Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 334 స్టాక్​ని ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 26th november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 334 స్టాక్​ని ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రూ. 334 స్టాక్​ని ట్రాక్​ చేయండి- లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Nov 26, 2024 08:14 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 993 పాయింట్లు పెరిగి 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 315 పాయింట్లు వృద్ధిచెంది 24,222 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1072 పాయింట్లు పెరిగి 52,207 వద్దకు చేరింది.

“నిఫ్టీ50.. రెండు సెషన్లలో 1000 పాయింట్లకు పైగా లాభపడింది. 23260 జోన్ సమీపంలో కనిష్టాల నుంచి బలమైన పుల్​బ్యాక్​ని ఇది సూచిస్తుంది. 24500 జోన్ కీలక రెసిస్టెన్స్​గా ఉంది. అది దాటితే మార్కెట్​లు మరింత పెరగొచ్చు. 23,800 సపోర్ట్​గా ఉంది,” అని పరిశోధన - ప్రభుదాస్ లిల్లాధర్ వైస్​ ప్రెసిడెంట్​, టెక్నికల్​ రీసెర్చ్​ వైశాలి పరేఖ్​ తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9947.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6907.97 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించరు.

నవంబర్​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 30,999.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,651.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.99శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.27శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఫెడరల్​ బ్యాంక్​:- బై రూ. 212.88, స్టాప్​ లాస్​ రూ. 205, టార్గెట్​ రూ. 225

డోమ్స్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 3069, స్టాప్​ లాస్​ రూ. 2950, టార్గెట్​ రూ. 3250

సిప్లా:- బై రూ. 1507, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1545

పెట్రోనెట్​ ఎల్​పీజీ:- బై రూ. 334, స్టాప్​ లాస్​ రూ. 324, టార్గెట్​ రూ. 345

కాన్​కర్​:- బై రూ. 807, స్టాప్​ లాస్​ రూ. 795, టార్గెట్​ రూ. 845

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం