EPFO alert : ఉద్యోగులకు అలర్ట్​! ఇలా చేయకపోతే కీలక​ బెనిఫిట్స్​ దక్కవు..-employees must activate uan by november 30 to access eli scheme benefits ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epfo Alert : ఉద్యోగులకు అలర్ట్​! ఇలా చేయకపోతే కీలక​ బెనిఫిట్స్​ దక్కవు..

EPFO alert : ఉద్యోగులకు అలర్ట్​! ఇలా చేయకపోతే కీలక​ బెనిఫిట్స్​ దక్కవు..

Sharath Chitturi HT Telugu

UAN activation process : ఈఎల్ఐ పథకానికి యూఏఎన్ చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఈపీఎఫ్ఓను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 2024 నవంబర్ 30లోగా ఉద్యోగులు తమ యూఏఎన్​ని యాక్టివేట్ చేసి ఆధార్​ని బ్యాంకు ఖాతాలతో లింక్ చేసుకోవాలి. లేకపోతే కీలక బెనిఫిట్స్​ దక్కవు!

ఇలా చేయకపోతే కీలక​ బెనిఫిట్స్​ దక్కవు.. (Mint)

ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకం నుంచి ప్రయోజనం పొందడానికి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) చెల్లుబాటు అయ్యేలా చూడాలని రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫలితంగా సంబంధిత ఉద్యోగులు యూఏఎన్​ నెంబర్​ని యాక్టివేట్​ చేసుకోవాలి.

కేంద్ర బడ్జెట్ 2024-2025 ప్రకారం.. అర్హత కలిగిన ఉద్యోగులందరూ తమ యూఏఎన్​ని యాక్టివేట్ చేయాలి. వారి ఆధార్​ని, బ్యాంకు ఖాతాలతో లింక్ చేయాలి. పీఎఫ్ పాస్​బుక్​లను చూడటం, డౌన్​లోడ్ చేసుకోవడం, ఆన్​లైన్ క్లెయిమ్​లను దాఖలు చేయడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్ (డీబీటీ) పథకాల ద్వారా చెల్లింపులు అందుకోవడం వంటి వివిధ సేవలను ఉద్యోగులు ఉపయోగించుకునేందుకు యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ అవసరమైన ప్రక్రియలు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన ఉద్యోగులందరికీ ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలు అందుతాయని హామీ ఇవ్వడానికి, 2024 నవంబర్ 30 నాటికి యాక్టివేషన్​, లింకింగ్​ ప్రక్రియలు పూర్తయ్యేలా చూడాలని యజమానులను కోరారు. మరిన్ని సలహాలు అవసరమైతే సంబంధిత ఈపీఎఫ్​ఓ కార్యాలయం నుంచి పొందవచ్చు.

"ఈఎల్​ఐ స్కీమ్ కింద ప్రయోజనాలు అర్హులైన ఉద్యోగులకు డీబీటీ ద్వారా పంపిణీ అవుతాయి కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన ఉద్యోగులందరికీ సంబంధించి 2024 నవంబర్ 30 నాటికి బ్యాంకు ఖాతాలో యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ ఉండేలా చూడాలని యజమానులను కోరుతున్నాము," అని డబ్ల్యూపీఎఫ్ఓ నవంబర్ 22న ఒక సర్క్యులర్​లో తెలిపింది.

ఈఎల్ఐ ప్రయోజనాలను పొందడానికి మీ యూఏఎన్​ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..

  • ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్​కి వెళ్లండి.
  • "ఇంపార్టెంట్​ లింక్స్​" క్రింద ఉన్న "యాక్టివేట్ యూఏఎన్" లింక్​పై క్లిక్ చేయండి.
  • మీ యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవలను పూర్తి స్థాయిలో పొందడానికి ఉద్యోగులు తమ మొబైల్ నంబర్ ఆధార్​త అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి.
  • ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్​కు అంగీకరించండి.
  • మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్​కి ఓటీపీ రావాలంటే 'గెట్ ఆథరైజేషన్ పిన్' మీద క్లిక్ చేయండి.
  • యాక్టివేషన్ పూర్తి చేయడం కోసం ఓటీపీని ఎంటర్ చేయండి.
  • ప్రాసెస్​ సక్సెస్​ అయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పాస్ వర్డ్ వస్తుంది.

ఈపీఎఫ్​ఓలో చేరిన ఉద్యోగుల సంఖ్య.. గతేడాది సెప్టెంబర్​తో పోల్చుకుంటే ఈ ఏడాది 9.33శాతం పెరిగి 18.81లక్షలుగా నమోదైంది. ఈ మేరకు నవంబర్​ 20న విడుదలైన పేరోల్​ డేటా సూచించింది.

2024 సెప్టెంబర్​లో ఈపీఎఫ్ఓ 9.47 లక్షల మంది కొత్త సభ్యులను నమోదు చేసిందని, ఇది 2023 సెప్టెంబర్​తో పోలిస్తే 6.22 శాతం అధికమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరిగిన అవగాహన, ఈపీఎఫ్ఓ ఔట్​రీచ్​ కార్యక్రమాలు ఈ కొత్త సభ్యత్వాల పెరుగుదలకు కారణమని పేర్కొంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.