Samantha: సెకండ్ హ్యాండ్ అని ఎగతాళి.. ఎమోషనల్ అయిపోయిన సమంత.. ఎందుకు ఇలా నిందిస్తారంటూ ఎదురు ప్రశ్న
Samantha second hand Comments: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తనపై జరిగిన ట్రోలింగ్‌పై ఎమోషనల్‌గా స్పందించింది. అలానే పెళ్లి గౌనుని రీ-మోడల్ చేయించడంపై కూడా ఓపెన్ అయ్యింది.
హీరోయిన్ సమంత మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్‌పై ఘాటుగా సమాధానమిచ్చింది. వరుణ్ ధావన్‌తో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాల్ని గురించి ఓపెన్‌గా చెప్పేసింది.
సెకండ్ హ్యాండ్, యూజ్డ్
నాగచైతన్య విడాకులు, ట్రోలింగ్ గురించి ఎదురైన ప్రశ్నకి సమంత సమాధానమిస్తూ.. ‘‘వివాహ బంధం విచ్ఛిన్నమైతే.. ఎందుకు మహిళల్నే నిందిస్తారు..? నాపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. సెకండ్ హ్యాండ్, యూజ్డ్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్‌లు కూడా కొంత మంది ఇచ్చారు. ఇలాంటి మాటలు బాధపెడతాయని కూడా ఆలోచించరా? ఏం చేస్తాం.. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం. క్లిష్ట సమయంలో నా ఫ్యామిలీ, స్నేహితులు నాకు అండగా నిలిచారు’’ అని సమంత చెప్పుకొచ్చింది.
నాలుగేళ్లకే విడాకులు
నాగచైతన్య, సమంత కొన్నేళ్ల పాటు ప్రేమ ఉండి.. 2017లో వివాహం చేసుకున్నారు. కానీ.. వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో ఈ జంట భేదాభిప్రాయాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. మరోవైపు నాగచైతన్య డిసెంబరు 4న హీరోయిన్ శోభితా ధూళిపాళ్లని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
పెళ్లి గౌను రీ-మోడల్
నాగచైతన్య వివాహం వార్త వెలుగులోకి రాగానే సమంత కోపంతో తన పెళ్లి గౌనుని రీ-మోడల్ చేయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆమెకి ఎదురవగా.. ‘‘నేను కోపం లేదా ప్రతీకారంతో పెళ్లి గౌనును రీ-మోడల్ చేయించలేదు. నిజానికి అలా చేయించేందుకు చాలా బాధపడ్డాను కూడా. కానీ.. కొన్ని విషయాల్లో జీవితం ఎక్కడైతే ముగుస్తుందో. మళ్లీ అక్కడే నుంచే ప్రారంభమవుతుంది’’ అని సమంత చెప్పుకొచ్చింది.
ఇద్దరు హీరోయిన్స్ పేర్లు చెప్పిన సమంత
మయోసైటిస్‌తో 2022లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత.. కొన్ని రోజుల పాటు సినిమాలకి కూడా దూరంగా ఉండిపోయింది. అదే సమయంలో.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఉండటంతో.. ఆ సిరీస్ నుంచి తప్పుకోవాలని తొలుత సమంత భావించింది. ఆ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేకి కూడ ఆ విషయం చెప్పిన సమంత.. తన స్థానంలో ఓ ఇద్దరు హీరోయన్ల పేర్లని కూడా చెప్పింది. ఈ విషయాన్ని సమంత ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది.
అనారోగ్యం కారణంగా తాను ఈ వెబ్ సిరీస్‌లో నటించలేనని.. తనకి బదులుగా కియారా అద్వానీ లేదా కృతి సనన్‌ని తీసుకోవాలని చెప్పిందట. కానీ.. రాజ్ అండ్ డీకే అందుకు అంగీకరించకుండా.. సమంత కోలుకునే వరకూ ఎదురుచూశారు. సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో యాక్షన్ సీన్స్‌లోనే కాదు.. ఎమోషనల్ సీన్స్‌లోనూ సమంత తన ముద్ర వేసింది.