తెలుగు న్యూస్ / ఫోటో /
నెలకు రూ. 2వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇక్కడ రూ. 1కోటి సంపాదన!
- ద్రవ్యోల్బణంతో పడిపోతున్న 'మనీ' పవర్‌పై పోరాటానికి ఉన్న సాధనం ‘ఇన్వెస్ట్మెంట్’. మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. అది ఎలా అంటే..
- ద్రవ్యోల్బణంతో పడిపోతున్న 'మనీ' పవర్‌పై పోరాటానికి ఉన్న సాధనం ‘ఇన్వెస్ట్మెంట్’. మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. అది ఎలా అంటే..
(1 / 5)
ఇన్ఫ్లేషన్.. మన ఫైనాన్షియల్ పవర్‌ని ఎప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఒకప్పుడు రూ. 100కి చాలా కొనుక్కునే వాళ్లం. కానీ ఆ వందకు ఇప్పుడు లీటరు పెట్రోల్ కూడా దొరకడం లేదు కదా! భవిష్యత్తులో.. పరిస్థితులు ఇంకా కష్టంగా మారతాయి.
(2 / 5)
అందుకే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వల్ల దీర్ఘ కాలంలో మంచి లాభాలు పొందొచ్చు.
(3 / 5)
అయితే, స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ రిస్క్‌ని తగ్గించేందుకు ఉపయోగపడే సాధనం.. మ్యూచువల్ ఫండ్స్! స్టాక్ మార్కెట్‌తో పోల్చితే, మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువగా ఉంటుంది.
(4 / 5)
మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్నులు పొందొచ్చు. లో- రిస్క్ ఉండే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ చారిత్రకంగా 12శాతం రిటర్నులు ఇచ్చింది.
(5 / 5)
ఈ నేపథ్యంలో మీ వయస్సు 25ఏళ్లు అయితే, ఇప్పటి నుంచి 35ఏళ్ల పాటు ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే.. మీ రిటైర్మెంట్ (60ఏళ్లు) సమయానికి మీ వద్ద సుమారు రూ. 1.3 కోట్లు (12శాతం రిటర్న్ రేటు) ఉంటాయి. ఇంకా త్వరగా కోటి సంపాదించాలంటే.. నెలవారీ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. (ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు