రూ.1000 నెలవారీ సిప్ ప్రారంభిస్తే ఎన్ని కోట్లు వస్తాయి? మీ వయసు 20, 30, 40లో ఉంటే ఈ లెక్కలు చూడండి-mutual funds investment if you start a monthly sip of 1000 at age of 20s 30s 40s check out these calculations ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.1000 నెలవారీ సిప్ ప్రారంభిస్తే ఎన్ని కోట్లు వస్తాయి? మీ వయసు 20, 30, 40లో ఉంటే ఈ లెక్కలు చూడండి

రూ.1000 నెలవారీ సిప్ ప్రారంభిస్తే ఎన్ని కోట్లు వస్తాయి? మీ వయసు 20, 30, 40లో ఉంటే ఈ లెక్కలు చూడండి

Anand Sai HT Telugu
Nov 26, 2024 01:00 PM IST

Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడులు వస్తాయి. నెలవారీ సిప్ ప్లాన్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి. మీ వయసు 20, 30, 40లలో ఉంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో చూడండి..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి (Unsplash)

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరిగే కొద్దీ రాబడులు కూడా పెరుగుతాయి. ఏ వయసులో ఎంత పొదుపు చేయగలరో, మెచ్యూరిటీ సమయంలో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా భారీ రాబడిని పొందవచ్చు. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు బెటర్ ఆప్షన్. తక్కువ మొత్తంలో రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన రాబడికి గ్యారెంటీ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ పనితీరును మునుపటి సంవత్సరాల రాబడిని పరిశీలించడం ద్వారా అంచనా వేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఒకేసారి పెద్ద మెుత్తంలో లంప్‌సమ్ పెట్టుబడి లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఇన్వెస్ట్‌మెంట్. ఎక్కువ మంది వ్యక్తులు సిప్‌ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రతి నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే రాబడి చక్రవడ్డీ రూపంలో వస్తుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ, వడ్డీ చెల్లింపులు అసలు మొత్తానికి యాడ్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఏ వయస్సులో ప్రారంభించాలి? పెట్టుబడి ఎన్ని సంవత్సరాలు వస్తుంది?

ఉదాహరణకు మీరు 20 సంవత్సరాల వయస్సులో నెలవారీ రూ.1000 సిప్‌ని ప్రారంభించవచ్చు. 30 సంవత్సరాల వయస్సులో రూ.3000, 40 సంవత్సరాల వయస్సులో రూ.4000 SIPని ప్రారంభించొచ్చు. 60 సంవత్సరాల వయస్సులో మీ చేతిలో ఎంత డబ్బు ఉంటుందో చూద్దాం.. సగటు వార్షిక ప్రాతిపదికన 12 శాతం రాబడిని లెక్కిద్దాం..

మీరు 20 సంవత్సరాల వయస్సులో నెలవారీ సిప్ రూ 1000 ప్రారంభిస్తే మరో 40 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 12 శాతం వార్షిక ఆదాయంతో 60 ఏళ్ల నాటికి 1.19 కోట్లు వస్తాయి. ప్రతి సంవత్సరం మీ SIPని 10 శాతం పెంచుకుంటే మీరు రూ. 3.5 కోట్లు పొందవచ్చు.

30వ సంవత్సరంలో నెలవారీ సిప్‌ని రూ.3000 ప్రారంభిస్తే తదుపరి 30 సంవత్సరాల పాటు సిప్‌ని కొనసాగించవచ్చు. 12 శాతంతో మీ 60వ సంవత్సరంలో రూ.1.05 కోట్లు పొందవచ్చు. ఇక్కడ కూడా మీరు ప్రతి సంవత్సరం సిప్‌ మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటే 2.65 కోట్లు పొందవచ్చు.

40 ఏళ్ల వయస్సులో రూ.4000 నెలవారీ సిప్‌ని ప్రారంభిస్తే తదుపరి 20 సంవత్సరాల పాటు సిప్‌ని కొనసాగించవచ్చు. 10 శాతంతో మీరు మీ 60వ సంవత్సరంలో రూ.80 లక్షలు పొందవచ్చు.

Whats_app_banner