How to know UAN number : మీ యూఏఎన్ నెంబర్ తెలియదా? ఇలా తెలుసుకోండి..
How to know UAN number : మీ యూఏఎన్ నెంబర్ మీకు తెలియదా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కింద చెప్పినట్టు.. యూఏఎన్ నెంబర్ని చెక్ చేసుకోండి..
How to know UAN number : యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అనేది.. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) చందాదారులందరికీ లభించే ఒక గుర్తింపు సంఖ్య. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పాన్ ఎలాగో.. ఉద్యోగులకు ఈ యూఏఎన్ అలాగ!
బహుళ యజమానులను కలిగి ఉన్న ఈపీఎఫ్ చందాదారుల కోసం ఒక సాధారణ గుర్తింపు ఐడీలగా పనిచేస్తుంది ఈ యూఏఎన్. చందాదారులు అనేక మంది యజమానులు ఇచ్చిన అనేక సభ్య ఐడీలను కలిగి ఉండవచ్చు కాని ఒక యూఏఎన్ మాత్రమే ఉంటుంది.
ఈపీఎఫ్ వెబ్సైట్లో యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమ ఖాతాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ నంబర్ సహాయంతో వారు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు.
యూఏఎన్ నెంబర్ తెలుసుకోవాలంటే..
How to find UAN number : 1. ముందుగా యూఆర్ఎల్తో కూడిన మెంబర్ ఇంటర్ఫేస్ ఈపీఎఫ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. ఇక్కడ 'ఇంపార్టెంట్ లింక్స్'లోకి వెళ్లి 'నో యువర్ యూఏఎన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. కింది చిత్రంలో చూపించిన విధంగా సిస్టమ్ ఇప్పుడు మీ ‘మొబైల్ నంబర్’, 'క్యాప్చా' అడుగుతుంది.
4. ఈ దశలో, సిస్టమ్ మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ / పాన్ / మెంబర్ ఐడీ క్యాప్చా చూపించమని అడుగుతుంది.
5. ఇప్పుడు మీ యూఏఎన్‌ని వెల్లడించడానికి 'షో మై యూఏఎన్' క్లిక్ చేయాలి.
మీ యుఏఎన్ను యాక్టివేట్ చేయండి..
UAN number activate : మీ యూఏఎన్ ఇంకా యాక్టివేట్ కాకపోతే దానిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఇదే ఈపీఎఫ్ యూజర్ ఇంటర్ఫేస్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
ఇక్కడ 'యాక్టివేట్ యువర్ యూఏఎన్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
యూఏఎన్, మెంబర్ ఐడీ, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి ఇతర వివరాలను అడుగుతుంది. ఇప్పుడు సిస్టమ్ ఆథరైజేషన్ పిన్ని జనరేట్ చేస్తుంది.
UAN number activatation process : యూఏఎన్ యాక్టివేట్ చేయడానికి పిన్ ఎంటర్ చేస్తే చాలు.
అయితే ఈపీఎఫ్ఓ రికార్డుల్లో యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ తప్పనిసరిగా ఉండాలి. యూఐడీఏఐ రికార్డుల ప్రకారం సభ్యులు ఆధార్ నంబర్‌తో చెల్లుబాటు అయ్యే మొబైల్ కలిగి ఉండాలి.
అలాగే, సభ్యుల ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, సభ్యుల ఆధార్ వివరాలతో సమానంగా ఉండాలి.
సంబంధిత కథనం