Utpanna ekadashi: నేడే ఉత్పన్న ఏకాదశి, మీ రాశిని బట్టి ఈ పరిహారాలు చేస్తే జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి
Utpanna ekadashi: ఉత్పన్న ఏకాదశి ఈరోజే. ఈ రోజున మీరు ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. మీ రాశిని బట్టి కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా విష్ణువు కరుణా కటాక్షాన్ని పొందవచ్చు.
ఉత్పన్న ఏకాదశి నేడే. తెలుగు పంచాంగంలో ఏటా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి... ఉత్పన్న ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1.01 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3.47 గంటలకు ముగుస్తుంది. ఇక పూజ చేసేందుకు శుభసమయం ఉదయం ఆరు నుంచి 9 గంటల మధ్య ఉన్న కాలం.
ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. అలాగే పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. సాయంత్రం పూట మళ్లీ స్నానం చేసి విష్ణు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుని రావాలి. జీవితంలో బాధలు తగ్గి సుఖ సంతోషాలు పెరగాలన్నా, కష్టాలు తీరి ప్రశాంతమైన జీవితం కావాలన్నా మీ రాశి ప్రకారం మీరు కొన్ని పరిహారాలు చేయాలి. ఆ పరిహారాలేంటో తెలుసుకోండి.
మేష రాశి
ఉత్పన్న ఏకాదశి రోజున, మేష రాశివారు గంగా జలంతో విష్ణువుకు అభిషేకం చేసి, అతనికి పసుపు, చందనం పూయాలి.
వృషభ రాశి
విష్ణువు అనుగ్రహం పొందడానికి వృషభ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని జపించాలి.
మిథున రాశి
మిథున రాశి వారు ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తికి శనగపిండితో చేసిన లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి.
కర్కాటక రాశి
శ్రీ మహావిష్ణువు అనంతమైన అనుగ్రహం పొందడానికి కర్కాటక రాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున భగవంతుడికి పసుపు పువ్వులతో పూజ చేయాలి.
సింహ రాశి
ఉత్పన్న ఏకాదశి రోజున సింహ రాశి వారు విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేస్తే అన్ని విధాలా మంచిది.
కన్యా రాశి
కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి పసుపు గంధాన్ని స్వామికి పూసి పూజ చేయాలి.
తులా రాశి
ఉత్పన్న ఏకాదశి పర్వదినాన తులా రాశి వారు విష్ణువుకు పచ్చిపాలు, గంగా జలాలతో అభిషేకం చేసి పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు విష్ణువుకు పెరుగు, తేనెతో అభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి.
ధనుస్సు రాశి
ఉత్పన్న ఏకాదశి రోజున ధనుస్సు రాశి వారు శ్రీ హరి విష్ణువుకు పసుపు రంగు పూలు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది.
మకర రాశి
ఉత్పన్న ఏకాదశి రోజున మకర రాశి వారు శ్రీ విష్ణు చాలీసా పఠించి విష్ణువు అనుగ్రహం పొందాలి.
కుంభ రాశి
ఉత్పన్న ఏకాదశి రోజున కుంభ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లం, శనగపప్పు సమర్పించి పసుపు ముద్దలను సమర్పించాలి.
మీన రాశి
ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం పొందడానికి మీన రాశి వారు ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని పఠించాలి.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించవలెను)