Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. తెలుగులోనే స్ట్రీమింగ్!
Trending OTT Movies Telugu On Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వాటిలో అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు ఉంటాయి. అయితే, ఇవాళ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు, అందులో ఉన్న తెలుగు బెస్ట్ 5 మూవీస్‌పై ఓ లుక్కేద్దాం.
Netflix OTT Trending Movies Telugu: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అగ్రగామిగా దూసుకుపోతోంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులతో ఓటీటీ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే, ఇవాళ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు, వాటిలో చూడాల్సిన, తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ది బెస్ట్ 5 మూవీస్ ఏంటో లుక్కేద్దాం.
దేవర ఓటీటీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర. మొదటి పార్ట్‌గా వచ్చిన దేవర సినిమాకు రూ. 300 కోట్ల బడ్జెట్ కాగా బాక్సాఫీస్ వద్ద రూ. 380 నుంచి 581 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్న దేవర మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దేవర టాప్ 1 ట్రెండింగ్‌లో రన్ అవుతూ సత్తా చాటుతోంది. ఓటీటీలోకి వచ్చి దాదాపుగా నెల కావొస్తున్న ఇప్పటికీ అన్ని సినిమాలను దాటుకుని దేవర ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో ఉండటం విశేషం. కమర్షియల్ సక్సెస్ అందుకున్న దేవర సినిమాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
బఘీర ఓటీటీ
కన్నడ స్టార్ హీరో, రోరింగ్ స్టార్ శ్రీమురళి యాక్ట్ చేసిన రీసెంట్ సూపర్ హీరో జోనర్ మూవీ బఘీర. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటించిన శ్రీమురళి బఘీర సినిమాకు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ముందుగా కన్నడ, తెలుగులో స్ట్రీమింగ్ అయిన బఘీర ఆ తర్వాతి రోజు నుంచే తమిళం, మలయాళంలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో బఘీర టాప్ 2 ట్రెండింగ్ స్థానంలో అదరగొడుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ అందుకున్న బఘీర సినిమాకు డైరెక్టర్ సూరి దర్శకత్వం వహించారు.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ ఓటీటీ
లేడి సూపర్ స్టార్ నయనతార బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీగా వచ్చిన ఓటీటీ మూవీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగిన విషయం తెలిసిందే. ఎన్నో అవాంతరాలు దాటి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోన్న నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 3 స్థానంలో నిలిచింది.
దో పత్తి ఓటీటీ
ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ డ్యూయెల్ రోల్‌లో నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ దో పత్తి. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన దో పత్తి ఓటీటీ ట్రెండింగ్‌లో నాలుగో స్థానం సంపాదించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా దో పత్తి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సత్యం సుందరం ఓటీటీ
కార్తి, అరవింద్ స్వామి మెయిన్ లీడ్ రోల్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సత్యం సుందరం సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ ట్రెండింగ్‌లో ఉన్న పది సినిమాల్లో ఇవి చూడాల్సిన బెస్ట్ మూవీస్‌గా ఉన్నాయి.
మరో ఓటీటీ ట్రెండింగ్ 5 సినిమాలు
ఇదిలా ఉంటే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఆరో స్థానంలో యానిమేటెడ్ మూవీ స్పెల్‌బౌండ్ ఉంది. అలాగే, ఏడో ప్లేస్‌లో కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ ది బకింగ్‌హమ్ మర్డర్స్, 8వ స్థానంలో డీసీ సూపర్ హీరో మూవీ ఫ్లాష్, 9వ స్థానంలో జీటీ మ్యాక్స్, ఆఖరి పదో స్థానంలో హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ నిలిచాయి.