NNS November 26th Episode: అమర్​, భాగీకి మనోహరి అంతరాయం- నిర్మల, శివరామ్​​​​​ వార్నింగ్- మిస్సమ్మ భార్యగా ఉండకూడదన్న ఆరు-nindu noorella saavasam serial november 26th episode bhagamathi irritates manohari zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 26th Episode: అమర్​, భాగీకి మనోహరి అంతరాయం- నిర్మల, శివరామ్​​​​​ వార్నింగ్- మిస్సమ్మ భార్యగా ఉండకూడదన్న ఆరు

NNS November 26th Episode: అమర్​, భాగీకి మనోహరి అంతరాయం- నిర్మల, శివరామ్​​​​​ వార్నింగ్- మిస్సమ్మ భార్యగా ఉండకూడదన్న ఆరు

Sanjiv Kumar HT Telugu
Nov 26, 2024 12:44 PM IST

Nindu Noorella Saavasam November 26th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 26 ఎపిసోడ్‌‌లో అమర్, భాగీ లోపల ఏం చేస్తున్నారో అని కంగారుగా డిస్టర్బ్ చేస్తుంది మనోహరి. ఇంతలో స్నానం చేస్తున్నట్లుగా వచ్చి తమ రొమాన్స్‌ను కవర్ చేస్తాడు అమర్. అది కాదని మనోహరి వాదిస్తుంటే శివరామ్, నిర్మల వార్నింగ్ ఇస్తారు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 26th November Episode)లో అమర్‌ రూంలోంచి పొగ వస్తుందని అందరూ అక్కడే ఉంటారు. ఇంతలో రాథోడ్‌ వచ్చి ఆఫీసుకు టైం అవుతుంది మా సార్‌ ఇంకా రెడీ కాలేదా? అని అడుగుతాడు.

టవల్ వేసుకుని

మీ సార్‌ నీతో పాటు బయటకు రాలేదా..? అని శివరామ్ అడగ్గానే లేదని రాథోడ్‌ చెప్తాడు. లోపల ఉన్న భాగీ ఏవండి రాథోడ్‌ కూడా వచ్చాడు ఏదైనా చేయండి అని చెప్తుంది. అమర్‌ టవల్‌ తీసుకుని భుజం మీద వేసుకుంటాడు. మనోహరి డోర్‌ కొడుతుంది. అమర్‌ వచ్చి డోర్‌ ఓపెన్‌ చేస్తాడు. ఏంటీ ఎందుకు డోర్‌ కొడుతున్నారు. అందరూ ఇక్కడ ఉన్నారేంటి..? అంటాడు అమర్​. ఏంటిది అమర్‌ అసలు లోపల ఏం జరుగుతుంది అని అడుగుతుంది మనోహరి.

ఏముంది. మిస్సమ్మ సాంబ్రాణి వేసుకుంటుంది. నేను స్నానానికి వెళ్లాను అంటాడు అమర్​. అది కాదు అమర్‌.. అంటూ మనోహరి ఏదో అనబోతుంటే.. ఏంటమ్మా ఇది కాదు అది కాదు అంటున్నావు భార్యాభర్తలు అన్నాకా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. దానికే ఇంత హడావిడి చేస్తే ఎలా..? అంటాడు శివరామ్. అంటే పొగను చూసి అంతా భయపడుతుంటే.. అంటుంది మనోహరి. మిస్సమ్మ చెప్పింది కదా..? సాంబ్రాణి వేసుకుంటున్నాను అని అయినా అందరం వచ్చి తప్పు చేశాము. వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకుని నిర్మల అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

భార్యగా ఉండకూడదు

అప్పుడు మనోహరికి సైగల ద్వారా సాంబ్రాణి పొగ ఆయనే వేశారని మిస్సమ్మ చెప్తుంది. దాంతో మనోహరి ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతుంది. గార్డెన్‌‌లో ఆరు అటూ ఇటూ తిరుగుతూ అమర్‌ సాంబ్రాణి వేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. గుప్త నవ్వుతూ.. బాలిక లోపల వీక్షించినది నువ్వు జీర్ణించుకోలేక ఇలా అటూ ఇటూ తిరుగుతుంటివా..? అసలు నీ భాద ఏంటి బాలిక.. ఆ బాలికకు నువ్వే దగ్గరుండి నీ పతి దేవుణితో పెళ్లి చేసితివి. అసలు ఆ బాలిక నీ పతి దేవుణికి భార్యగా ఉండకూడదా..? అంటాడు గుప్తా.

ఉండాలి.. ఉండ కూడదు.. అంటుంది అరుంధతి. ఎందుకు నీకు ఆంత బాధ నీ పతి దేవుణితో ఉన్నది నీ తోబుట్టువే కదా..? అంటూ గుప్త నోరు జారగానే అరుంధతి షాకింగ్‌‌గా ఏంటి గుప్త గారు ఏమన్నారు అని అడుగుతుంది. అంటే నీ పతి దేవుణికి భార్య అయినప్పుడు నీ తోబుట్టువు లాంటిదే కదా? అంటాడు గుప్త. దీంతో ఆరు ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు పిల్లలు మీటింగ్‌ పెట్టుకుని తాము అనుకున్నదే జరిగిందని హ్యాపీగా ఫీలవుతారు.

అమ్మ స్థానాన్ని లాక్కుందామని

ఇంతలో అంజు అందరినీ తిడుతూ అసలు నాన్న మిస్సమ్మకు సాంబ్రాణి వేయడం ఏంటి..? అంటూ తిడుతుంది. మిస్సమ్మ మన అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూస్తుంది అంటుంది. శివరామ్, నిర్మల కూడా హ్యాపీగా ఫీలవుతారు. అమర్‌, ఆరును దాటి ముందుకు పోలేడేమో అనుకున్నాం. కానీ, ఇప్పుడు కొత్త జీవితం వైపు వెళ్తున్నాడు అనుకుంటారు. మరోవైపు మనోహరి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ.. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.

ఇంతలో అక్కడికి మిస్సమ్మ వస్తుంది. మనూ నాకు సిగ్గేస్తుంది అంటుంది. నాకు కోపం వస్తుంది అని మనోహరి అనగానే అయినా.. పొగ మా రూంలో వస్తే.. మంట ఇక్కడ వస్తుందేంటి..? అంటుంది భాగీ. నువ్వేదో మాయ చేసి అమర్‌‌తో సాంబ్రాణి వేయించుకున్నావని నాకు తెలియదు అనుకున్నావా..? అంటుంది మనోహరి. అయ్యో పిచ్చి మను మాయ చేసేది మంట పెట్టేది నువ్వు.. నాకు ప్రేమించడం తప్పా ఇంకేమైనా వస్తుందా..? చెప్పు అంటుంది భాగీ.

వెటకారంగా అమ్ము

ప్రేమ గీమ అన్నావనుకో చంపేస్తాను. నీ సంతోషం, ఈ ఆనందం అంతా మూడు రోజుల ముచ్చటే.. ఎలా వచ్చావో అలా వెళ్లేలా నేను చేస్తాను అంటుంది మనోహరి. నువ్వేం చేయలేవు.. నేను ఇక్కడే ఉంటా.. వెళ్లాల్సింది.. వెళ్లబోయేది నువ్వే అంటూ భాగీ కోపంగా మనోహరిని హెచ్చరిస్తుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కరుణ, భాగీకి ఫోన్‌ చేసి సాంబ్రాణి గురించి అడుగుతుంది.

షాక్‌ అయిన భాగీ నీకెలా తెలుసని అడుగుతుంది. దీంతో కరుణ తాను అమర్‌‌తో ఫోన్‌ మాట్లాడిన విషయం చెప్తుంది. ఆ విషయం చెప్పగానే భాగీ సంతోషంగా కరుణకు థాంక్స్‌ చెప్తుంది. మరోవైపు ప్రిన్సిపాల్‌ అమ్మును పిలిచి ఎక్స్‌కర్షన్‌‌కు ప్లాన్‌ చేస్తున్నామని చెప్తుంది. కేవలం ఆరు, ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం మాత్రమే ఈ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నామని చెప్తుంది. దీంతో అమ్ము ప్రిన్సిపాల్‌‌ను వెటకారంగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner