AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టే…శ్రీలంక వైపు పయనిస్తున్న వాయుగుండం, దక్షిణ కోస్తాకు వర్షసూచన-cyclonic storm is moving towards sri lanka rain forecast for the south coast of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టే…శ్రీలంక వైపు పయనిస్తున్న వాయుగుండం, దక్షిణ కోస్తాకు వర్షసూచన

AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టే…శ్రీలంక వైపు పయనిస్తున్న వాయుగుండం, దక్షిణ కోస్తాకు వర్షసూచన

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 26, 2024 01:22 PM IST

AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనం నేపథ్యంలో దాని ఎఫెక్ట్‌ ఏపీపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఏపీకి తుఫాను ముఫ్పు తప్పినట్టే?
ఏపీకి తుఫాను ముఫ్పు తప్పినట్టే?

AP Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలినట్టు ఐఎండి గుర్తించింది. ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ట్రింకోమలీకి దక్షిణ ఆగ్నేయంగా 340 కిమీ, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 630 కిమీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిమీ మరియు చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 830 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వాయుగుండం రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఉత్తర-వాయువ్య దిశగా శ్రీలంక - తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగనుంది.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుండి 29 వరకు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 29వ తేది వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి మంగళవారం రాత్రికి గంటకు 50-70కిమీ, బుధవారం నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

నవంబర్ 26, మంగళవారం :

• నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 27, బుధవారం :

• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 28, గురువారం:

• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 29, శుక్రవారం :

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Whats_app_banner