Honda Activa EV : రేపే హోండా యాక్టివా ఈవీ లాంచ్- సూపర్ రేంజ్‌తో ఛార్జింగ్ కష్టాలు దూరం..
Honda Activa electric launch date : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ భారతదేశంలో రేపు లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త టీజర్‌ని సంస్థ విడుదల చేసింది. టీజర్లో విశేషాలతో పాటు రేంజ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రియులకు కీలక అప్డేట్! మచ్ అవైటెడ్ హోండా యాక్టివా ఈవీ.. నవంబర్ 27, బుధవారం భారత మార్కెట్లో లాంచ్కానుంది. జపనీస్ ద్విచక్ర వాహన దిగ్గజం నుంచి వస్తున్న ఈ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు, లాంచ్‌కి ముందు, మరో టీజర్‌ని సంస్థ విడుదల చేసింది. ఇందులో ఒక కీలక అప్డేట్ని పంచుకుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ పేరుతో వస్తున్న ఈ ఈవీ ఛార్జింగ్ పోర్ట్‌ని టీజర్లో కంపెనీ ప్రదర్శించింది.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి ప్రధాన పోటీదారులలో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్ మాదిరిగానే హోండా యాక్టివా ఈ కూడా కొంత ఛార్జింగ్ పోర్ట్‌ను పొందుతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది. అయితే హోండా ఛార్జింగ్ పోర్ట్ దాని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఇంతకు ముందు విడుదల చేసిన ఒక టీజర్లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపెబుల్ బ్యాటరీ ప్యాక్‌లతో కూడిన స్వాపెబుల్ బ్యాటరీ టెక్నాలజీని పొందుతుందని స్పష్టమైంది. ఆధునిక మొబైల్ పవర్ ప్యాక్ ఇంటర్ఛేంజబుల్ బ్యాటరీ సెటప్ సైతం ఇందులో ఉండొచ్చు.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్: స్పెసిఫికేషన్స్, రేంజ్..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 104 కిలోమీటర్లు అని సంస్థ ఇప్పటికే వెల్లడించింది.100 శాతం బ్యాటరీ ఛార్జ్‌తో హోండా యాక్టివా ఈ స్టాండర్డ్ మోడ్‌లో 104 కిలోమీటర్ల పరిధిని పొందుతుందని మునుపటి టీజర్ చూపించింది. అదనంగా, ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుగైన థ్రాటిల్ రెస్పాన్స్ కోసం స్పోర్ట్ మోడ్‌ని కూడా పొందుతుంది. అయితే స్పోర్ట్ మోడ్‌తో రేంజ్ తగ్గొచ్చు.
బజాజ్ చేతక్, విడా వీ1 మాదిరిగానే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ యాక్టివా ఎలక్ట్రిక్ కుటుంబ కొనుగోలుదారును లక్ష్యంగా చేసుకుంటుందని భావిస్తున్నారు.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్: ఫీచర్లు..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు ట్రిమ్ లెవల్స్‌లో లభిస్తుందని ఇంతకు ముందు మరో టీజర్లో వెల్లడైంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు విభిన్న రకాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ని పొందుతుంది. ఇది రెండు ట్రిమ్ స్థాయిలను సూచిస్తుంది. హోండా యాక్టివా ఈవీ తక్కువ వేరియంట్లు టీఎఫ్టీ డిస్ప్లేని పొందుతాయి, హై ట్రిమ్ లెవల్ మల్టీ కలర్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది.
పెద్ద స్క్రీన్‌లో బ్యాటరీ ఛార్జర్, రేంజ్ లెఫ్ట్, స్పీడ్, మోడ్ వంటి కీలక సమాచారం కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ ఫంక్షనాలిటీని పొందుతుందని పెద్ద స్క్రీన్ సూచించింది. మునుపటి టీజర్లలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్లోని సీటును ఇప్పటికే సంస్థ రివీల్ చేసింది.
ఇక హోండా యాక్టివా ఈవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్ తర్వాత తెలుస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం