ తయారు చేసే బీటా కణాల సంఖ్య తగ్గినా, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ ఏర్పడినా శరీరంలో సమతుల్యత లోపిస్తుంది. క్రమంగా డయాబెటిస్ సిండ్రోమ్‌ ఏర్పడుతుంది. 

సాధారణంగా టైప్1 డయాబెటిస్‌ ఉన్న వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్ ఉన్నవారిలో మందులు  జబ్బును నియంత్రించలేకపోతే ఇన్సులిన్ అవసరం అవుతుంది. 

ఇన్సులిన్‌ లేకుండా డయాబెటిస్‌ జయించడం  కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుంది. కార్బోహైడ్రెట్లను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నయ డైట్‌లతో దీనిని అదుపు చేయవచ్చు. 

డయాబెటిక్ కీటో అసిడోటిస్‌ ఏర్పడిన వారికి ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. 

కాలేయం, మూత్ర పిండాల సమస్యలు ఉన్న వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. 

గుండెపోటు ఉన్నవారు,  మెదడులో రక్తనాళాల సమస్య ఉన్న వారిలో కూడా ఇన్సులిన్ తప్పనిసరి కావొచ్చు. 

ఇన్సులిన్ బాటిళ్లను 4-8 డిగ్రీల ఉష్ణోగ్రత  మధ్య నిల్వ చేయాలి. డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే చల్లటి గదిలో నేరుగా ఎండ తగలని ప్రదేశంలో నిల్వ చేయాలి.

డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తినొచ్చా? ప్రభావం ఎలా..

Photo: Unsplash